ఓ మెలుత..
ఓ వనిత..
ప్రేమంటూ ఓ మగవాడు..
నీ జీవితంలోకి వస్తాడు..!!
నీ వాడిని నేనంటాడు...!!
..
..
అలా వచ్చి..
అలలా నీ హృదయాన్ని తాకి...
నీ గుండెల్లోకి పాకి అందు కొలువైపోతాడు..!!
నీ మనసు మెచ్చి వచ్చాడనుకొంటావు..
తనువు మాత్రమే కోరి వచ్చాడని నువ్వెరుగవు..!!
..
..
చూపులతో మొదలై...
మాటలదాకా ఎదిగి...
దిద్దుకోలేని చేతలుగా మారుతుంది మీ బంధం..!!
వాని కుటిలమైన ఆలోచనల లోతు తెలుసుకోక..
దోచిపెడతావు నీదైన అందం..!!
..
..
మాయ మాటలు నమ్మి..
ఆశల మందిరం నిర్మించుకొని..
అందులో ఆతని రూపునుంచి..
ఆరాధిస్తూ ఉన్న నీకు..
కన్నీటినే వరంగా ఇచ్చి..
మోసమంటే తెలియని నీ పిచ్చి మనసుకి...
కపటమనే గాయాన్నిచ్చి..
కోలుకోలేని దెబ్బ తీస్తాడు!!
..
..
పంజరాన చిక్కిన ఓ పక్షి మాదిరి..
బాధకి; ఖేదానికి చిక్కి..
గిలగిలలాడతావు..!!
ఉక్కిరి బిక్కిరి అవుతావు..!!
..
..
కంటి పాప నీవంటూ..
నీ కన్నే పొడిచిన మోసగాడి కోసం..
అశృవులు రాల్చకు ఏనాడూ..!!
లోకం విడిచి పోవాలని..
ప్రాణాలను పరలోకానికి చేర్చాలని..
తలంపు రానీకు ఏనాడూ..!!
నీకై బతికే తల్లిదండ్రుల కోసం..
నీతో కలసి మెలసి ఉండే స్నేహితుల కోసం..
భగవంతుడు ఇచ్చిన విలువైన జీవితం కోసం..
మరణం వడికి చేరాలని ఆలోచించకు ఏనాడూ..!!
"చివరిగా"....!!
జాగరత సుమా...
వేటాడే జంతువుల్లాంటి పురుషులకు లొంగకమ్మా..!!
శరీరాల కోసం ఎప్పుడూ ప్రాకులాడే
దురాత్ముల పంచన చేరకమ్మా...!!
నిజముగ నిన్ను అభిమానించే
హృదయానికే నీవు చెందాలమ్మా...!!
నీ జీవితం చక్కగా పండాలమ్మా...!!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment