రాత ఏమిటో తెలియదు..
జాతకం అక్కరకు రాదు..
ఎప్పుడు ఏమి జరుగునో..జరగనీ..
ఈ క్షణాన్నిఆస్వాదిస్తాను..
మరుక్షణం..ప్రళయం వస్తే రానీ...
అప్పటిదాకా గడిపిన జీవితం చాలనుకొంటాను..
రేపేమి??అన్న దిగులు దరిచేరనివ్వను
మరుజన్మకై ఎపుడు నే ఎదురు చూడను..
No comments:
Post a Comment