Saturday, June 6, 2015

నోరు తెరిచి అడగలేదు..
మనసులోని మాట నీకు విడమరచి చెప్పలేదు ..
నా అంతరంగంలోకి తొంగి చూసి ..
కళ్ళల్లో దాగిన విషయమే దోచేశావు ..
నా కష్టాన్ని త్రుటిలో నాకు దూరం చేశావు..
దాన్ని సాయం అనుకోద్దు అన్నావు ..
బాధ్యత అనుకోని నా సమస్యను తొలగించావు ..
స్నేహమంటే చేయూత అని తెలియజేశావు ..
నీ స్నేహం నాకు వరంలా తోచేలా చేశావు..

-మీ లక్ష్మి

No comments:

Post a Comment