జన్మ నీదే..
అది ఇచ్చింది మీ అమ్మ..
పురుటి నొప్పిని భరించలేకున్న..
నిన్ను లోకం లోకి తీసుకురావాలని..
హాలాహలం మింగిన శంకరుని వోలే..
బాధనంతా తన లోనే దాచేసుకొని..
ఊపిరోసుకున్న నిన్ను చూసుకుని..
తనను తానే మరచే తల్లిని మించగలరా ఎవరైనా??!!
నీ ఆకలి తనదై..
నీ నిద్దుర తనదై..
నీ స్వప్నాలు తనవై..
నీ సుఖ సంతోషాలే తన లక్ష్యమై..
నీకు బాధనేది లేకుండా చేయడమే తన బాధ్యతై..
నవ్వులు నీకిచ్చి.. నీ కన్నీటిని తాను తీసుకొని..
నీకై జీవించే అమ్మకు సాటి రాగలరా ఎవరైనా??!!
నీవు ఎదగడానికి మెట్లు వేస్తూ..
అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యమిస్తూ..
ముళ్ళ దారుల సైతం పూలు పరచిన మార్గంగా మారుస్తూ..
తప్పేదైనా నీవు చేస్తే ఓ దెబ్బేసి సరి చేస్తూ..
అప్పుడపుడూ చేసే చిరు తప్పిదాలను కాస్తూ..
రూపమిచ్చిన చేతితోనే.. ఓ పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతూ..
నీ అవసరాలు..ఆశలు తీరుస్తూ..
లోటను నీకు దూరంగా తరుముతూ..
నువ్వే లోకమై జీవించే అమ్మ స్థానాన్ని భర్తీ చేయగలరా ఎవరైనా??!!
ఏ భాషైనా..
ఏ కులమైనా.. ఏ మతమైనా..
ఏ ప్రాంతం అయినా..
ఏ దేశమైనా.. ఖండమైనా..
అందిరీకీ అమ్మ ప్రేమ ఒక్కటే..
ఈ సత్యాన్ని మార్చగలరా ఎవరైనా??!!
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!! :)
- మీ లక్ష్మి
No comments:
Post a Comment