Sunday, July 17, 2016

కాపాడుకొన్నా నన్ను నేను!!

నన్ను ఎంత ప్రేమించావు అని అడుగుతావు..
దానికి కొలతలుండవని ఎలా చెప్పను!!
నీతోనే మాటాడాలంటావు..నీతోనే ఉండాలంటావు..
స్నేహమని కుటుంబని నాకై ఉన్నాయని ఎలా చెప్పను!!
అన్నీ వదిలేసి రమ్మంటావు.. నీవే ప్రపంచమని అనుకోమంటావు..
నన్ను వాళ్ళ లోకంగా మలచుకొన్న కన్న వారు ముక్కలవుతారని ఎలా చెప్పను!!
..
నీకే జీవితం అంకితమివ్వమంటావు..
మరి నా లక్ష్యాలు అనాధలవుతాయని ఎలా చెప్పను!!
నిన్ను చూసుకొంటే చాలంటావు..
మరి నన్ను చూసుకొనేదెవరని నిన్నెలా అడగను!!
..
చెప్పినా చేసినా..
నువ్వు తెలుసుకుంటావా...??
నేనంటే ఏమిటో చదవగలవా...??
నన్ను అర్థం చేసుకొంటావని నా హృదయంలో ఇన్నాళ్ళు ఒక మరీచికను రాసుకొన్నా...!!
ఈనాడే అది చెరుపుతోన్నా...!!
నేను నేనుగానే ఉండేలా ఏ దారి వైపు వెళ్ళాలో.. అటే వెడలుతున్నా..!!

- మీ లక్ష్మి

No comments:

Post a Comment