ఒక్కరే..
ఒంటరిగా ఉంటూ..
అలా ఏకాకి బతుకు అలవాటైపోతే..
మాటలాడని గోడలు కూడా..
పలుకులేవో పలికినట్టు అనిపిస్తుంది గమనించారా..??
..
..
మీరు మాట్లాడే ప్రతీ మాట..
చెవులు రిక్కించి అవి వింటున్నట్లు అనిపిస్తుంది..
అలా ఎపుడైనా గమనించారా..??
..
..
మనుషులెవ్వరూ చుట్టూలేనప్పుడు..
మీతో ఉన్న వస్తువులే తోడైపోతాయన్న విషయం గమనించారా..??
..
..
కిటికీల గుండా వచ్చి..
మెత్తగ తాకే ఆ గాలి..
చల్లదనాన్ని పంచి.. కనపడకుండానే "నీ తోడు నేన్నునానుగా నేస్తం" అని స్పృశించి చెబుతుందని గమనించారా..??
..
..
ఆకాశం వైపు చూడండి..
అంతటా ఉండి..
నీ తోనూ ఉంటుంది...!!
వర్షించి తన ప్రేమను చాటుతుంది..!! అది గమనించారా..??
..
..
తీక్షణమైన కిరణాల ప్రసరించే భానుడిని చూస్తే నీపై కోపించినట్టుంటుంది..
సంధ్యా సమయాన ఆయన్ని చూసి ప్రశాంతత చేకూరుతుంది..
అలా కఠినంగా తండ్రిలా విరుచుకుపడి.. తల్లిలా లాలిత్యంతో ఉండి.. మీతో ఉంటాడని గమనించారా..??
..
..
తనపై సేదతీరమని చెప్పి..
మీ బాధలన్నీ తనలో ఇముడ్చుకుంటుందని..
మీరెంత తొక్కినా..మొత్తినా..
సహించేదిగా ఉంటూ...
మిమ్మల్ని సదా అక్కున చేర్చుకుంటుందని గమనించారా..??
..
..
రాళ్ళతో కొట్టిన..
త్రుంచినా..
తన అంగాలైన పళ్ళు పూలను తీసుకు కోసుకొన్నా..
గొడ్డలి వేటుకు తన కొమ్మలను బలి చేసినా..
నేస్తంగానే ఉంటుందని గమనించారా..??
..
..
ఇలా మీతో ఎవరూ లేకున్నా..
చుట్టూ ఉన్నవి మీ నేస్తాలని..
అవి మీతో ఎల్లప్పుడూ ఉంటాయని..
చిరునవ్వునే కానుకిస్తాయని గమనించారా...??
- మీ లక్ష్మి
No comments:
Post a Comment