Thursday, June 11, 2015

జగానికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేక ..
నాలో నేనే కొనసాగించా .. ఒక శోధన ..
దొరికెను నా లోన దాగున్న వేదన ...
అది ఇద్దామా  వద్దా ??  అని మనసు  తనని  తానే ప్రశ్నించుకోగా ...
జవాబొచ్చింది .. "వద్దు " అని ...
ప్రపంచానికి  ఇవ్వాల్సింది  వేదన కాదు .. దుఃఖమూ కాదు ..
"పెదవులపై చిరునవ్వు .. ఈ లోకానికి అందివ్వు "
అని నా మనసు అనగా ...
సంతోషాన్నే పంచుతున్నా !!!
అందరినీ నవ్విస్తున్నా !!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment