Saturday, July 30, 2016

నీన్నే..నీకే..నీవే

నా ఇసుక తెన్నెల వంటి మనసుపైన...
నీ అడుగుల గుర్తులు ఉన్నాయి..!!
నా హృదయం అనేది సాగరం అయితే...
నీ ఊసులు అందు ఉన్న ముత్యాలుగా ఉన్నాయి..!!
నా కన్నులు దర్పణాలు అయితే ...
ఏవి చూసినా నీవుగా అవి కనపడుతున్నాయి..!!
నా పెదవులు పలికే మాటలన్నీ ...
అవన్నీ నీతో చెప్పాలనుకున్న బాసలే అవుతున్నాయి..!!
చేతలు ఏవి చేసినా...
అవి నీకై చేసినవే అవుతున్నాయి...!!
ఇలా నా ఇంద్రియాలన్నీ...
నీకే అంకితమవుతున్నాయి...!!
నిన్నే చేరాలంటున్నాయి...!!

- మీ లక్ష్మి

ప్రేమంటే ఎదురుచూపులో..!!

నీ ఒక్క చల్లని చూపు కోసం..
నీ ఒక్క ఇంపైన మాట కోసం..
నా కళ్ళెన్ని ఎదురుచూపుల సుమ మాలలు కట్టాయో...!!
నీ రాక కోసం..
నీ ప్రేమ స్పర్శ కోసం..
నా మనసు ఎన్ని పూవుల దారులు పరిచిందో...!!
వేచే నా మనసు కోసం...
విరహంలో వేగే ఈ నా తనువు కోసం..
వస్తావని... ప్రేమను బదులిస్తావని...
నేనెన్నాళ్ళు చూడాలో...!!
అసలు ప్రేమంటేనే ఎదురుచూపులో...!!

- మీ లక్ష్మి

Monday, July 25, 2016

ప్రేమిస్తే ప్రాణం పోయాలి..
ప్రాణం తీయకూడదు..!!
ప్రేమిస్తే తనే నీ ఊపిరి అవ్వాలి..
తన ఊపిరినాపకూడదు..!!
నీ గుండె చప్పుడు తనవ్వాలి..
నువ్వు తన గుండె ఆగిపోయేలా చేయకూడదు..!!
..
..
తను ఒప్పుకోలేదంటే..
మూర్తీభవించిన సహనం నువ్వవ్వాలి..!!
సంయమనం లేక..
తప్పు చేయకూడదు..!!
నీకు తను దక్కకుంటే..
స్నేహం ఉందని మరవక..
మిత్రుని వలె నీవుండాలి..!!
శత్రువువై.. జీవితాన కంటకమవ్వకూడదు..!!
ప్రేమ అనే పదానికి మచ్చ నీవు కాకూడదు..!!

- మీ లక్ష్మి

Monday, July 18, 2016

జాగరత..ఓ వనిత..!!

ఓ మెలుత..
ఓ వనిత..
ప్రేమంటూ ఓ మగవాడు..
నీ జీవితంలోకి వస్తాడు..!!
నీ వాడిని నేనంటాడు...!!
..
..
అలా వచ్చి..
అలలా నీ హృదయాన్ని తాకి...
నీ గుండెల్లోకి పాకి అందు కొలువైపోతాడు..!!
నీ మనసు మెచ్చి వచ్చాడనుకొంటావు..
తనువు మాత్రమే కోరి వచ్చాడని నువ్వెరుగవు..!!
..
..
చూపులతో మొదలై...
మాటలదాకా ఎదిగి...
దిద్దుకోలేని చేతలుగా మారుతుంది మీ బంధం..!!
వాని కుటిలమైన ఆలోచనల లోతు తెలుసుకోక..
దోచిపెడతావు నీదైన అందం..!!
..
..

మాయ మాటలు నమ్మి..
ఆశల మందిరం నిర్మించుకొని..
అందులో ఆతని రూపునుంచి..
ఆరాధిస్తూ ఉన్న నీకు..
కన్నీటినే వరంగా ఇచ్చి..
మోసమంటే తెలియని నీ పిచ్చి మనసుకి...
కపటమనే గాయాన్నిచ్చి..
కోలుకోలేని దెబ్బ తీస్తాడు!!
..
..
పంజరాన చిక్కిన ఓ పక్షి మాదిరి..
బాధకి; ఖేదానికి చిక్కి..
గిలగిలలాడతావు..!!
ఉక్కిరి బిక్కిరి అవుతావు..!!
..
..
కంటి పాప నీవంటూ..
నీ కన్నే పొడిచిన మోసగాడి కోసం..
అశృవులు రాల్చకు ఏనాడూ..!!
లోకం విడిచి పోవాలని..
ప్రాణాలను పరలోకానికి చేర్చాలని..
తలంపు రానీకు ఏనాడూ..!!
నీకై బతికే తల్లిదండ్రుల కోసం..
నీతో కలసి మెలసి ఉండే స్నేహితుల కోసం..
భగవంతుడు ఇచ్చిన విలువైన జీవితం కోసం..
మరణం వడికి చేరాలని ఆలోచించకు ఏనాడూ..!!

"చివరిగా"....!!
జాగరత సుమా...
వేటాడే జంతువుల్లాంటి పురుషులకు లొంగకమ్మా..!!
శరీరాల కోసం ఎప్పుడూ ప్రాకులాడే
దురాత్ముల పంచన చేరకమ్మా...!!
నిజముగ నిన్ను అభిమానించే
హృదయానికే నీవు చెందాలమ్మా...!!
నీ జీవితం చక్కగా పండాలమ్మా...!!

- మీ లక్ష్మి

Sunday, July 17, 2016

కాపాడుకొన్నా నన్ను నేను!!

నన్ను ఎంత ప్రేమించావు అని అడుగుతావు..
దానికి కొలతలుండవని ఎలా చెప్పను!!
నీతోనే మాటాడాలంటావు..నీతోనే ఉండాలంటావు..
స్నేహమని కుటుంబని నాకై ఉన్నాయని ఎలా చెప్పను!!
అన్నీ వదిలేసి రమ్మంటావు.. నీవే ప్రపంచమని అనుకోమంటావు..
నన్ను వాళ్ళ లోకంగా మలచుకొన్న కన్న వారు ముక్కలవుతారని ఎలా చెప్పను!!
..
నీకే జీవితం అంకితమివ్వమంటావు..
మరి నా లక్ష్యాలు అనాధలవుతాయని ఎలా చెప్పను!!
నిన్ను చూసుకొంటే చాలంటావు..
మరి నన్ను చూసుకొనేదెవరని నిన్నెలా అడగను!!
..
చెప్పినా చేసినా..
నువ్వు తెలుసుకుంటావా...??
నేనంటే ఏమిటో చదవగలవా...??
నన్ను అర్థం చేసుకొంటావని నా హృదయంలో ఇన్నాళ్ళు ఒక మరీచికను రాసుకొన్నా...!!
ఈనాడే అది చెరుపుతోన్నా...!!
నేను నేనుగానే ఉండేలా ఏ దారి వైపు వెళ్ళాలో.. అటే వెడలుతున్నా..!!

- మీ లక్ష్మి

Friday, July 15, 2016

బోరు కొట్టి వదిలొచ్చేయడానికి అది..
ఓ చెత్త సినిమానో..
ఓ అర్థం లేని కార్యక్రమమో కాదు..!!
అందమైన బంధం..!!
ఆశ్వాదిస్తే తెలుస్తుంది దాని అందం..!!

- మీ లక్ష్మి

నువ్వు అలిగతే..
ఎర్రటి ఛాయలు
నీ ముఖముపైకి చేరి..
నన్నురిమి చూస్తున్నాయి!!
అలా నువ్వు సుర్రుమంటే..
నేనుసూరుమంటాను..!!
నీ నవ్వు చూస్తే..
నేను సంతసిస్తాను..!!
ఒక్క చిరునవ్వు నీవు రువ్వితే..
ఆ నవ్వు దోచుకుంటాను..!!
నా గుండెల్లో దాచుకుంటాను..!!

- మీ లక్ష్మి

Wednesday, July 13, 2016

శరీరమే కావాలంటే..
ఎందరో ఉన్నారు..
పైటల బావుటాలు ఎగురవేసి పిలుస్తారు..!!
ప్రేమున్నది...
మనసులు పెనవేసుకోవడానికి..!!
ఆ వ్యక్తి తప్ప కళ్ళలో ఇంకొకరు కొలువై లేకుండా ఉండడానికి..!!
ప్రేమిస్తే మనసిస్తుంది...!!
ఆపై సర్వస్వమూ ఇస్తుంది...!!
నువ్వే ప్రాణమనుకుంటుంది...!!
ఏది కావాలో నిర్ణయం నీది...!!

- మీ లక్ష్మి

Sunday, July 10, 2016

నాకో ఆశయమో..
ఆశో.. ఉంటే..
దానిని మదిలో పదిలంగా దాచుకొంటూ..
కలలు దాని గురించి అల్లుకుంటూ..
ఒక్కో అడుగూ వేసుకుంటూ వెళితే..
నా అభివృద్ధికి చరమాంకం పలుకుదామని..
నీ ఆతృత ఏమిటో..??!!
నన్ను పడదోసి.. పాతాళానికి నెడదామని..
నీ ఆర్తి ఏమిటో..??!!
అదే నీ ఆశ అయినదో..??!!
నీకంటూ ఓ స్వచ్ఛమైన.. న్యాయమైన ఆశయం కల్పించుకో..!!
ఆ లక్ష్యం కోసం పడే తపనలో..
చేసే పనుల్లో ఎంత ఆనందం దాగి ఉన్నదో..
తెలిసొస్తుంది!!

- మీ లక్ష్మి

Sunday, July 3, 2016

కలలా ఉన్నావు...
నిజమెప్పుడవుతావో!!
అల లాంటి నీవు...
తీరమంటి నన్నెప్పుడు చేరుతావో!!
బీజమై ఉన్నావు...
నా హృదయంలో ఎప్పుడు చిగురిస్తావో!!
విడి విడి పదాలుగా ఉన్నావు...
నా కవనమెప్పుడవుతావో!!
ఆకాశానివై ఉన్నావు...
ప్రేమ జల్లై ఎప్పుడు వర్షిస్తావో!!
దూరమై ఉన్నావు...
దగ్గరెప్పుడవుతావో!!
ఒంటిగా ఉన్నావు...
నన్ను కూడి..
నాలో సగమెప్పుడవుతావో!!
నాకెప్పుడు పూర్ణత్వాన్నిస్తావో!!

- మీ లక్ష్మి