పల్లవించు స్వరముల కలయిక .. పాట
శ్రుతి లయల సంగమమే పాట
ఆనందం , ఆహ్లాదం కలిగించేది పాట
హృదయం లోతుల్లో కలిగే స్పందన పాట
సాహిత్యం సంగీతం మేళవించినది పాట
త్యాగయ్య గొంతులో అలరారినది పాట
భాషా అంతరాలు , బేధాలు లేనిది పాట
సముద్ర కెరటాల ధ్వని పాట
మలయ మారుతం చేసే సుమధురమైన శబ్దమే పాట
వసంతంలో కోకిల గానమే పాట
అన్నమయ్య పద సింగారమే పాట
హృదయంతరాళను కదిలించేది పాట
పశు పక్షాదులను కూడా పులకరింపజేసేది పాట
జీవితంలో ఆహ్లాదాన్ని నింపేది పాట
పెదవుల నుండి వెలువడే అద్భుతమైన పదజాలమే పాట
భగవంతుని చేరేందుకు సులభమైన మార్గం పాట !!
-మీ లక్ష్మి
శ్రుతి లయల సంగమమే పాట
ఆనందం , ఆహ్లాదం కలిగించేది పాట
హృదయం లోతుల్లో కలిగే స్పందన పాట
సాహిత్యం సంగీతం మేళవించినది పాట
త్యాగయ్య గొంతులో అలరారినది పాట
భాషా అంతరాలు , బేధాలు లేనిది పాట
సముద్ర కెరటాల ధ్వని పాట
మలయ మారుతం చేసే సుమధురమైన శబ్దమే పాట
వసంతంలో కోకిల గానమే పాట
అన్నమయ్య పద సింగారమే పాట
హృదయంతరాళను కదిలించేది పాట
పశు పక్షాదులను కూడా పులకరింపజేసేది పాట
జీవితంలో ఆహ్లాదాన్ని నింపేది పాట
పెదవుల నుండి వెలువడే అద్భుతమైన పదజాలమే పాట
భగవంతుని చేరేందుకు సులభమైన మార్గం పాట !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment