Tuesday, May 5, 2015

పొద్దున్నే వార్తాపత్రికలా..
ఓ చెడు వార్త పలుకరిస్తే..
"దేవుడా నాకెందుకీ కష్టాలు?" అంటాం..
మొరపెట్టుకుంటాం..
మరి ఓ చక్కటి కాఫీలా ఓ మంచి కబురు వచ్చి చేరుకుంటే...!!!!
దేవుడికి కృతజ్ఞత తెలుపలేము..
ఆయన్ని మరచిపోతాము..
..
చూశారా.. మంచికైతే దేవుడు అక్కరలేదు..అక్కరకి రాడు
చెడు జరిగినచో ఆ దేవుడే కారకుడు..
..
మనిషి నిందలకు అంతు లేదు సుమీ!!
దేవుడా మాపై కోప్పడకు..
నిందాస్తుతి అనుకో ..మమ్మల్ని క్షమించేసుకో!!!
-మీ లక్ష్మి
నోట్: ఎవ్వర్నీ ఉద్దేశించి రాయలేదు అని మనవి

No comments:

Post a Comment