ఎటు పోతున్నామో ఏమో ??
...
...
...
అభివృద్ధి శిఖరాలనందడానికని ..
వ్యయ ప్రయాసలకోర్చి ఒక్కో అడుగు వేస్తూ ..
పడుతూ లేస్తూ ..
ఉచ్ఛ నీచాలు పలుకరిస్తోంటే ..
లెక్కసేయక...
ఆకాశమే హద్దని ..
ఘంటాపదంగా చాటుతూ ...
వెళ్తున్నాం అనుకున్నాం !!!
...
నిజం లోతులను కనుగొన్నామా .... అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి ...
...
మానవత్వాన్ని పాతి పెట్టి ...
డబ్బంటే వాంఛ కలిగి ...
"పైసా మే పరమాత్మ " అంటూ ...
నోటుకు పూజలు చేస్తూ ...
దానికి దాసానుదాసులమై ఉంటూ ...
గడ్డి కరవటానికైనా సిద్ధమే అని మనసులో నిర్ణయించేసుకొని ...
మంచి అనేది లేని లోకాన్ని, మన స్వార్ధం అనే గర్భం నుండి ఊపిరి పోసి .. సృష్టిస్తున్నాం
సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నామ్ !!!
...
..
ఎన్నో అవినీతి పనులు చేస్తున్నాం !!
అధర్మాన్ని పెంచి పోషించి ..మరో స్థితి కారకులమే ఔతున్నామ్ !!
..
అది ఒక ఎతైతే ...
భావి తరాలకి ...
"మీ ఖర్మ ఇదే అని" ..
నాశనమైపోతోన్న పర్యావరణాన్ని ...
కానుకగా ఇస్తున్నాం ...
లోకాన్ని పాప పంకిలం చేసి ...
తెల్ల కాగితమంటి ప్రపంచానికి ...
నలుపు జాడాలని పరిచయం చేసి ...
స్వచ్ఛతనే లయం చేస్తున్నామ్ !!
..
ఈ సృష్టి , స్థితి,లయలతో భగవంతులం అయిపోయాం అనుకుంటే ...
అది పిచ్చితనమే ... అంతానికి ఇక ఆరంభమే !!!
అర్థం లేని కోరికలతో ..
అభివృద్ధి అనే ముసుగు తొడుక్కొని ...
అంధకారంలో మనం మగ్గుతూ .. భవిష్యత్తుని కూడా ప్రశ్నార్ధకం చేస్తూ ...
ఎటు పోతున్నామో !!!
-మీ లక్ష్మి

No comments:
Post a Comment