విస్ఫులాంగాలు రగిల్చి నాలో..
నీవు సుఖపు ద్వారాల వెంట..
పయనిద్దామని బయలుదేరావు..
నాలో ఉన్న అగ్ని కెరటాలు నిన్నాపవూ!!
నా వేదన నిన్ను కట్టేయదూ!!
నాలో బడబాగ్ని నిక్షిప్తం చేసింది నీవు..
ఇక నీవే దాని బారిన పడి నివురవుతావు!!
- మీ లక్ష్మి
THESE ARE MY THOUGHTS AND I HOPE U PPL WILL LIKE THIS BLOG :) I WELCOME COMMENTS AND FEEDBACK. BUT PLEASE DO NOT POST ANYTHING OBSCENE BY WAY OF COMMENTS
నిజానికి..
నువ్వే నేను..
ఏ రోజూ వేరని అనను..
విడి విడి మనుషులమన్న భావన ఎప్పుడూ రానీను..
ఆ ఊహే లోలోన నన్ను దహించివేసేను..
నీ కంటిని చిన్ని నలకైనా ఇబ్బంది పెడితే.. ఆ ఇబ్బంది సైతం నాదనుకుంటాను..
కలతేదైనా నీలో నిరాశ అనే తుఫాను సృష్టిస్తే.. దానికి కూడా నేనే ఎదురొడ్డేను..
దూరమున్నా చెంతనున్నా..
ఇల అయినా కల అయినా..
నువ్వే నేను..
అనుమానంగా ఉందా??
నీ మనసును అడుగు..
నన్నే నాకు చూపుతోన్న నీ కంటి పాపను అడుగు..
నీలో ఏ మూలో దాగున్న మన ప్రేమను అడుగు..
మనము ఒకటంటాయి..!!
ఒక్కరుగా మారిన ఇరువురు భిన్న ధృవాలు మనమంటాయి!!
ఒక భూతద్దం పట్టుకుని..
ప్రతి మనిషి నవ్వులోని..
నిగూడార్థం వెతకాలి..
..
..
ఎందుకూ??!! అంటారని తెలుసు..!!
..
సమాధానం ఇదిగో..
..
స్వచ్ఛత కనుమరుగైంది..
స్వార్థం రాజ్యమేలుతోంది..
"పరాయి" అనే మాటకి విలువ పెరిగింది..
కల్మషానికి కాలం దాస్యం చేస్తోంది..
..
మరి ఇక దొంగ నవ్వులు..
దొంగ పలకరింపులు ఉంటాయిగా..
అందుకే..
వెతుకులాట ప్రారంభించండి..!!
నిగ్గు తేలని నిజాల పని పట్టి..
ఇతరుల మనసుల ముసుగుల చాటున ఏముందో కనిపెట్టండి..!!
- మీ లక్ష్మి
నీ సత్తా తెలియాలంటే..
ఎన్నో చేసి చూపాలి!!
ఒకరి మెప్పు పొందాలంటే..
చిన్న సైజు యుద్ధమే చేయాలి!!
నీది అంటూ ఒక మార్కు ఉండాలంటే..
ప్రహసనమే కావించాలి!!
నడుము బిగించందే..
చమట చుక్క చిందించందే..
ఏదైనా వచ్చేనా??!!
నీ చేత చిక్కేనా??!!
...
కృషి నాన్నా కృషి..
అది లెకుంటే చేత చిక్కేది వట్టి మసి!!
- మీ లక్ష్మి