Friday, May 8, 2015

బస్సులు లేవు...
ఆటో డ్రైవర్ల దోపిడీలు ఆగవు..
ఉన్న వాహనాల్లో కూరుకుపోడాలు..
అలాగే సర్దుకుపోడాలు..
..
పరీక్ష రాసే అమ్మాయిలూ..అబ్బాయిలూ
ఆఫీసులకి వెళ్ళే జీతగాళ్ళు..
మరి మొగవాళ్ళు..ఆడాళ్ళు..
అందరికీ ఉంటాయి గా గమ్యాలు...
తప్పట్లేదు నానా అగచాట్లు..
..
కరగడంలేదు ఆర్టీసీ కార్మికుల గుండెలు..
ఏనాటికి ఆగునో వారి సమ్మెలు??
ఇటు పట్టించుకోవు ప్రభుత్వాలు..
వారికుంటేగా ఈ కష్టాలు!!!
పక్కనెట్టేస్తారు విన్నపాలు!!!
..
మొత్తానికి జనం గుండెల్లో గుబులు..
రవాణా వ్యవస్థ కుదేలు..
ఈ కధంతా ముగిసాక మోపుతారు జనం పైనే భారాలు!!!

-మీ లక్ష్మి



No comments:

Post a Comment