||బలి పీఠం||
కన్న కలల్ని..
కళ్ళముందే చిదిమేస్తుంటే..
చూస్తూ కూడా..
ఏమీ చేయలేని స్థితిలో..
ఆశలను మృత్యువు నోటికి అందించి..
కలలను బలి పెట్టావు!!
అలా నీ స్వప్నాలు ఎక్కెను బలి పీఠం!!
మనసులో ఎవ్వరూ లేని వేళ..
ఇంకో మనసొచ్చి అందు చేరి..
ఆనందమే ఉచ్ఛ్వాస అవగా..
గుండె ఊపిరి పోసుకుంటుంటే..
కన్నవారు కులమన్నారని..లేదా మతమన్నారని..
అంతస్థు అంటే తెలియని నీకు..
దాని రుచి చూపారని..
అయినా లొంగని నీ మనసుని కన్న పాశంతో కట్టేస్తే..
ప్రాణం అయిన ప్రేమనే..
మేతగా తీసుకొంది బలి పీఠం!!
ఎన్నో ఇష్టాలు మనసుకు ఉంటే..
అవి నీ వారికి కష్టమని..
కఠినమైనా వారి కోసం..
వదులుకోవడానికి సిద్ధమై..
నీ అభిరుచల గొంతు కోసేయడానికి..
మరో సారి సాయపడింది నీకీ బలి పీఠం!!
స్వార్ధం అనే భూతం ఆవరించి ఉండగా..
నీదనుకునే ఏ బంధమైనా..
దానికి ఆహారం అని.
ఆ బంధాలను బంధుత్వాలను సైతం..
నీకు మిగల్చలేదు ఈ బలి పీఠం!!
నీ ఆశలని.. కోరికలని..
నీ వ్యక్తిత్వాన్ని..
నీ అధికారాలని..
నీ అస్థిత్వాన్ని..
నీది అనే ప్రతీ దానిని బలి కోరింది ఈ బలి పీఠం!!
ఇక మిగిలింది జీవం లేని నీ శరీరం.. అదే నీ శవం!!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment