అస్థిత్వాన్ని మింగేసే రోగమే ప్రేమైతే...
నిన్ను సైతం నీకు మిగలనివ్వని మహమ్మారి ప్రేమైతే...
తప్పు చేయకున్నా తప్పే చేశావన్న భావన కలిగించేది ప్రేమైతే...
దోషం అంటని నీకు దోషమాపాదించేది ప్రేమైతే...
చిన్ని తప్పిదానికి లోకమే తలక్రిందులు చేసేదే ప్రేమైతే...
అది తప్ప వేరే లోకమే ఉండకూడదని శాసించే ప్రేమైతే...
దేవుని కంటే తానే గొప్పవ్వాలని తలలెగరేసేది ప్రేమైతే...
అలాంటి ప్రేమకి జీవితంలో చోటు ఉండకూడదు..!!
అసలు అది ప్రేమే అయ్యే అవకాశం ఉండి ఉండదు..!!
ప్రేమ ముసుగులో ఆధిపత్యం అయ్యుంటుంది..!!
ఆత్మాభిమానాన్ని తినేసే క్రూర జంతువు అయ్యుంటుంది..!!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment