Wednesday, December 16, 2015

సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు!!!

సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివ మూర్తయే  బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమః.

శక్తి హస్తం  విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం  రిపురోగఘనం భావయే కుక్కుట ధ్వజం.!!

.....

ఆ షణ్ముఖుని ఆరు ముఖముల వెంట..
మీ అందరి కొరకు ఆశీర్వచనాలు పలకాలని కోరుకుంటూ...

సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు!!!

- మీ లక్ష్మి

Tuesday, December 15, 2015

కుంచె పట్టి బొమ్మ గీస్తే..
అందాలొలికేనట..!!
ప్రాణం పోసుకొని..
మన కనుల లోగిళ్ళలో "బాపూ బొమ్మ" నిలిచిపోయేనట..!!
తెరపై ఆయన చూపిన పదహారణాల తెలుగు సౌరభం..
మన మనసులు దోచుకెళ్ళెనట..!!
ముళ్ళపూడి వారితో జత కట్టి చేసిన యాత్ర..
"స్నేహమంటే ఇదే కదూ" అని మనకి అనిపించేలా చేసేనట..!!
కళ అనేది ఓ చిత్ర పటమైతే...
దానికి హంగులు దిద్దిన.. అద్భుత కళాకారుడు "బాపూ"!!
ఆయన స్థానం సుస్థిరం మన మనసుల్లో.. నేడు.. రేపూ!!

- మీ లక్ష్మి

బాపు గారి జయంతి సందర్భంగా...!!!

మన "బాలు"..
పాట వినిన చాలు..
పల్లవించేను మన హృదయాలు..
"బాల" గంధర్వుని గానామృతము
స్వీకరించి పులకించును ప్రాణాలు..
గమకాలూరు స్వరాల అలలపై..
మనం అలా తేలిపోయి..
అబ్బ..!! ఎంత హాయి..!!
యోగమంటి సంగీత సాధనలో..
నిత్యం తనను తాను మరిచే..
గాన కోవిదుని మధుర గీతములు విన..
ఎంత హాయి!! ఎంత హాయి!!

అర్ధ శతకం అయినది..
ఇక శతకమే తరువాయి!!

- మీ లక్ష్మి

మన అందరం అభిమానించే "గాన గంధర్వుడు" "ఎస్.పి.బాలు" గారు గాయకుడిగా యాభై సంవత్సరాలు పూర్తి చేశారు!! అందుకే ఈ నజరానా!!

Sunday, December 13, 2015

ఇలా అయిపోయానేం!!

ఇంత నిస్సహాయంగా..
ఏనాడూ లేనే నేను??
నిర్వీర్యం అయ్యేలా..
ఏనాడూ లేనే నేను ??
ఇలా నిర్బలంగా ...
ఎప్పుడూ లేనే నేను??
నిస్చేష్టగా...
ఎ రోజూ అయిపోలేదే నేను??
...
ఎంతో నమ్మకం పెట్టుకున్నందువలన కాబోలు!!
అంతా నా వారు అనుకోవడం వలన కాబోలు!!
బంధాల లోతెంతో చూసూకోకుండా దిగిపోవడం వలన కాబోలు!!
మనసులో  అర్హత చూడకుండా చోటివ్వడం కాబోలు!!
నాకు తోడొస్తారన్న విశ్వాసం నా కళ్ళను కమ్మేయడం వలన కాబోలు!!
ఆ పైన నిజం చూడలేకపోవడం వలన కాబోలు!!
నా విలువైన మనసుని విలువ లేని మనుషుల చేతికి అందించినందువలన కాబోలు!!
...
ఇలా అయిపోయాను!!
శిలలా మిగిలిపోయాను!!

- మీ లక్ష్మి

నొప్పి తెలిసి..
కంట కన్నీరు వచ్చి..
అది అవతలి మనిషికి తెలిసే లోగా..
గుండె తట్టుకోలేక.. ముక్కలు అయిపోదా..??
ఎంతో క్షోభ పడదా??
..
తట్టుకోలేక ఏం చేయాలో!!!

- మీ లక్ష్మి

Monday, December 7, 2015

తల వాల్చడానికి ఒక్క భుజమైనా లేకుంటే..
అదేనేమో "ఒంటరితనం" అంటే..
అదేనేమో "దురదృష్టం" అంటే..
అలాంటి సమయాన నీ వెంట ఉందేది "బాధ" ఒక్కటే..
దానితో "సహజీవనం" తప్పదంతే...
నీ కథంతే.. అంతే!!

- మీ లక్ష్మి

ధీశాలులం మనం!!

భయాన్ని వదులుదామని..
అనుకున్నప్పుడల్లా...
కొత్తగా గుండె తలుపు తట్టి..
మన లోతుల్లోకి చేరి...
అది మనలను కలవరపెడితే...
ఏమి చేయడం అని మనని ప్రశ్నించుకుని...
ఊరకనే ఆ ప్రశ్నలతో మిగులుతామా??
అలా భయాన్ని "ఆక్రమించుకో" అని వదిలేస్తామా??
పోరు సలపాలిగా...
యదను/గుండెను "దడ" అనే దాస్య శృంఖలాల నుండి విడిపించడానికి..
నడుం కట్టాలిగా...
రండి... భయాన్ని జయించి..
ధీశాలులమవుదాం!!!

- మీ లక్ష్మి

Saturday, December 5, 2015

Listen to sai. artist-pramod n lyricist-lakshmi priyanka daita.mp3 by Lakshmi Priyanka Daita #np on #SoundCloud https://soundcloud.com/lakshmi-priyanka-daita/sai-artist-pramod-n-lyricist

https://m.facebook.com/story.php?story_fbid=1221626314520822&id=100000203952999

Friday, December 4, 2015

గ్రహగతులు కూడా..
ప్రేమకి విలన్ లా మారుతున్నాయి..
ఎప్పటి పగో మరి !!!

ప్రేమించడానికి లెక్కలు వేస్కోవాలంట..
అప్పుడు అది ప్రేమెందుకవుద్ది ??!

- మీ లక్ష్మి

Thursday, November 26, 2015

సేక్కూరిటి లేని జీవితాలు

"సెలెబ్రిటీ"లకే సెక్యూరిటీలు...
మరి "కామన్ పీపుల్"కో !!!
వారియేనా ప్రాణాలు?? మాయి కావా??
ఓహ్!! ఇంతమందికీటం కట్టమా ??!
ఓట్లేసినాక.. ఒగ్గేత్తారు!!
ఇంకేం రస్సిత్తారు??!!

- మీ లక్ష్మి

వ్యభిచార కూపాల్లో మగ్గుతున్న మనసులు!!

శ‌రీరాలతో వ్యాపారం చేయచ్చని..
అవి కూడా ఆస్తులని...
వికృత కేళి సాగించడం ఆనందం అని...
కొందరు చాటుతూ..చాటుగా నడిపే..
చీకటిగొట్లలో బంధించబడిన...
పసి మనసుల.. యవ్వనాల వ్యధ...
ఏ మనసునూ తాకక...
అలాగే బాధల అలలు ముంచేస్తోంటే...
వచ్చే ప్రతీ మనిషి శవం లాంటి వారి దేహాలతో సల్లాపిస్తోంటే...
గుండె కార్చే కన్నీటిని గుటకలు వేసి.. దాచేసి..
జీవితాన్ని రాక్షసులు చేసే క్షుద్ర యాగానికి.. సమిధలై..
బలి పశువుల్లాగా మిగిలిపోయే ఆడవారి కథలు ఎలా చెప్పుకోడం ??!!

- మీ లక్ష్మి

Wednesday, November 25, 2015

ఇక నాకు ప్రేమెందుకు అనుకున్నాను..
నాకు నేను బరువయ్యాను...
ఒంటరితనమను సీమకు పరిమితమయ్యాను..
ఆ సరిహద్దు నీవు దాటి..
నా హృదయం బాట పట్టి...
అంతిమంగా నా గుండెను మీటి...
గిలిగింతలు పెట్టి..
అనురాగ బంధనం వేసి...
మనసుతో ముడివేసి...
నన్ను పెనవేసి...
ప్రేమను పరిచయం చేశావు.. "అదీ కొత్తగా"!!
మళ్లీ... నీవూ పోతే...
నా మనస్సౌధం కూలిపోతుంది...
జీవితం కకావికలమౌతుంది...
వదిళెళ్ళవు కదూ!!!

-మీ లక్ష్మి

నేను "నేనే"
"నీవు"గా అయ్యేది లేదు!!
ఇలా అంటూ ఉంటే...
ప్రేమ దొరకదు...
దొరికినా ..అది నిలువదు...!!

-మీ లక్ష్మి

ప్రతిఫలం కావాలా నువ్విచ్చిన ప్రేమకి ??
ఇదిగో బదులుగా నేనిచ్చేది  "ప్రేమే"!!
ఇంతకంటే నేనివ్వలేను సుమీ!!

- మీ లక్ష్మి

నీ నవ్వుల జిలుగుల ముందు..
పున్నమి చంద్రుని వెలుగులు దిగదుడుపే..
ఆ ప్రభలు కనువిందు నాకు !!

-మీ లక్ష్మి

Tuesday, November 24, 2015

ఏంటి హీరో గారూ... పారిపోవాలా ??

ఈ రోజు జరుగుతున్నవి చూసి భయపడిపోయేవాళ్ళు ............. "పారిపోవాలి"  !!! (ఓ పేద్ద హీరో గారు చెప్పినట్లు)
....
ముందు విద్వేషాలు రెచ్చగొట్టే ఈ రాజకీయ సుంటల్ని అనాలి...
దాన్ని పునరుద్ఘాటించే పిచ్చివాళ్ళు కాస్త ఆలోచన చేయాలి ...
...
అంతే కానీ ఓ "ఈడియట్టూ" .....

పారిపోనక్కరలేదు!!
మేం పారిపోము... ఈ నేలను వీడి పోము.. మా తల్లి నుండి విడిపోము!!

ఎందుకంటే ... "సర్ఫరోషీ కి తమన్నా అబ్ 'భీ' హమారే దిల్ మే హై"

"జై హింద్"

- మీ లక్ష్మి

కలలు కన్నా..
నిజాలు అయ్యేవి ఎన్ని ??
కానీ కనులు కల‌లను స్వాగతించడం మానవు !!

-మీ లక్ష్మి

Friday, November 20, 2015

Maanavatvaaniki antham idena ?

ఒకరి మంచి చేయాలనుకునే "అభిమతం" కన్నా...
వారి "మతం" ఏమిటో ముఖ్యం మీకు..
అంతేగా!!!
ఇలాగే సంకుచితత్వం అనే పడవలో పయనిస్తూ ఉంటే.. ఏనాటికీ "శాంతి" ; "సౌఖ్యం" అనే తీరాలకి చేరుకోలేం!!
...
...
ఇది మానవత్వానికి ఇక అంతేగా!!!

...

మనం "మనుషులం" .. మతాలు సంధించిన "బాణాలం " కాదు.. ఒకరినొకరం అంతమొందించడానికి!!

- మీ లక్ష్మి

Tuesday, November 17, 2015

మంది సొమ్ముని దోచేసి దాచేసారు.. ఇప్పుడు వాటిని బయటకు తెచ్చే ప్రయత్నం చేయరు కానీ, విదేశాల నుండి పెట్టుబడులు కావాలట.. ముందర ఆ దోచిన సొమ్ముని అసలైన వారసులకి [భారతీయులకి] ఉపయోగపడేలాగా చేయాలి..
-- మీ శంకర్ శర్మ
ప్రతీ ఒక్కరు మేము వాళ్లకి మదత్తు తెలుపుతున్నాం వీళ్ళకి మదత్తు తెలుపుతున్నాం అంటారు తప్ప నిజ జీవితం లో సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ...
సోషల్ మీడియా లో ఉన్న ధైర్యం నిజ జీవితం లో లేదేమో కదా... ఎం అంటావు లక్ష్మి??
- గమనిక - ఇది కొందరికి మాత్రమే వర్తించదు.. మిగతా వారందరికీ వర్తిస్తుంది..
-- మీ శంకర్ శర్మ
నేను అనే ఒక్క పదం చాలు మనిషి ని అందరికి శత్రువు ని చేస్తుంది, తన వారిని తనకి దూరం చేస్తుంది, చివరకు ఒంటరి గా మిగులుస్తుంది.
మనం చనిపోయే సమయానికి మనకి తోడు గా ఒక్కళ్ళని కూడా సంపాదించుకోలేక పోతే ఈశ్వరుడు ఇచ్చిన ఈ జన్మ ఎందులకో నాకు అర్ధం కాదు..
-- మీ శంకర్ శర్మ 

రూపాయ్ నీ నేస్తమైతే...
అన్ని నీ సొంతమే...
నిజమైన సంతోషం.. ప్రశాంతత తప్ప!!

- మీ లక్ష్మి

Monday, November 16, 2015

అద్దం వైపు చూసి..
అలంకరించుకొనే వేళ..
ఆ అద్దంలో.. మన వారి కురిపించబోయే పొగడ్తలు కనబడి..
చక్కిలిగింతలు పెడతాయి!!
కదూ!!
ఎపుడైనా గమనించారా??

-మీ లక్ష్మి

Saturday, November 14, 2015

కాలి నడకన..
నడుస్తూ ఉంటే..
అరిగిన చెప్పు‌లు..
ఇక అడుగులు వేయడానికి మొరాయిస్తే...
బలవంతంగా ఎటు వైపుకి కదలను?
సంకెళ్ళేవో పాదాలను చుట్టేస్తుంటే...
పయనమేరీతి చేయను??
తీరం పిలుస్తున్నా .. వెళ్ళలేని..
గమ్యం చేరలేని...
నా పాదాలకు కనక ఈ సమయాన నోరే ఉంటే..
తమ గోడు వెళ్ళగక్కేవేమో!!
వాటికే కళ్ళు తోడైతే....
కన్నీటితో నిస్సహాయతకి నీళ్ళు వదిలేవేమో!!!

-మీ లక్ష్మి

చిట్టి తల్లి

చిట్టి పాప నీ ముంగిట్లో ..
తన పసి పాదం మోపి...
ముద్దు ముద్దుగా తన అడుగులతో ముద్దరలు వేసి..
నిన్ను నాన్న అని అంటూ పిలిచి..
కొండంత సంతోషం నీకిస్తుంది...
ప్రేమ అర్ధం తెలుపుతుంది..
కానీ..  బరువు అని అనుకుంటావని..
తనని కాదు.. తన పరువుని కాపు కాసుకుంటున్నావని..
తనకి విలువ కడతావని...
అనుకుని ఉండదు!!
చేతులు దులుపుకునే రోజుకై ఎదురు చూపులు చూస్తున్నావని..ఆలోచించదు!!
పిచ్చి తల్లి కదా... నిన్ను గురించి "మా మంచి నాన్న" అనే ఆలోచన తన మనసు లోనుండి పోనివ్వదు!!!


-మీ లక్ష్మి
నేను ..
నీలో కలిశాక..
ఇంక ఎక్కడ ఉంటాను??
నీ గుండె చప్పుడునై..
నీయందే..నీ లోనే...
మరి...లోకమంతా జల్లెడ పడతావే???
కన్నులు మూసుకో...
నీ ఆలోచనల లోకంలో ఉంటా వాటికి రూపమై!!


-మీ లక్ష్మి
ఇంకా ఊపిరి పోసుకోని ..
ఓ అమ్మ కడుపులోని.. పిండానికి..
అప్పుడే పుట్టిన..
తల్లి లేకపోతే తల్లడిల్లిపోయే...
పసికందుకి...
తమను ఎన్నుకునే హక్కు లేదని...
వారిని తమ వారి కింద ఎంచరేమో!!
మన గొప్ప నాయకులు...
ఔనంటారా కాదంటా‌రా??

-మీ లక్ష్మి
ఇంకా ఊపిరి పోసుకోని ..
ఓ అమ్మ కడుపులోని.. పిండానికి..
అప్పుడే పుట్టిన..
తల్లి లేకపోతే తల్లడిల్లిపోయే...
పసికందుకి...
తమను ఎన్నుకునే హక్కు లేదని...
వారిని తమ వారి కింద ఎంచరేమో!!
మన గొప్ప నాయకులు...
ఔనంటారా కాదంటా‌రా??

-మీ లక్ష్మి

Wednesday, November 11, 2015

భారం పంచుకోడానికి ఏ తోడూ లేకపోతే..
అదేగా పేదరికం...
అదేగా లేమిలో బ్రతకడం!!

-మీ లక్ష్మి

నువ్వు నేను..
ఒకనాడు..
ఒకే తాటిపై నడిచేవాళ్ళం..
నీకు నాకు బేధం లేదనేంతగా..!!
మరి ఇప్పుడు??
ఒకే దారిలో వేరు వేరు దిక్కులకు పయనమై..
బంధానికి సెలవిచ్చేశాం..
"ఇక సెలవు" అనే మాటలు ఒకరికొకరం చెప్పుకున్నాం!!
నీ..నా కన్నులు మళ్ళీ ఎప్పుడు బాసలు చెప్పుకోవని...
మనసు‌ల మధ్య కూల్చలేని గోడొకటి కట్టుకున్నామని..
నాకు తెలిసింది..!!
ఏ బంధానికీ "అమృతం" అందదనీ..
మృత సంజీవని లభ్యం కాదనీ...
"శాశ్వతం "అనే పదం అక్కరకు రాదనీ..
నాకు అవగతమైంది!!

-మీ లక్ష్మి

ఒక బరువు మోయాలంటే..
చాలా. కష్టం...
అదే.... జ్ఞాపకాల బరువు...
నిన్ను తప్పటడుగులు వేయించేంత..
కంట తడి పెట్టించేంత...
గతమంటేనే బెరుకు కలిగించేంత ...బరువైనవి!!
వెనక్కి తిరిగి చూడకూడదనిపించేంత .. చేదైనవి కూడా!!

-మీ లక్ష్మి
లోకం నాకు ఇచ్చే కలతల్ని
తిరిగివ్వాంటే మనసొప్పదు..
మంచితనం ఎక్కువయిందో??!
పుణ్యం. అంటే ప్రీతి కలిగిందో?!!
నవ్వుతూ .. నవ్విస్తూ ఉండమని...
కన్నీటిని ఏ కంటికీ అందివ్వకూడదని..
మనసు నాకు చెప్తోంటే..
చెవులు పాపం వినగా..
నేను తూచా తప్పక..
పాటిస్తున్నా!!!
మంచిని పంచాలని నలు చెరగులా తిరుగాడుతున్నా!!!

-మీ లక్ష్మి



Sunday, November 1, 2015

నీ భావాలు ..

నీ భావాలు పంచుకోవడానికి..
నలుగురు లేరంటే..
మనసులోంచి కంటిని చేరి..
కన్నీళ్లుగా చెంపలపై సంతకాలు చేసి ...
వెళ్ళిపోతాయి !!
లోపల దాచుకోవడం కష్టం మరి!!

-మీ లక్ష్మి

Saturday, October 31, 2015

కెరటాన్ని నేను

ఆదరణ లేకపోయినా...
నేను ఆగిపోను!!
ఎగసే కెరటాన్ని కదా...
అలుపు నాకు తెలియదు
ఎదురొచ్చే అడ్డంకులన్నీ...
అలలు అలలుగా వచ్చి ...
తుడిచిపెట్టుకుంటూ పోక మానను!!

-మీ లక్ష్మి

అర్థం చేసుకొని మసలుకునేదెందరు??
నిన్నెరిగి ప్రపర్తించేదెవ్వరు??
అంతా.. "నేను" అనే భావనే..
నీ మనసు ఎప్పుడూ ఇతరులకి "అలుసే"!!

-మీ లక్ష్మి

సరసాల వెల్లువ

సిగ్గు విడిచి నిన్ను అడగలేను..
చెంత చేరమని!!
సైగలే చేశా.. ఇటు రమ్మని ...
రేయిలో.. నా జత కమ్మని...
...
కౌగిళ్ళ సంకెళ్ళు నన్ను బంధించనీ...
సరసాల డోలికలో మనమే ఊగనీ...
రెండు తనువుల మనువు ఈ పూటే జరగనీ...
మధుర స్మృతులతో మరో పగటికి స్వాగతం పలకనీ..
ఇటువంటి రాతిరులింకెన్నో మనకు రానీ.. మనవైపోనీ...!!

-మీ లక్ష్మి

నీ నా కలయిక ఎలాగ?

ఊరించాయి నీ కన్నులే...
రమ్మని పిలిచాయిలే...
దరి చేరితే.. అరమోడ్పుగా ముడుచుకొన్నాయిలే...
నీ సిగ్గు బిడియం.. నాకు అడ్డు తెరలై ఉండగా...
నిన్ను తాకేది ఎలాగ??
దాహం తీరేదెలాగ??
ఆ తెరలు తొలగించివూ!!
నీ కౌగిట నన్ను బంధించవూ!!

-మీ లక్ష్మి

Sunday, October 4, 2015

ఓ రూపాయి...
మనని వెక్కిరించ నిలుచుంది !!
తన కోసం పాకులాడతామని..
తలనైనా ఇట్టే తాకట్టు పెడతామని..
అడ్డ దారులు తొక్కుతామని..
మంచి చెడుల రూపురేఖలు మరుస్తామని..
..
అంతకు మించి దానికి దాసోహం అవుతామని...
..
మరిచాను!! ఇది వరకే రూపాయికి మోకరిల్లాము కదూ!!

తన వశం అయిపోయిన మనని చూసి వికటాట్టహాసమే చేస్తోంది!!!
...
ఇక అందుకు సిగ్గు పడదామా?? లేక ఏముందిలే అని దులిపేసుకుందామా??
చెప్పరూ!!!!

-మీ లక్ష్మి
అందానికి..
రూపానికిచ్చే విలువ ..
మంచి మనసుకి.. అందులోని భావాలకి...ఇస్తే ..
ఏ బంధానికీ చరమ గీతం పాడే రోజు రాకపోను!!
మనిషి .. మనసు .. మమత అనే మాటలకు నిజమైన అర్థం తెలియును!!

-మీ లక్ష్మి
కాలం పరిగెడుతూ ...
నన్ను కూడా పరుగెత్తిస్తోంది...
వెనక్కి తిరిగి చూస్తే ...
ఆ గడిచిన కాలం వెనుదిరిగే దారేది??
అలా తిరిగొస్తే కాల గమనానికి అర్థం ఏది??
...
 మీ లక్ష్మి

Tuesday, August 25, 2015

ఎటు పోతున్నామో ఏమో ??
...
...
...

అభివృద్ధి శిఖరాలనందడానికని ..
వ్యయ ప్రయాసలకోర్చి ఒక్కో అడుగు వేస్తూ ..
పడుతూ లేస్తూ ..
ఉచ్ఛ నీచాలు పలుకరిస్తోంటే ..
లెక్కసేయక...
ఆకాశమే హద్దని ..
ఘంటాపదంగా చాటుతూ ...
వెళ్తున్నాం అనుకున్నాం !!!
...
నిజం లోతులను కనుగొన్నామా .... అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి ...
...
మానవత్వాన్ని పాతి పెట్టి ...
డబ్బంటే వాంఛ కలిగి ...
"పైసా మే పరమాత్మ " అంటూ ...
నోటుకు పూజలు చేస్తూ ...
దానికి దాసానుదాసులమై ఉంటూ ...
గడ్డి కరవటానికైనా సిద్ధమే అని మనసులో నిర్ణయించేసుకొని ...
మంచి అనేది లేని లోకాన్ని,  మన స్వార్ధం అనే గర్భం నుండి ఊపిరి పోసి .. సృష్టిస్తున్నాం
సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నామ్ !!!
...
..
ఎన్నో అవినీతి పనులు చేస్తున్నాం !!
అధర్మాన్ని పెంచి పోషించి ..మరో స్థితి కారకులమే ఔతున్నామ్ !!
..
అది ఒక ఎతైతే ...
భావి తరాలకి ...
"మీ ఖర్మ ఇదే అని" ..
నాశనమైపోతోన్న పర్యావరణాన్ని ...
కానుకగా ఇస్తున్నాం ...

లోకాన్ని పాప పంకిలం చేసి ...
తెల్ల కాగితమంటి ప్రపంచానికి ...
నలుపు జాడాలని పరిచయం చేసి ...
 స్వచ్ఛతనే లయం చేస్తున్నామ్ !!
..

ఈ సృష్టి  , స్థితి,లయలతో భగవంతులం అయిపోయాం అనుకుంటే ...
అది పిచ్చితనమే ... అంతానికి ఇక ఆరంభమే !!!
అర్థం లేని కోరికలతో ..
అభివృద్ధి అనే ముసుగు తొడుక్కొని ...
అంధకారంలో మనం మగ్గుతూ ..  భవిష్యత్తుని కూడా ప్రశ్నార్ధకం చేస్తూ ...
ఎటు పోతున్నామో !!!

-మీ లక్ష్మి




శకునాలకి లోబడి ఉన్నారు అంతా ..
మంచి చెడుల ఆటలని అవే శాసిస్తాయని ..
నమ్ముతారు అంతా ...
అదే సరియైనది అంటారంతా !!
మంచి జరిగినా ..
చెడు సంభవించినా ..
నీ ప్రయత్నమే ఉండేది !!!
ఏ శకునమూ కాదు !!

-మీ లక్ష్మి


ఒక విజయం ..
వంద మందిని అయస్కాంతంలా ..
నీ వద్దకు లాక్కుని వస్తుంది !!
మరి ఓటమో !!!
నీ వద్ద ఉన్న వాళ్ళని కూడా ..
సునామీలా .. తనతో తోడ్కోనిపోతుంది !!
అది ఆ విజయమో ఓటమో చేసే మాయనుకుంటాం ...
కానీ అదంతా మనిషి మనసుల్లో జరిగే గూడుపుఠాని !!
వారి బుద్ధి చేసే చేష్టలే అన్నీ !!
..
ఓటమిలోనూ ఎవరైనా తోడు ఉన్నారంటే ...
దానికి అర్ధం వారు నిజముగా నీ వారే అని !!
వారు మాత్రమే నీ వారని !!


-మీ లక్ష్మి 
ఆకలి కేకలు జనాల గొంతుల హద్దుల్ని చీల్చుకుని ..
పైకి వస్తుంటే ..
ఆ కేకలు విన్నా ,,,'
కరగని రాతి గుండెలు కలిగున్న ..
వారి సంపదను లేక్కలేసుకు తిరిగేస్తున్న ..
సంపన్న రాజకీయ నాయకులకు ..
దయ; కరుణ ఏ రోజు కలుగుతాయో  ఏమో ??!

-మీ లక్ష్మి 

Sunday, August 2, 2015

ఆకాశమంత ఎత్తుకి ..
ఎదగాలని కోరిక ..
ఉందా బాలకా ??!!
ఉంటుంది .. ఉండాలి ..
ఎదిగాక మరి ??!!
నీ అడుగులను ..
భారమనుకోక ..
మోసిన నేల సంగతి??!!
మరచిపోతే ఎలా డింభకా !!
..
కాస్త ఆలోచించు !!

-మీ లక్ష్మి 
చిన్ని పిచుకలు ..
గూడు కట్టుకుంటే ..
అది చెదిరిపోతే ..
వాటికి ఎంతో బాధ ..
కాని వ్యక్తం చేయలేని ..
మూగ బాధ..
అదే బాధ నేను పడుతున్నా ..
నా కలల గూటిని నీవు చెదరగొట్టగా !!
నా ఆశల పొదరింటిని  నీవు కూల్చేయగా !!
నోరుండి కూడా .. చెప్పలేక ..
కలతపడుతున్నా !!
..
...
...

అయినా నీకు చెప్పడమెందుకు ??
నా కన్నీటిని చూసి నవ్వుతావ్ అంతేగా !!!


-మీ లక్ష్మి

నా గుండెకి.. నీ గుండెకి
స్నేహమనే వారధి కట్టి ..
రెండిటినీ ఏకం చేశా !!
మరి దాన్ని కూల్చేసి ..
బంధాన్ని మసి చేసి ..
ఎటో వెళ్ళిపోయావే .. !!
నువ్వు కనపడితే అడగాలనుంది ...
స్నేహం విలువ తెలియజెప్పాలనుంది !!!

-మీ లక్ష్మి

Saturday, August 1, 2015

వీళ్ళు ఉండాల్సింది మనుషులుండే చోట కాదు..
మృగాల మధ్య..
ఓహ్!! ఆ మృగాలు కూడా భయపడే రీతిలో ఉన్నారేమో వీళ్ళు..!!
..
వారు పలువురి బతుకులు కాలరాస్తుంటే.. ఈ లోకం లో ఉంచడం సబబేనా??
ఈ ప్రపంచం ఓ చిన్న నరకంలా మారుతుంటే.. చూస్తూ ఉండటమే మన కర్తవ్యమా??
..
ఈ ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి!!
-మీ లక్ష్మి
CHINNA ONE LINER


నన్ను అర్థం చేసుకుని.. నాతో ఉండేవారే... నాకు "అర్థం"తో సమానం... కానీ వెల కట్టలేను!!
-మీ లక్ష్మి
నిదుర" ఒడికి చేరితే...
ఎందుకో ఆ ఒడిని వదలాలనిపించదు ...
అంత మైమరిపిస్తుంది!!
కలల వలలు విసిరి ..
ఊరిస్తుంది!!
....
నిద్రంటే అందుకే పిచ్చి అనుకుంటాను!!!
-మీ లక్ష్మి
వయసు ఏదైనా ...
మనసు అదేగా...
అందుకే వయసు పెరుగుతూ ఉన్నా అన్నిటిపై మమకారమనేది చావదేమో!!!
.
.
.
"చింత చచ్చినా పులుపు చావదేమో"!!
-మీ లక్ష్మి
tongue emoticon

మరో ఉదయం ఉందో లేదో జీవితాన??
అనుకుంటూ ... భయపడుతూ..
గడుపుతామా??
ఆశావహులం కదా!!
రేపన్నది తప్పనిసరిగా పస్తుందని..
మరో రోజు.. కొమ్మపై కొత్త చిగురులా పుట్టుకొస్తుందని...
పాదం అడుగేస్తుంది...!!
కన్ను కునుకు తీస్తుంది...!!
...
"ఈరోజు నాదే "అనుకుంటూ మనసు ఉరకలు వేస్తుంది!!

-మీ లక్ష్మి
"బేధం"
ఈ పదమంటే మనకి ఎంత ఇష్టం ..
మనకి మనమే కంచెలు వేసుకున్నాం...
"మనుషులం" అన్న భావన వదిలేశాం..
అందుకే మన మధ్య తిష్ఠ వేసుకుంటోంది కేవలం "ఖేదం"!!

-మీ లక్ష్మి
మంచివాడు...
నేరగాడు కాని నేరగాడు ..
పైగా శిక్షార్హుడు...
ఎందుకంటే .. మంచిని పంచడం అనే నేరం చేస్తుంటాడు!!
..
కలియుగం కదా... చెడుకే అందరూ చేదోడు వాదోడు!!
-మీ లక్ష్మి
ఓ చిన్ని నవ్వులో ఎంత గూడార్థం ఉంటుందో..!!
గుట్టుగా తనలో ఏదో తెలియని శక్తి ఎలా దాస్తుందో??
ఒక్క నవ్వు ఎన్నో భావాలకు తావిస్తుంది...
ఆ చిరునవ్వుకే జీవితాలను అల్లకల్లోలం చేయగల మహత్యం కూడా ఉంది!!!
...
అందుకేనేమో
నవ్వే మందౌతుంది...
రూపం మార్చి విషంలా కూడా మారుతుంది!!

-మీ లక్ష్మి
ఫెయిల్" అనే మాట చూసి ఎంతో "పెయిన్" తెచ్చుకుంటారు...
ఆ పెయిన్ కి పాపం మందులు కూడా లేవు"..
మన" అనుకునే వారి ఓదార్పులు తప్ప...!!
కానీ వారికి దక్కేది ఏదీ లేదు.. వారి దెప్పి పొడుపులు తప్ప!!
-మీ లక్ష్మి
మీరు వదిలిన మిసైళ్ళ కంటే ఎత్తుకి...
ఆ భగవంతుని సన్నిధికి ..
చేరిన మీకు...
మా అందరి అశృ నివాళి!!!
అబ్దుల్ కలాం గారు.....
మీరు చెప్పిన మంచి మాటలు..
మనసులో పదిలంగా దాచుకొని..
అర్పిస్తోంది ఈ భరత జాతి ...మీకు నివాళి!!!

-మీ లక్ష్మి
హస్తవాసి మీద
నాకిప్పుడు నమ్మకం బాగా కుదిరింది ...
ఆ ఝార్ఖండ్ మంత్రి గారి చేతుల్లో ఏముందో కానీ...
కలాం గారు మనను వదలి పోయారు...
...
బ్రతికున్న మనుషులకు దండ అందుకే వేయద్దంటారేమో!!!
-మీ లక్ష్మి
"చదవేస్తే ఉన్న మతి పోతుంది"...
అని ఎవరో అంటే...
"అదేమిటి?" అన్నాను...
"అదంతే" అన్నారు...
ఈరోజు తెలిసింది ... బాగా చదువుకున్న ఓ వ్యక్తి గాధ విని...
ఆ వ్యక్తి చేసిన మూర్ఖపు; ఛాందసపు పనులు చూసి. ..
చట్టం ఆతనికి వేసిన శిక్షను చూసి!!!
-మీ లక్ష్మి
అజ్ఞాన తిమిరాలు తొలగించి ...
జ్ఞాన జ్యోతులు వెలిగించి ...
మంచి దారుల మనను నడిపిన..
జనుల హృదయాల్లో ఆసీనులై ఉన్న ...
గురు మూర్తులందరినీ స్మరిస్తూ ...
... గురు పౌర్ణమి శుభాకాంక్షలు!!!

-మీ లక్ష్మి

late update ki sry!!
తెలవారగానే ..
నీ ముంగురులు ..
ముఖముపై పడి ..
నను మేలుకొలిపి ..
ఊసులేవో చెప్తాయి..
...

నీ తీయని పలుకులు  ...
నా చెవిన బడి ..
నన్ను మురిపిస్తూ ఉంటాయి ..
...

పని చేస్తోన్న సమయంలో  ..
మధ్యాహ్న వేళ ..
భోజనం చేస్తుంటే ..
నీవు "ప్రేమ" కలగలిపి చేసిన వంటలోని ఘుమ ఘుమలు  ..
నిన్ను గురుతుచేస్తాయి ..
...

సాయంకాలం కాగానే ..
నిన్ను చూడాలన్న తపనలు ..
నాలో రేగుతాయి ..
నీ తలపులు నన్ను వెంటాడతాయి ..
...

నిన్ను చేరగానే...
నీ ఒక్క పలకరింపు ..
నా అలసటను దూరం చేయగా ..
నీ  భుజంపై తలవాల్చి నే సేదతీరగా ..
ఆ ప్రేమానురాగాలు ..
మనకు అద్భుత స్మృతులను మిగులుస్తాయి ...

...

నాలుగు కబురులు చెప్పుకు నవ్వుకునే వేళ ..
మన నవ్వుల్లో ..  కేరింతల్లో ..
సంతోషాలు వెల్లివిరుస్తాయి ...
...

రాతిరి వేళ.. ముద్దు ముచ్చట్లలో ..
చిలిపి సరసాలలో ..
దాగి ఉన్న అనుభూతులు ..
పులకింతలు కలిగిస్తాయి ...
ఇంకా కవ్విస్తుంటాయి ....

...

నిదరోయే సమయంలో ...
మనం చేరుకుంటాం కలల లోకానికి ..
అందులోని అద్భుతాలు ..
భవిష్యత్తుని పరిచయం  చేస్తాయి ..
ఎన్నో ఆశలు రేపుతాయి ..

...

ఇలా సాగుతోన్న జీవితంలో ..
చిన్ని కలహాలు ..
అప్పుడప్పుడూ వచ్చే కష్టాలు ..
తీయందనమే  కాదు ...
చేదు కూడా ఉంటుందని  ...
సంసారంలో కారాలు మిరియాలు తప్పవని ..
పాఠాలు నేర్పుతాయి ...

...

ఎన్నో వర్ణాలు ఉన్న
ఈ జీవితం అనే బాటలో  ..
మన పయనంలో ..
నీ తోడు నేనై  .. నా నీడై నీవై
సాగిపోదామలా ...
కడ దాకా కలిసుందాం ..
పూవు తావిలా !!!

-మీ లక్ష్మి








డబ్బు, హోదాను చూసి ..
వచ్చిందో పడతి ..
రూపం చూసి ..
వలచిందో ఇంతి  ..
ఎవర్ని ఎంచుకుంటావో ??!
..
తొందర  పడతావో ??!
..
ఓ సుందర వదన ..
నీ మనసును మెచ్చిన మరో సతి ఉందిగా ..
ఆమే నీకు సరిజోడుగా !!
ఆమె ఇక నీదేగా !!
..
 నీతి  : "మనసే ప్రధానం "

-మీ లక్ష్మి



వాన జల్లులా ..
తడిపావు నన్నే ...
తెలి మంచులా ..
పలకరించావు నన్నే ..
చల్లని గాలిలా ..
మెల్లగా తాకావు నన్నే ..
నీ ఇంపైన  ఆక్రుతే  ..
అందమైన ప్రకృతిలా ..
నాకు కనబడుతోంటే ..
నిన్ను చూడకుండా  ఉండేదెలాగ ??
నేత్రానికి  ఆనందం ఎలాగ ??
చెప్పుమా సుమా !!

-మీ లక్ష్మి

గుండె చప్పుడు ..
అదే  నాకు  బిగ్గరగా వినిపిస్తోంది !!
అపుడే  నాకు అర్ధమైంది ..
నిశబ్దం ఎంతో భయంకరమైనది ..
ఆ నిశబ్దం చిన్నగా ప్రాణం తీసేలా ఉంది ... !!

-మీ లక్ష్మి



Saturday, July 18, 2015

ఒకరి కన్నుల  ..
మరియు ...... 
మరొకరి కన్నుల  ..
రెప్పలు మూసుకుపోయి ..
తెరలుగా మారి ..
ఇరువురి కళ్ళలోని ..
భావాలు ..
మరొకరికి అర్థం కానివ్వక  ..
ఇరువురి కళ్ళను ..
కలవనివ్వక ..
ఏమి ఆటలాడుకుంటున్నాయో!!
ఆ రెప్పలు అనుమతి ఇస్తే ..
పాపం వాళ్ళ వాళ్ళ  కన్నులు సంతసిస్తాయిగా !!!

- మీ లక్ష్మి 
నాలోని  బడబాగ్నిని ..
చల్లార్చే ఓ శక్తి ఎందులో ఉందో ఏమిటో ??
నిత్యం రగిలిపోతు ఉన్న నా హృదయానికి ..
శీతలత్వాన్ని ఇచ్చేది  ఏదో ??
నాకు నేను ప్రశాంతత చేకూర్చుకోలేక ..
ఇలా..  వెతుకుతున్నానేమో !!
వేరేవరూ సమాధానం చెప్పలేరేమో !!

-మీ లక్ష్మి

శశిరేఖలాంటి నీ కనుబొమ్మల నడుమ ఉన్న .. 
కుంకుమ ఎరుపులో నన్ను దాచుకో .. 
ఇక కాలం చేసిన తరువాత .. 
కాలే కట్టల మంటల్లోని  ఎరుపులో .. 
మనలోని ప్రాణాలు కలిసేవరకు .. 
ఆ ఎరుపుని  వెలవెలబోనివ్వకు మరి.. !!
నీ .. నా బంధానికి అది సంకేతం కదూ !!

-మీ లక్ష్మి 
అర్ధం చేస్కునేవారి  కన్నా ...
అపార్థం  చేసుకునే వారే ఎక్కువైతే ..
దారి తెలియదు ..
గుండెలోని భావాలకి ..
సరి అయిన  దిక్కూ మొక్కు లేక ..
విలవిలలాడతాయి ..
కన్నీరు పెట్టుకుంటాయి !!
ఆ కన్నీటిని కంటికి  అరువిస్తాయి !!

-మీ లక్ష్మి 

Friday, July 10, 2015

నా కనులు సోలగనే...
నిదురకి ఆహ్వానం పలికితే..
నా నిద్రా లోకాన్ని కూడా నీవే ఆక్రమించుకొని...
కలలతో నన్ను అల్లేసి...
నన్ను పెనవేసి ...
నాకు గిలిగింతలు కలిగిస్తావేం!!!
..
బహుశా నాకు తెలియకుండా. .
నేనే నిను పిలిచానేమో!!
నీ తోడును కోరానేమో!!

-మీ లక్ష్మి
ఆస్తి .. కావాలి
ఆప్యాయత .. వద్దు కదూ!!
విలువ కట్టలేని దాన్ని వదులుకొని
ఏమి సాధిస్తావో!!
ఆ సంపదను మూట గట్టుకుని ఏమి చేసుకుంటావో!!
నీకు ప్రేమ పెంచడానికి ఎవరూ లేక... ఎలా బ్రతుకు బండిని లాగుతావో!!!

-మీ లక్ష్మి



నీతో పయనిస్తూ.. 
నన్ను నేను మరింతగా... 
తెలుసుకుంటున్నా!!
నాకు అద్దంలా ఉన్న ఉంటూ... 
నన్ను నేను కోల్పోకుండా చూస్తూ. .. 
తోడుంటోన్న నీకు.... 
నా జన్మ అంకితం !!

- మీ లక్ష్మి

Friday, June 26, 2015

 ప్రేమ  ..
పిడుగు పడినా .. చెక్కు చెదరని ఆలయ ధ్వజంలా ...
సంవత్సరాలైనా చెరిగిపోని ఓ గుర్తులాగా ...
శరీరాలు ఛిద్రమైనా .. అంతమవని "ఆత్మ"లాగా ...
ఆ భగవంతునిపై కలకాలం ఉండే భక్తి , విశ్వాస్సాల్లాగా ..
నిరంతరం ప్రకాశించే సూర్యునిలాగా ..
ఎప్పటికీ నిలిచే ఉంటుంది ..
యుగములు గడిచినా అంతరించని  "అస్తిత్వాన్ని " ఇమిడి ఉంటుంది !!

-మీ లక్ష్మి 
ఎవరి జీవితం వారికి బరువు కాదు ...
చనిపోయేంతవరకు .. " తీరుస్తూ ఉండవలసిన బాధ్యత "
ఆ దేవుడు మనకి అందించిన బాధ్యత ...
అందుకే కష్టాలు రాగానే .. జీవితాన్ని బరువనుకోకు ..
కర్తవ్యమేదో నెరవేర్చాలని తెలుసుకో ..
కాగల కార్యమెదో ఉందని తెలుసుకో ..
ఆ కష్టాలను కడతేర్చుకో !!
జీవితమనే ప్రయాణాన్ని రసవత్తరంగా మార్చుకో !!

-మీ లక్ష్మి 
ఉన్నన్నాళ్ళు నీ విలువ తెలియదు ...
తెలిసినాక నీ జాడ వారికి కానరాదు ...
అందుకే అన్నారేమో  "అదృష్టం ఒకసారే తలుపు తడుతుందని "
ఆ అదృష్టం "నీ తోడు వారికి ఉండటం "
దురదృష్టం .. "నీ నీదైనా కానరాకపోవటం "
"దుర్ " అనే ఈ అక్షరం ఎంత చేటో చూశావా  ??
ఆ వ్యక్తి తనకు తానే ఆహ్వానించాడని / ఆహ్వానించిందని  పసిగట్టావా  ??
ఆతని / ఆమె  స్వకర్మానికి నీవు కారణం కాదని తెలుసుకొన్నావా ??
"లేదు" అనేది నీ సమాధానం అయితే ...
నీ కళ్ళు తెరచి .. నిజం తెలుసుకో .. !!
దోషం నీది కాదని అనుకో !!!

-మీ లక్ష్మి 
ఉదయాన్నే ప్రశాంతత దొరికితే ...
రోజంతా బాగుంటుందంటారు ...
అది కరువైతే మరి ??
రోజంతా బరువవుతుండా ??
అలా నేననుకోను ...
జీవితంలో ఏ రోజునీ మోడులా మారనివ్వను !!

-మీ లక్ష్మి 
ఎంత ఎదిగినా ..
ఒదిగే ఉంది సమాజం ...
ఎంతలా అంటే ఆడదానిపై వివక్షను చూసి ఊరుకునేలా !!
ఈ విషయంలో ఒదిగి , అణిగిమణిగి , చేవ లేకుండా ఉండటం ..
మంచిదేనా?
ఆలోచించండి !!

-మీ లక్ష్మి 
అమ్మలో "ఆ" అంటే  "అభిమానం "
ఆలిలో "ఆ " అంటే "ఆసరా "
మొత్తంగా "ఆడది " లో  "ఆ "  అంటే .. "ఆపేక్ష -ఆప్యాయత "

-మీ లక్ష్మి 
ప్రశంస నాకొద్దు ...
ఎందుకంటే ...
అలవాటు లేనిది అనుకోకుండా వచ్చిపడితే ...
ఆశ్చర్యం కదూ !!

-మీ లక్ష్మి 
"బ్యాటరీ " అయిపోయే ...
ఒక నవ్వుతో  "ఛార్జ్ " చేయుమా !!
అలసట వలన  "డల్" అయినాను ..
"టీవీ ఛానెల్ "లా కాస్త వినోదం చూపుమా !!
రోజంతా "బోర్"గా గడిపా ..
"మ్యూజిక్ ప్లేయర్ "లా ... పాటలతో అలరించుమా ..
"అన్నీ నేనేనా.. మరి నీవేం కావా ??" అంటావా ??
...
నీ గుండెలకి ఊపిరి నేను ...
నీకు బాసట నేను ..
నీకు "అన్నీ " నేను !!
"నీవే .. నేను" !!

-మీ లక్ష్మి 
పసి పాపలోని  అమాయకత్వం ..
నీ నవ్వులో చూసి ..
చెలిమి చేయమని ..
నా మనసు చెప్పింది ..
చేయి కలిపాలే .. మాటా కలిపాలే ...
మాటా మాటా కలిసి ...
గూడుపుఠాని ఏదో చేసి ..
మనసులోని ప్రేమని తట్టి లేపగా ..
పెదవి ఆ మాట చెప్పలేక ...
ఒక పాటై .. చిరు పాటై ..
బయటపడెనే ....
ఆ పాటలోని అంతరార్ధం నిన్ను చేరెనో లేదో ...
తెలియలేదాయెనే ...
జాబు చెప్పవా ..!!
నాకు చేరువవ్వవా !!!

-మీ లక్ష్మి 
కలా !!
"ప్రేమ" అనే అందమైన  లోకం నాకు చూపి ...
నిదురలో ఉన్న నన్ను ..
ఆనంద సాగరాన ముంచి ..
కన్ను తెరవగానే మాయమయ్యావే !!!
ఒక సారి మళ్ళీ  రారాదూ !!
సంతోషమనే బహుమతి నాకివ్వరాదూ !!
ఊరించి అలా వెళ్ళిపోతే ఎలా??
అల్లిబిల్లిగా రావే నా కలా !!!

-మీ లక్ష్మి 
అడవిలో  తప్పిపోయా !!!
బయటకి  రాగలిగాను ...
నీట మునిగిపోయా !!!
తేలగలిగాను ...
దెబ్బలెన్నో తిన్నా !!!
కోలుకోగలిగాను ...
నష్టాలెన్నో చవిచూశా !!!
తేరుకోగలిగాను ...
కన్నీరు ఏరులై పారుతుండగా చూశా !!!
రేపు అవేలే "ఆనందబాష్పాలు " అనుకున్నాను ...
..,
కానీ  నీ ప్రేమను గెలవలేకపోయాను ...
నన్ను కలచివేసిన ఓటమదేను ...
నా జీవితంలో వెలుగు  ఇక నేను చూడలేను !!

-మీ లక్ష్మి 
నీ బాగు కోరేవాడు...
నిన్ను ఎక్కువ పొగడడు..
నీ తప్పులు నిస్సిగ్గుగా ఎత్తి చూపుతాడు..
అలాంటి వాడు.. నీకు మార్గ దర్శకుడు ..
విజయపథంలో నిన్ను నడుపుతాడు!!
-మీ లక్ష్మి
ఖద్దరు చొక్కాలు వేసుకుంటారుగా...
మసి పట్టేస్తాయని...
దుమ్ము ఏదైనా ఉంటే ..
అది పక్క వాళ్ల మీద మాత్రమే పోస్తారు!!
... 
క్లీన్ యండ్ గ్రీన్ పాలసీ మరి!!
- మీ లక్ష్మి
ఈ లోకంలో అందరికీ నచ్చేది " బిజినెస్"
అన్నిటిలోనూ .. అదే వెతుక్కుంటున్నారు..
బంధం అయినా.. బంధుత్వం అయినా..
పని అయినా.. బతుకైనా..
"ప్రయోజనం" లేకుంటే.. అన్నీబలాదూర్..!!
"బిజినెస్ మైండెడ్ పీపుల్" మరి...
-మీ లక్ష్మి
చిరాకు తెప్పించాలంటే..
ఈ "జలుబు"కి .. వెన్నతో పెట్టిన విద్య..
సతాయించేస్తోంది!!!
పోవమ్మా!! .... పో!!!
-మీ లక్ష్మి
డబ్బుతో అన్ని కొనేయచ్చట!!
ఎవడయ్యా..చెప్పింది..
గూగుల్ లో వెతుక్కోండి.. తెలుసుకోడం చేతకాకపోతే..
మనీతో.. అన్నీ నీ కూడా రావు నాన్నా!!!
గుర్తుంచుకో..!!
-మీ లక్ష్మి
ఈ ఫేక్ డిగ్రీల లొల్లేంది??
టైం పాస్ బై అందరికి ..
సోది చెప్పుకోనీకి .. విషయం దొరకబట్టె ..
...
అయిదేండ్లు గింతే..
మనోళ్ళు మారుడు జరగది!!
-మీ లక్ష్మి
దొంగ మరో దొంగని..
"నీవే దొంగిలించింది" అని..
నిందలేసే...
మరి "నీ దొంగతనం సంగతో" అంటే..
నేను దొరకలేదుగా...
"ఇంకా దొరనేలే" అన్నాడుట...
"ఏమి వివరణ"!!!
-మీ లక్ష్మి
కళ్ళు కలపలేక..
కష్టం చెప్పుకోలేక..
లోలోనే దాచుకుందొక వెర్రి మనసు..
బాధను దాచుకొని..
పెదవిని నవ్వుతూ ఉండమంటుంది...
ఆ ఆనతి కాదనలేక..
మోము విచ్చుకుంటుంది...
కానీ .. ఆ నవ్వులో సంతోషం ఏది??
ఆనందం ఏది??
వాటి చిరునామా ఏది? ?
-మీ లక్ష్మి
తన రంగు నలుపే...
కానీ ఆ నలుపే అందం...
కారు మబ్బుల నలుపు తనకి అరువిచ్చింది ఆ గగనం...
కానీ ఆ నీల వర్ణం మనసుకి అంటలేదు..
ఆ చల్లని హృదయానిది శ్వేత వర్ణం!!
అది కాదా అసలు సిసలైన అందం!!
....
నీ కన్నులు చూడగలవో లేదో.. తన అంతర్సౌందర్యం!!
-మీ లక్ష్మి
అబద్ధం చెప్పి ...
కొత్త సమస్యలకు ఆహ్వానం పలికిన.. ఓ ఘనుడు అడిగాడిలా.... ....
"నిజం చెప్పడం నేర్పు"
ఏమని చెప్పను...
...
"దానికి నా వద్ద క్లాసులు; పాఠాలు లేవు" అని చెప్పాను!!
పాపం!! నిజం చెప్పడం ఎలా నేర్చుకుంటాడో!!
-మీ లక్ష్మి
పుస్తకాల పురుగుని కాను నేను...
కానీ అందరికీ నేను అలా కనబడుతున్నానుట...
...
పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందిటగా!!!
వారంతా కూడా పుస్తకాలు తెగ తిరగేస్తున్నారేమో!!
అందుకే .. నేను కూడా అలాగే కనబడుతున్నానేమో!!!
-మీ లక్ష్మి
పాలలో తేనె కలిసినట్టు ...
నీలో కలిసిపోయింది మంచితనం..
అందుకేనేమో ... నిన్ను చూసినంతనే..
మంచితనమే కనబడుతోంది..!!
ఆ తీయందనం జగమంతా పంచుతావు కదూ!!
-మీ లక్ష్మి
ఏ లోకంలో నీవు ఉన్నా...
నిన్ను గురుతు చేసుకుని ...
కన్నీటి బిందెలు నింపాలా??
స్నేహానికే అంత్యక్రియలు చేసిన నిన్ను ..
మరచిపోలేము కానీ ..
ఒక్క కన్నీటి బిందువు కూడా వెచ్చించలేము..!!
-మీ లక్ష్మి
సముద్ర తీరాన..
ఇసుక తిన్నెలపై..
నడస్తూ ఉంటే ..
ఆ భానుని కాంతి నీ పై పడి..
నీ నీడను అద్దంలా ఆ ఇసుక చూపగా...
నీ జాడను నాకు చెప్పాలని..
ఆ నీడ తాపత్రయపడగా...
నా చూపులు నీ వైపుకి అడుగులు వేసుకుంటూ వచ్చి. .
నీలో కలిశాయి..
ఇక వేటిపైనా నా చూపులు వాలనంటున్నాయి
ఏ మాయ చేశావో!!
నా కళ్లలో కాంతివై ఉండిపోవో!!
-మీ లక్ష్మి
ప్రయాణం ఈ రోజు మొదలైంది కాదు...
నాకూ ఓ మనసుందని తెలిసినప్పుడే మొదలయింది..
....
ఆ భావన నాకు నీ దర్శనమే కలిగించిందోయ్!! 
ఆపైన "నువ్వు " అనే గమ్యస్థానానికి నా పయనం మొదలాయెనోయ్!!
-మీ లక్ష్మి
సూది మొనలా గుచ్చుకొనే నా గుండెల్లో ...నీ జ్ఞాపకాలు
లేవే మరిచే దారులు!!
అవి గుచ్చుకున్నా... ఆ బాధ కలిగించెలే నాలో తీయని తలపులు!!
అందుకే ..అవి మరవాలని నేననుకోడంలేదు..
-మీ లక్ష్మీ
హోరు గాలికి చెట్టు ఊగినట్టు...
నా మనసూ ఊగిసలాడుతోంది...
కష్టాలకీ... కడగళ్ళకీ...
కానీ ... ధైర్యం అనే కవచం తొడిగి...
సాహసం అనే కరవాలం ఇచ్చి...
"ధైర్యే సాహసే లక్ష్మి" అని సద్దిచెప్పుకున్నాను..
కాదు. . కాదు .. బోథ చేసుకున్నను ..
నా మది ఇప్పుడు ఒక "యుద్ధభూమి"
అదే .. అదే .. జీవితం అనీ యుద్ధభూమిలో..
ఒడిదుడుకులపై యుద్ధం చేస్తోంది ....
నిరవధికంగా పోరాటం సాగిస్తోంది!!!
-మీ లక్ష్మి

Friday, June 19, 2015

నీ కళ్ళు ..
దాచుంచాయే ఏదో గుట్టు ..
చేస్తున్నాయి కనికట్టు ..
ఆ కళ్ళు దాచిన గుట్టు ..
పెదవులతో బయట పెట్టు ..
..
ఎన్నాళ్ళు దాచుంచుతావ్ !!
నన్నెందుకు వేధిస్తావ్ !!
..
నీ భావాలను నా ముందు పెట్టు ..
చాలించవా నీ బెట్టు ..
ఈ దూరాన్ని.. ఇక  కట్టిపెట్టు .. !!

-మీ లక్ష్మి


కథ ఏదో మొదలయినది ..
నీతో ..
నీ రాకతో ..
ఆ కథకి  సుఖాంతం ..
మన కలయికతో ..
మరి నాకు ఆ అదృష్టాన్ని ఇస్తావో లేదో ..
మన ఈ కథకి అనువైన ముగింపు దొరుకునో లేదో ..
"ప్రేమ" అను ఈ కథకి ఆ దైవం  "శుభం " పలుకునో లేదో .. !!

-మీ లక్ష్మి

కులం అన్నది దేవుడిచ్చినది కాదోయి ..
మతం అన్నది శాంతికి అడ్డోయి ..
మరి ఎందుకు మనకు ఈ కుల మతాలోయి ..
బేధాలు మరచి జీవించాలోయి ..
ప్రేమ , శాంతులను వ్యాపింపజేయాలోయి !!

-మీ లక్ష్మి 
గాంధీ పోరాడి సాధించిన దేశం 
నెహ్రు పాలించిన దేశం 
ఎందరివో  బలిదానాలను చూసిన దేశం 
సస్యశ్యామలమైన దేశం 
పుణ్య నదులు విలసిల్లే దేశం 
హిమ గిరి శిఖరం కలిగున్న దేశం 
పుణ్య క్షేత్రాలు కొలువున్న దేశం 
సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన దేశం 
వేదములతో అలరారిన దేశం 
గొప్ప చరిత్ర కల దేశం 
ఇట్టి నా దేశానికి వందనం .. 
అభివందనం .. 
పాదాభివందనం !!!

-మీ లక్ష్మి 
పల్లవించు  స్వరముల కలయిక .. పాట
శ్రుతి లయల సంగమమే పాట
ఆనందం , ఆహ్లాదం కలిగించేది పాట
హృదయం లోతుల్లో కలిగే స్పందన పాట
సాహిత్యం సంగీతం మేళవించినది  పాట
త్యాగయ్య గొంతులో అలరారినది పాట
భాషా అంతరాలు , బేధాలు లేనిది పాట
సముద్ర కెరటాల ధ్వని పాట
మలయ మారుతం చేసే సుమధురమైన శబ్దమే పాట
వసంతంలో కోకిల గానమే పాట
అన్నమయ్య పద సింగారమే పాట
హృదయంతరాళను కదిలించేది పాట
పశు పక్షాదులను కూడా పులకరింపజేసేది పాట
జీవితంలో ఆహ్లాదాన్ని నింపేది పాట
పెదవుల నుండి వెలువడే అద్భుతమైన పదజాలమే పాట
భగవంతుని చేరేందుకు సులభమైన మార్గం పాట !!

-మీ లక్ష్మి 

Wednesday, June 17, 2015

ఒంటరిగా  నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ..
నాలుగు గోడలు కూడా  నేస్తాల్లాగా  కనిపిస్తాయి ..
మీ మాటలకి  .. మీ చేతలకి ..
సాక్షీ భూతాలుగా  నిలుస్తాయి !!
మనిషిలా .. మిమ్మల్ని దెప్పి పొడవలేవు ..
మిమ్మల్ని బాధపెట్టలేవు ..
అందుకే .. నీ బాసలేవో ఆ గోడలతో చేసుకోవోయ్  ..
ఊసులేవో వాటికే చెప్పుకోవోయ్ !!

-మీ లక్ష్మి 
నిజాన్ని కప్పిపుచ్చడం ఎవరి తరమూ కాదు..
ఎందుకంటే.. అది అనంతమైనది..
ఎంత దాచాలని ప్రయత్నించినా..
అది ఒక మూల దాగదు..
ఎదో ఒక రూపం లో బయటకి వస్తుంది...
..
అందుకే మీ మాటలతో మాయ చేసి..
ఏమీ సాధించలేరు...
విశ్వమంత నిజాన్ని దాచలేరు!!!
-మీ లక్ష్మి
పంతాలకు పట్టింపులకు..
ఇచ్చే విలువ..
బంధాలకు.. బాంధవ్యాలకు..
ఇస్తే..
ఎన్నో బంధాలకు అంతం ఉండబోదు..
ఎంతో మంది బతుకులు ఛిద్రమూ కాబోవు..
...
కానీ మనిషికి సాటి మనిషి అక్కరకు రాడుగా!!!
-మీ లక్ష్మి
జీవితంలో ఎపుడైనా మళ్ళీ నువ్వు కనబడితే
.
.
.
.
.
.
.
.
..
.
.
.
.
.
.
.
.
.
నీకు ధన్యవాదాలు తెలుపుతాను..
...
ఓటమివి కదా...!!
నాలో ఏ చోటైనా అహం దాగుంటే..
గర్వం నన్ను తప్పు దారి పట్టిస్తే..
నన్ను మేలుకోలుపుతావని..!!!
-మీ లక్ష్మి
భానుడి ప్రతాపాన్ని చూసి..
మానవ జాతి పడుతున్నకష్టాలు చూసి..
మేఘాలకి మనసు కరిగి...
వాన కురిపిస్తున్నాయి..!!
..
ఆ వాన చినుకులు ఈ నేలపై పడి..
ఈ వేసవి తాపాన్ని చల్లబరుస్తున్నాయి..
..
బాగు బాగు..
..
"కానీ రోడ్లు, నాలాలు చెడిపోతున్నాయి"..
అని గగ్గోలు పెడ్తున్నారంతా!!!
అవ్వ కావాలి..బువ్వకావాలి అంటే..
ఎలాగండి??
-మీ లక్ష్మి
నన్ను శ్లాఘించే అవసరం లేదు..
నా అవసరం నీకుంటే..
..
నాకు నోరు తెరిచి చెబితే చాలు..
నేను చేయగలిగినదే అయితే..
చేస్తా..
లేదంటే "నా వల్ల కాదు" అని సమాధానమిస్తా!!
డొంక తిరుగుడు అక్కరలేదు!!
..
-మీ లక్ష్మి
ఈ బాహ్య శరీరానికి దెబ్బ తగిలితే..
అయ్యో అని..
ఉసూరుమని..
మందు రాస్తారే....!
మరి పైకి కనపడని ..
మనసు తట్టుకోలేని..
గాయాలు అయితే..
ఒక్కరూ ముందుకి రారే...!
....
అవునులే ..
ఆ గాయాన్ని తెలుసుకొనే మనసుండాలిగా!!
అది ఎంతో మందికి ఉండదు మరి!!
-మీ లక్ష్మి
రాయడానికి అర్హత అక్కర్లేదు. ..
గుండె లోతుల్లో మధురమైన భావాలు. .
మరియు ఆలోచనలు. .
అవి ఉంటే చాలు. .
భాషలోని మార్దవాన్ని అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు..
-మీ లక్ష్మి
మీ గోల మీదే గానీ..
మరో విషయం పట్టదు.
ఏమిటో ... మనసు ఉన్నా అది స్పందించదు...
మరలు కాదుగా మీరు!!
మరి ఏంటిలా???
-మీ లక్ష్మి
జీవనాడి మీరే నాకు..
మీ స్నేహమే వరం నాకు..
ఇలా చెబుతూ పోతే..
పదాలు నిండకుంటాయేమో..!!
అందుకే ఇంతటితో ఆపేస్తున్నా ..
మీతో నా బంధాన్ని మాటల్లో చెప్పలేనని అంటున్నా..
-మీ లక్ష్మి
చరిత్రలు.. చట్టుబండలు..
ఇవి చెప్పుకునే బతికేస్తున్నారంతా..
ఇప్పడు మీరేంటో చెప్పండయ్యా...
పురాతన కాలంనాటివి వెలికితీసింది చాల్లే!!
-మీ లక్ష్మి

Thursday, June 11, 2015

ఇదివరకెరుగని వ్యక్తి పరిచయం ..
వరమైనా కావచ్చు .. శాపమైనా కావచ్చు ..
అది వరమైనా .. శాపమైన ..
రెండూ ఇచ్చేది  ఒక్కటే .. "అనుభవం "

-మీ లక్ష్మి 
మాంసాహారం ..
శాఖాహారం ,,
వాటి సమాహారం ..
మనుషుల ఆహారం ..
ప్రతి వారిదీ ఒక నిర్దిష్టమైన ఆహార నియమం ..
ఏదైనా .. భుజించేది మనం జీవించటం కోసరం ..
మరి వాటి గురించి ఎందుకీ ఝంఝాటం ??
ఎందుకు ఒకరి  అలవాటుని ఒకరు విమర్శించడం ??
ఇది ఓ గందరగోళం ...
ఈ గందరగోళానికి కారణం .. కేవలం  మనిషి సంకుచితత్వం !!

-మీ లక్ష్మి 
నీ మతం నీకు సమ్మతం ,,
పర మతాన్ని అవహేళన చేయుట కాదు సమంజసం ...
ఏ మతమైనా ఏకత్వం .. అదేగా  మానవత్వం !!
మతము కావాలో ... మానవత్వము కావాలో .. మీదే నిర్ణయం !!
మీ నిర్ణయం కావాలి నర జాతికి ఆదర్శం !!
పక్కన బెట్టు నీ మదం ...
పెంపొందించు మత సామరస్యం !!

-మీ లక్ష్మి 
ప్రేమ ..  స్వర్గమే
అది సఫలమైతే ...
ప్రేమ నరకమే
అది విఫలమైతే ...
కానీ ఆ స్వర్గమో .. నరకమో ..
ఇచ్చేది ప్రేమ కాదు ..
అది అందించేది  నువ్వు ప్రేమించిన  మనసు..
ప్రేమ కేవలం ఆ రూపు సంతరించుకుంటుంది ..
అద్దంలా ఆ భావనని ప్రతిబింబిస్తుంది !!

-మీ లక్ష్మి

నదిలా ...
ఓ సముద్రంలో కలిసిపోదామని అనుకున్నావు ...
ప్రవహించడం  మొదలు సముద్రము ..
నేనైతే బాగుండు ...
మన ప్రేమ  సంగమం  కాదా  అందరికీ కనువిందు  ..!!
ఆ సంగమానికి సాక్ష్యం అవడా దివిలో భగవంతుడు !!

.. ఇక నీవు నేను ఏకమైతే సంతోషాల అలలు పొంగు !!

-మీ లక్ష్మి 
ఏంతో స్నేహంతో ..
సఖ్యతతో ఉంటే ...
ఏమి దొరుకునో తెలియునా ??
కేవలం ఖేదమే ..!!
అది స్నేహమని నువ్వనుకుంటే ..
నువ్వో ఊతమని వాళ్లనుకుంటే ...
అమాయక  చక్రవర్తిలా ...
నువ్వు వారి బాధ్యత తీసుకుంటే ...
అది తీరిపోగానే ...
నువ్వు అక్కరకి రావే !!
నీ స్నేహం కాదా మరుగే !!
అందుకే ...ఇదిగో మిత్రమా ...
జాగ్రత్తగా  ఉండుమా ...
స్నేహాన్ని  అధికముగా పంచేయమాకుమా !!!

-మీ లక్ష్మి


సుఖముంటే .. సంతోషము ..
లేదన్న దుఖము ..
ఇది మానవుని నైజము ..
అన్నీ  బాగుంటే .. భగవంతుడు  గురుతే రాదు..
కష్టమొస్తే ఆయన్ని నిందించక మానరు ...
ఏ ??
చీకటి పడితే .. ఆ దేవుని తిడతారా ???
లేదుగా ...
మరలా వెలుగొస్తుందని అనుకొరూ !!!
మరి సుఖదుఖాలూ అంతే ..
ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి ...
ఒక్కొక్కటిగా  మనని పలుకరిస్తాయి ...
. .
అంచేత ...
ఆ దేవుడిని నింద సేయకండి ...
ఇన్ని హంగులు జీవితంలో ఇచ్చినందుకు  కృతజ్ఞత తెలుపండి ..!!

-మీ లక్ష్మి 
చేతి కర్రతో దేశాన్నే నడిపారు బాపూజీ .. 
ఈనాటి రాజకీయాలు దేఖోజీ ... 
ఎక్కడ చూసినా లాలూచి .. 
ప్రజల కళ్ళకి గంతలు కట్టి .. 
ఆడతారు దోబూచి ... 
ఎన్ని వనరులున్నా ..నిధులున్నా .. 
ఖర్చు పెట్టాలంటే నామోషీ ... పలుకుబడి ఉన్నవారికేలే  ఎర్ర తివాచీ .. 
వాళ్లకు ముఖ్యమైనది  కేవలం పదవితో కూడిన  ఆ కుర్చీ .. 

-మీ లక్ష్మి 
గమనిక.: నాకు తెలిసిన ఒక వ్యక్తి నా ఈ కవితను తన ఫేస్ బుక్  ప్రొఫైల్  లో పెట్టటం జరిగింది .. కావున  ఇది నేను నా స్వహస్తాలతో రాసిన కవిత అని మనవి చేసుకుంటున్నాను !!

నీతో నీవు ..
నిత్యం ఉండవు .. మరి వేరైపోవునుగా నీ ఆత్మ ..
అది మళ్ళి కొత్త నేస్తాన్ని  వెతుక్కుంటూ వెళిపోతుందిగా ..
అపుడు నీతో నీవు లేనట్టే ..
నీ అస్థిత్వం ఇక ముగిసినట్టే ..
జీవం ఉండేవరకే  ఏదైనా ...
కాలం ముగిసాక నీది ఏదైనా .. నీకు మిగిలేనా ??
.....
ఏది శాశ్వతం కాదు ... నువ్వూ కాదు ... నీ కష్టార్జితమూ  కాదు .. నీ బంధాలూ కాదు ..
చివరికి  నీ ఆత్మ కూడా రేపు నీది కాదు ...
అది వేరే జతని కోరక మానదు ...!!

-మీ లక్ష్మి 
నా మది ...
కన్నులకి చెప్పింది ..
నిన్నే చూడమని ..
నీ రూపునే ఊహించుకోమని ..
నేరం నా కన్నులదా ??
మరి చెప్పిన నా మనసుదా ??
మరి నన్నాకర్షించిన నీదా ??
ఏమో తెలియడం లేదే ...
వింతగా ఉందే !!!

-మీ లక్ష్మి 
కలలాగే  ఉంటే జీవితమంతా ...
మరి సత్యానికి అర్థం తెలిసేనా ??
జీవితమూ .. కల .. రెండు వేరు కాదా !!!
ఆ రెంటినీ ఒకటిగా చూస్తే ..
భంగపాటు నీకు అవదా !!!
...
కల నెరవేరితేనే .. అది నిజం ..
లేదంటే అది ఓ అభూత కల్పనం ...

-మీ లక్ష్మి 
ఆకాశం లోని  నిర్మలత్వంలా ఉండే నీ శాంతం  మాత్రమే  భరించగలను ..
సాంతం భరించగలను ... కానీ..
ఉరుములు మెరుపులని పోలిన నీ కోపం నేను సైపలేను ..
ఓర్వలెను ...
అందుకే  కోపం వలదులే ..
నీ నవ్వులే నాకు సిరులులే !!

-మీ లక్ష్మి