Friday, May 1, 2015

చావు ఆ ఒడ్డు..
పుట్టుక ఈ ఒడ్డు..
మధ్యన నడిసంద్రం..
మన బ్రతుకు..
ఈదు..తుది వరకు..
ఆ ఒడ్డు కి చేరేవరకు..
అంటే..మరణించే వరకు
...
ఇక మునక ..చావే అంటావా??
కాదురా..అది కేవలం ఓ పరీక్ష రా!!!
మునుగుతావు..మళ్ళీ పైకి తేలతావు...
చావుని చేరేదాకా అలా మునకలేస్తూ..
పైకి తేలుతూ ఉంటావు..
..
చివరకి ఈది ఈది..
ఆ ఒడ్డు కి చేరతావు..
మరణానికి లొంగుతావు



- మీ లక్ష్మి

No comments:

Post a Comment