Sunday, May 24, 2015

నాకో ఆశ ..
మోసం లేని లోకం..
కుట్రలు లేని ప్రపంచం ..
చూడాలని ... చూసి తరించాలని !!
కానీ.. అది  కలలోనే సాధ్యమని ..
మరు నిముషం నా మది చెప్పినంతనే ..
నా కంటి వెంట బాధ కన్నీటిలా ప్రవహించేనే ...
ఇలా బాధపడుతూ ఉండనా ??
లేక లోకం తీరు మార్చడానికి పూనుకోనా ??
అని నన్ను నేనే నిలదీసుకున్నా
అయితే తొడెవరూ లేక ..
ఒంటరినై పోరాటం సాగించలేక ..
ఇక ప్రారబ్ధం ఇదే అని సర్దుకుపోయా !!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment