నీ కోసం...
రెక్కలు కట్టుకు రాలేకపోవచ్చు
నీ కోసం...
నేను ఏమీ ఇవ్వలేకపోవచ్చు
నీ కోసం...
నేను సంపద ఏమీ కూడబెట్టకపోవచ్చు
...
నీ కోసం
కన్నీటిని నీకు దురం చేయగలను
నేను ఎదురు చూపలు చూడగలను
నీలో నిలువెల్ల నిండిపోగలను...
-మీ లక్ష్మి
THESE ARE MY THOUGHTS AND I HOPE U PPL WILL LIKE THIS BLOG :) I WELCOME COMMENTS AND FEEDBACK. BUT PLEASE DO NOT POST ANYTHING OBSCENE BY WAY OF COMMENTS
నీ కోసం...
రెక్కలు కట్టుకు రాలేకపోవచ్చు
నీ కోసం...
నేను ఏమీ ఇవ్వలేకపోవచ్చు
నీ కోసం...
నేను సంపద ఏమీ కూడబెట్టకపోవచ్చు
...
నీ కోసం
కన్నీటిని నీకు దురం చేయగలను
నేను ఎదురు చూపలు చూడగలను
నీలో నిలువెల్ల నిండిపోగలను...
-మీ లక్ష్మి
కళ్ళ ముందు కనబడుతున్నా...
నోరు మెదపరేం??
ఆర్తనాదాలు వినబడుతున్నా...
అడుగు కదలదెేం??
ఆలసత్వమో లేక నిర్లక్ష్యమో!!!
లేక రెండూనేమో!!!
అమానుషాలు చూసిన గానీ
ఆలోచన రాదేమో
ఆక్రోశముా రాదేమో!!!
బహుశా మానవత్వం కరువేమో
నేను నేలపైనున్నా..
చూపు ఆకాశం వైపే
అందుకోవాలనే ఆశ...
నను వీడదేమో బహుశా...
ఎదురు చూపులు మానేశా
గగన సీమపై కన్నేశా
...
ఇదే మానవుని మనోఁదశ
ఒక దానితో ఆగదు ఆతని అభిలాష
నరుని పయనానికి ఉండదు అంతిమ దిశ
అతని త్రుష్ణ కు ఏది మరి చివరి దశ??
ఎగిరావని ...
రెక్కలు చేసిన సాయం మరిచెదవా??
నడక నేర్చావని...
పాదముల ఉనికిని మరిచెదవా ??
పైకి ఎక్కావని ....
ఊతమిచ్చిిన నిచ్చననే ప్రశ్నించెదవా??
లేదుగా కన్నా!!!
మరి అహమెందుకు ఓరన్న...
నీవు అధిరోహించన మెట్లను మరువకుమో నాన్న
మల్లి మస్తాను...
నీతో పాటు నీ ప్రతిభ కుాడా కనుమరుగాయె
పరులు గుర్తించినా మన వారు గురుతెరుగరాయె
కీర్తి శిఖరాలు నీకు నివాళులిడగా
స్వర్గమునకేగితివాయె
కన్నిీటిని ధారల్లో అందరినీ ముంచేసితివాయె నీ దేశం నీకు ఏమీ ఇవ్వకున్నా...
భారతీయ కీర్తి నీ వలన విశ్వ వ్యాప్తమాయె