Saturday, May 2, 2015

నీ కంట కన్నీరు వస్తే..
నా కన్ను చమరుస్తుంది..
నీ నీడై బాధ వెంటాడితే..
నీ తోడై నా ధైర్యం వస్తుంది..
నీకేదో కష్టం వస్తే..
ఇష్టంగానే నా మనసు దాన్ని తీరుస్తుంది..
ఓ చిన్న కలత నీ చెంత చేరితే..
నా చేయి ఆ కలతల్ని చెరిపేస్తుంది..
ఇక నీ పయనం తుది వరకు సాగుతూ ఉంటే..
నా అడుగు నీ వెంటే వస్తుంది...
నీ ఆత్మ పరమాత్మలో చేరేలోపే..
నా ఆత్మ అందున మమేకం అయిపోతుంది..
స్వర్గానికి మన ప్రేమే చేరుతుంది!!!


- మీ లక్ష్మి

No comments:

Post a Comment