సంధ్యవేళ..ఆ సూర్యుని ఎరుపు
నీ కుంకుమ లో దాగుందేమో!!
నల్లని మబ్బుల ఆ నీలం..
నీ కురుల సౌందర్యం లో దాగిందేమో!!
ఆ ఇంద్రధనుస్సు నీ కనుబొమ్మై..
కోన చూపేదో నాటిందేమో!!
పారాడే సెలయేటి ఆ హొయలన్ని
నీ నడకలోనే ఒదిగాయేమో!!
ఆ పాల కడలిలోని శ్వేత వర్ణమే..
నీ మేని రంగై మెరిసేనేమో!!
ఎంతని పొగడను నిన్ను..
సరిపోదులే ఆ మిన్ను..
నీ సోయగాల మత్తులో సోలిపోయింది నా కన్ను..
-మీ లక్ష్మి
నోట్: ఒక ప్రియుడు వర్ణిస్తే ఎలా ఉంటుందో అలా ఊహించి రాయటం జరిగింది
నీ కుంకుమ లో దాగుందేమో!!
నల్లని మబ్బుల ఆ నీలం..
నీ కురుల సౌందర్యం లో దాగిందేమో!!
ఆ ఇంద్రధనుస్సు నీ కనుబొమ్మై..
కోన చూపేదో నాటిందేమో!!
పారాడే సెలయేటి ఆ హొయలన్ని
నీ నడకలోనే ఒదిగాయేమో!!
ఆ పాల కడలిలోని శ్వేత వర్ణమే..
నీ మేని రంగై మెరిసేనేమో!!
ఎంతని పొగడను నిన్ను..
సరిపోదులే ఆ మిన్ను..
నీ సోయగాల మత్తులో సోలిపోయింది నా కన్ను..
-మీ లక్ష్మి
నోట్: ఒక ప్రియుడు వర్ణిస్తే ఎలా ఉంటుందో అలా ఊహించి రాయటం జరిగింది
No comments:
Post a Comment