నా నుదుట కుంకుమ నీవు..
నా కనుబొమ్మలు గీసే చిత్రం నువ్వు..
నా మూగ మనసు పాడే మధురమైన రాగం నువ్వు..
నా పాదం ఆడితే..ఆ నాట్యం నువ్వు..
నా పెదవి అరమోడ్పు గా నవ్వితే..ఆ నవ్వే నువ్వు..
నా సిగ్గులోన దాగుంది నువ్వు..
నా చేయి అందుకునే హస్తమే నువ్వు..
నను నడిపించే మార్గదర్శివి నువ్వు..
నా గమ్యం నువ్వు..
నా ఇహం నువ్వు..
నా పరమూ నువ్వు..
మొత్తంగా నేనే నువ్వు!!!
- మీ లక్ష్మి
ప్రేమించే ప్రతి ఆడపిల్లకి నా ఈ కవిత అంకితం
No comments:
Post a Comment