Tuesday, June 14, 2016

వాడు వీడి మనుషులని..
వీడు వాడి మనుషులని..
చంపుకుంటూ..
భూమిపై ఉన్న జీవుల లెక్కల్లో నుండి..
తొలగించుకుంటూ..
తీసివేతల పర్వాన్ని కొనసాగిస్తూ..
రక్తంతో కొత్తగా ప్రపంచ జనాభా లెక్కలు రాస్తున్నారు..!!
నిత్యం యుద్ధరంగాన్ని  తలపిస్తూ..
మారణహోమాలకు కర్తలుగా నిలుస్తున్నారు..!!
విగత జీవుల రాసుల శయ్యల పైన..
హాయిగా నిదురిస్తున్నారు..!!
అడ్డూ ఆపు లేని కాండలు జరుగుతూనే ఉన్నాయి...
మానవత్వన్ని రూపుమాపుతూ..
"మానవులం" అనే సత్యాన్ని మరుస్తూ..
మృత్యువుతో ఎన్నాళ్ళు ఆటలాడతారో...!!
ఎందరి బతుకుల్లో అంధకారం నింపుతారో..!!

- మీ లక్ష్మి

No comments:

Post a Comment