Saturday, March 28, 2015

ఆ దేవునికై పోరాటం

నిన్నే పంచుకుంటున్నారయ్యా భగవంతుడా..
నీ కోసం కొట్టుకుంటారిక ఓ దేవుడా..
అందరివాడైన నిన్ను..
మా వాడంటే మా వాడని ఆడుకుంటారు ఓ పైవాడా..
అంతటా నీవున్నావని మరచిపోయి
పంతాలకు పోతారు ఓ పరమాత్ముడా..
బుద్ధి నీవే చెప్పాలి పరంధాముడా..
నీ అస్తిత్వం నీవే కాపాడుకోవాలి పరమేశ్వరుడా!!

No comments:

Post a Comment