తెలవారగానే ..
నీ ముంగురులు ..
ముఖముపై పడి ..
నను మేలుకొలిపి ..
ఊసులేవో చెప్తాయి..
...
నీ తీయని పలుకులు ...
నా చెవిన బడి ..
నన్ను మురిపిస్తూ ఉంటాయి ..
...
పని చేస్తోన్న సమయంలో ..
మధ్యాహ్న వేళ ..
భోజనం చేస్తుంటే ..
నీవు "ప్రేమ" కలగలిపి చేసిన వంటలోని ఘుమ ఘుమలు ..
నిన్ను గురుతుచేస్తాయి ..
...
సాయంకాలం కాగానే ..
నిన్ను చూడాలన్న తపనలు ..
నాలో రేగుతాయి ..
నీ తలపులు నన్ను వెంటాడతాయి ..
...
నిన్ను చేరగానే...
నీ ఒక్క పలకరింపు ..
నా అలసటను దూరం చేయగా ..
నీ భుజంపై తలవాల్చి నే సేదతీరగా ..
ఆ ప్రేమానురాగాలు ..
మనకు అద్భుత స్మృతులను మిగులుస్తాయి ...
...
నాలుగు కబురులు చెప్పుకు నవ్వుకునే వేళ ..
మన నవ్వుల్లో .. కేరింతల్లో ..
సంతోషాలు వెల్లివిరుస్తాయి ...
...
రాతిరి వేళ.. ముద్దు ముచ్చట్లలో ..
చిలిపి సరసాలలో ..
దాగి ఉన్న అనుభూతులు ..
పులకింతలు కలిగిస్తాయి ...
ఇంకా కవ్విస్తుంటాయి ....
...
నిదరోయే సమయంలో ...
మనం చేరుకుంటాం కలల లోకానికి ..
అందులోని అద్భుతాలు ..
భవిష్యత్తుని పరిచయం చేస్తాయి ..
ఎన్నో ఆశలు రేపుతాయి ..
...
ఇలా సాగుతోన్న జీవితంలో ..
చిన్ని కలహాలు ..
అప్పుడప్పుడూ వచ్చే కష్టాలు ..
తీయందనమే కాదు ...
చేదు కూడా ఉంటుందని ...
సంసారంలో కారాలు మిరియాలు తప్పవని ..
పాఠాలు నేర్పుతాయి ...
...
ఎన్నో వర్ణాలు ఉన్న
ఈ జీవితం అనే బాటలో ..
మన పయనంలో ..
నీ తోడు నేనై .. నా నీడై నీవై
సాగిపోదామలా ...
కడ దాకా కలిసుందాం ..
పూవు తావిలా !!!
-మీ లక్ష్మి
నీ ముంగురులు ..
ముఖముపై పడి ..
నను మేలుకొలిపి ..
ఊసులేవో చెప్తాయి..
...
నీ తీయని పలుకులు ...
నా చెవిన బడి ..
నన్ను మురిపిస్తూ ఉంటాయి ..
...
పని చేస్తోన్న సమయంలో ..
మధ్యాహ్న వేళ ..
భోజనం చేస్తుంటే ..
నీవు "ప్రేమ" కలగలిపి చేసిన వంటలోని ఘుమ ఘుమలు ..
నిన్ను గురుతుచేస్తాయి ..
...
సాయంకాలం కాగానే ..
నిన్ను చూడాలన్న తపనలు ..
నాలో రేగుతాయి ..
నీ తలపులు నన్ను వెంటాడతాయి ..
...
నిన్ను చేరగానే...
నీ ఒక్క పలకరింపు ..
నా అలసటను దూరం చేయగా ..
నీ భుజంపై తలవాల్చి నే సేదతీరగా ..
ఆ ప్రేమానురాగాలు ..
మనకు అద్భుత స్మృతులను మిగులుస్తాయి ...
...
నాలుగు కబురులు చెప్పుకు నవ్వుకునే వేళ ..
మన నవ్వుల్లో .. కేరింతల్లో ..
సంతోషాలు వెల్లివిరుస్తాయి ...
...
రాతిరి వేళ.. ముద్దు ముచ్చట్లలో ..
చిలిపి సరసాలలో ..
దాగి ఉన్న అనుభూతులు ..
పులకింతలు కలిగిస్తాయి ...
ఇంకా కవ్విస్తుంటాయి ....
...
నిదరోయే సమయంలో ...
మనం చేరుకుంటాం కలల లోకానికి ..
అందులోని అద్భుతాలు ..
భవిష్యత్తుని పరిచయం చేస్తాయి ..
ఎన్నో ఆశలు రేపుతాయి ..
...
ఇలా సాగుతోన్న జీవితంలో ..
చిన్ని కలహాలు ..
అప్పుడప్పుడూ వచ్చే కష్టాలు ..
తీయందనమే కాదు ...
చేదు కూడా ఉంటుందని ...
సంసారంలో కారాలు మిరియాలు తప్పవని ..
పాఠాలు నేర్పుతాయి ...
...
ఎన్నో వర్ణాలు ఉన్న
ఈ జీవితం అనే బాటలో ..
మన పయనంలో ..
నీ తోడు నేనై .. నా నీడై నీవై
సాగిపోదామలా ...
కడ దాకా కలిసుందాం ..
పూవు తావిలా !!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment