Wednesday, May 18, 2016

అందరికీ ముసుగులుంటాయ్!!
ఒకడు బాధలో ఉండి సంతోషపు ముసుగు వేసుకుంటాడు..
ఒకడు డబ్బు బోలేడంత ఉన్నా పేదరికం ముసుగు వేసుకుంటాడు..
ఒకడు తన పిరికితనం దాచడానికి ధైర్యం అనే ముసుగు వేసుకుంటాడు..
ఒకడు చెడుకి ప్రతినిధి అయినా మంచికి ప్రతిరూపమన్నట్లు ఒక ముసుగు వేసుకుంటాడు..
ఒకడు నంగనాచి ..అమాయకత్వపు ముసుగు వేసుకుంటాడు..
ఒకడు కుట్రకి కుళ్ళుకి ఆవాసం అయ్యుంటాడు.. అయినా సాత్వికపు ముసుగేసుకుంటాడు..
ఒకడికి మోసం చేయడమే లక్ష్యం .. నెరవేర్చూకోవడానికి ప్రేమ అనే ముసుగు వేసుకుంటాడు..
ఇలా.. నిజమైన తనని దాచడానికి ఒక్కొక్కడు ఒక్కో ముసుగు తొడుగుతాడు!!
తనని ఇంకోలా ఇతరులకు పరిచయం చేస్తాడు!!
అది తొలగే వరకు ప్రతీవాడూ ఓ "ముసుగు దొంగ" !!

- మీ లక్ష్మి

బలి పీఠం

||బలి పీఠం||

కన్న కలల్ని..
కళ్ళముందే చిదిమేస్తుంటే..
చూస్తూ కూడా..
ఏమీ చేయలేని స్థితిలో..
ఆశలను మృత్యువు నోటికి అందించి..
కలలను బలి పెట్టావు!!
అలా నీ స్వప్నాలు ఎక్కెను బలి పీఠం!!

మనసులో ఎవ్వరూ లేని వేళ..
ఇంకో మనసొచ్చి అందు చేరి..
ఆనందమే ఉచ్ఛ్వాస అవగా..
గుండె ఊపిరి పోసుకుంటుంటే..
కన్నవారు కులమన్నారని..లేదా మతమన్నారని..
అంతస్థు అంటే తెలియని నీకు..
దాని రుచి చూపారని..
అయినా లొంగని నీ మనసుని కన్న పాశంతో కట్టేస్తే..
ప్రాణం అయిన ప్రేమనే..
మేతగా తీసుకొంది బలి పీఠం!!

ఎన్నో ఇష్టాలు మనసుకు ఉంటే..
అవి నీ వారికి కష్టమని..
కఠినమైనా వారి కోసం..
వదులుకోవడానికి సిద్ధమై..
నీ అభిరుచల గొంతు కోసేయడానికి..
మరో సారి సాయపడింది నీకీ బలి పీఠం!!

స్వార్ధం అనే భూతం ఆవరించి ఉండగా..
నీదనుకునే ఏ బంధమైనా..
దానికి ఆహారం అని.
ఆ బంధాలను బంధుత్వాలను సైతం..
నీకు మిగల్చలేదు ఈ బలి పీఠం!!

నీ ఆశలని.. కోరికలని..
నీ వ్యక్తిత్వాన్ని..
నీ అధికారాలని..
నీ అస్థిత్వాన్ని..
నీది అనే ప్రతీ దానిని బలి కోరింది ఈ బలి పీఠం!!
ఇక మిగిలింది జీవం లేని నీ శరీరం.. అదే నీ శవం!!

- మీ లక్ష్మి

గుండెల్లో ఒకరు...!! జీవితంలో వేరొకరు...!!

గుండెల్లో ఒకరు...!!
జీవితంలో వేరొకరు...!!
హృదయంలో ఉంటున్న ఆ వ్యక్తిని జీవితంలోకి తేలేక..
జీవితంలో ఉన్న వ్యకిని యదలో నిలుపుకోలేక..
మధనపడుతున్నావు..
ఓ సమరమే చేస్తున్నావు..!!
కన్నుల నీరైనా పాత గాయం మానదు..
బతుకూ చక్కబడదు..
తక్కెడ మీద ఓడిన ప్రేమ.. ఒడిదుకులన్న జీవితం!!
దేన్ని ఎంచుకుంటావో??
ప్రేమను ఎంచుకొని గెలుపు బాట పట్టిస్తావా??
జీవితాన్ని ఎంచుకొని అందులో ఉన్న హెచ్చు తగ్గులను సమం చేస్తావా??
తెలుసుకోవాలనుంది...!!

- మీ లక్ష్మి

Monday, May 16, 2016

నీ ఆత్మస్థైర్యాన్ని...
నీ ధైర్యాన్ని...
దూరం చేయడానికి...
ఎల్లప్పుడూ వంద మంది ఉంటారు...
అలాంటప్పుడు జీవితం ఓ యుద్ధమే అవుతుంది...
చెప్పు నీ మనసుకు ...
బీరువుగా మారవద్దని..!!
ఏనాటికీ వెన్ను చూపవద్దని..!!
విజయం పిలుస్తోన్నది.. ఇక ఆగవద్దని..!!
చరితలో స్థానం ఎదురుచూస్తోంది.. వెళ్ళి అధిరోహించమని..!!

- మీ లక్ష్మి

Bhagavan!!

భవిష్యత్తులో దేవుడొచ్చి..
నేను భగవంతుడిని..
నమ్మాల్సింది నన్ను..
పూజించవలసింది నన్ను..
కీర్తనలు చేయవలసింది నన్ను గురించి అని అంటే...
మన పాడు చెవులు పట్టించుకోవేమో!!
ఎందుకంటే దొంగ స్వాముల; దగా చేసే బాబాల మాటలు సీసంలా మన చెవులలో నిండి ఉంటాయేమో!!
అసలు ఆ దేవుడు కనపడతాడో లేడో...!!
ఎందుకంటే ఆయా దొంగ మహిమలు మన కన్నులని కప్పేసి ఉంటాయేమో!!

- మీ లక్ష్మి

Wednesday, May 11, 2016

బయటోళ్ళు ఏదన్నా రాసినా చెప్పినా.....
జవాబు: "ఆహా ఓహో" !!
సొంతోళ్ళు లేదా తెలిసినోళ్ళు ఏదన్నా రాసినా చెప్పినా.....
జవాబు: "పిచ్చి కానీ ఎక్కిందా" !!
ఎంత తేడానో!!
ఎవ్వరూ పూడ్చలేని తేడా!!

- మీ లక్ష్మి

నీ నాలుకకు "అలజడి" సృష్టించడం తెలుసు..
"అదుపు" అంటే ఏంటో దానికి తెలియదు..!!
"కఠినం"గా ఉండటం తెలుసు..
"కోమల"మైన హృదయాలను ముక్కలు చేయగలదని దానికి తెలియదు..!!
పెదవుల బంధనాలు దాటుకొని పరుషమైన మాటలు వదలడం తెలుసు..
"బంధాల"నే అటువంటి వాక్యాలు బలిపెడతాయని దానికి తెలియదు..!!
"చెడు"ను వ్యాప్తి చేయడం దానికి చాలా బాగా తెలుసు..
"మంచి"ని పంచడం శ్రేష్ఠమైనదని దానికి పాపం తెలియదు..!!
నలుగురి మధ్య వైరం పెంపొందించడం దానికి తెలుసు..
స్నేహాన్ని బతికించే తీయని పలుకలను అందించిడం తెలియదు..!!
ఇక ఎన్నో విషయాలు తెలియవు...
...
...
అహంకారం; అభిజాఢ్యం ఎక్కువ నీ జిహ్వకి...!!
కాస్త మర్యాద నేర్పకూడదూ దానికి..!!

- మీ లక్ష్మి

Saturday, May 7, 2016

Maatru dinotsavam

జన్మ నీదే..
అది ఇచ్చింది మీ అమ్మ..
పురుటి నొప్పిని భరించలేకున్న..
నిన్ను లోకం లోకి తీసుకురావాలని..
హాలాహలం మింగిన శంకరుని వోలే..
బాధనంతా తన లోనే దాచేసుకొని..
ఊపిరోసుకున్న నిన్ను చూసుకుని..
తనను తానే మరచే తల్లిని మించగలరా ఎవరైనా??!!

నీ ఆకలి తనదై..
నీ నిద్దుర తనదై..
నీ స్వప్నాలు తనవై..
నీ సుఖ సంతోషాలే తన లక్ష్యమై..
నీకు బాధనేది లేకుండా చేయడమే తన బాధ్యతై..
నవ్వులు నీకిచ్చి.. నీ కన్నీటిని తాను తీసుకొని..
నీకై జీవించే అమ్మకు సాటి రాగలరా ఎవరైనా??!!

నీవు ఎదగడానికి మెట్లు వేస్తూ..
అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యమిస్తూ..
ముళ్ళ దారుల సైతం పూలు పరచిన మార్గంగా మారుస్తూ..
తప్పేదైనా నీవు చేస్తే ఓ దెబ్బేసి సరి చేస్తూ..
అప్పుడపుడూ చేసే చిరు తప్పిదాలను కాస్తూ..
రూపమిచ్చిన చేతితోనే.. ఓ పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతూ..
నీ అవసరాలు..ఆశలు తీరుస్తూ..
లోటను నీకు దూరంగా తరుముతూ..
నువ్వే లోకమై జీవించే అమ్మ స్థానాన్ని భర్తీ చేయగలరా ఎవరైనా??!!

ఏ భాషైనా..
ఏ కులమైనా.. ఏ మతమైనా..
ఏ ప్రాంతం అయినా..
ఏ దేశమైనా.. ఖండమైనా..
అందిరీకీ అమ్మ ప్రేమ ఒక్కటే..
ఈ సత్యాన్ని మార్చగలరా ఎవరైనా??!!

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!! :)

- మీ లక్ష్మి