Thursday, April 23, 2015

నిను చూడక మేము ఉండలేము..
నీ గానం వినక గోధూళి వేళ అవదు..
సిరిమల్లె పూవు నీ గొంతు విననిదే వికసించదు..
చిన్నారి చిలకమ్మ తన పలుకులను..
నీ గానం వింటే మరువక మానదు..
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు అంటూ..
జ్ఞాపకాలలో మమ్ము ముంచెత్తి..
మా మనస్సులో మౌన గీతాలు పలికించిన..
ఓ జానకమ్మ...
నీవు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలి..
పరిమళించే..గుబాళించే..
గాన మాధుర్యం మాకు అందించాలి.....!!

No comments:

Post a Comment