Friday, April 29, 2016

ఓసారైనా తలపుకు రాము మేము..
వచ్చినా గుండె గడప దాటి లోపలికి రాకుండా ఆపేస్తావు..!!
గురుతులు పలుకరించవు నిన్ను..
పలుకరించినా వాటికి జవాబునివ్వవు..!!
కాలం నదిలో కొట్టుకుపోయిన క్షణాలు స్ఫురణకు తెచ్చుకోవు..
ఉహు.. అసలు వాటిని మరిచేపోయావు..!!
మమ్మల్ని మనందరి స్నేహాన్ని అనాధని చేసి..
కొత్త బంధాల వైపు అడుగులేసేవు..!!!
ఇంకెక్కడి మైత్రిలే.. అంతా మిథ్యే అని తేల్చేసేవు..!!!

- మీ లక్ష్మి

Thursday, April 28, 2016

నీవు గాలికొదిలేసిన నన్ను.. నా మనసుని..
వేరే ఇంకే మనసు ఆదుకొంటానన్నా..
నేనే వద్దంటున్నా..
ఏదో ఒక రోజు నన్ను నీలో కలుపుకుంటావని..!!
నీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న నా గుండె చప్పుడుకి ఒక గతిని ఇస్తావని..!!

- మీ లక్ష్మి

Wednesday, April 27, 2016

ఊపిరి వెడలుతోంది..
కన్ను మూతపడుతోంది..
అయినా నీ హృదయం కరగనంటోంది..
పాషాణం నీవని తెలిసినా
నీలో ఏదో మూల నేనుంటానేమో అని అనుకున్న నా గుండె ఆశకిక గండి పడింది..
ప్రాణం అందుకే పైకి పోతోంది..!!
నీతో వీడుకోలంటోంది..!!

- మీ లక్ష్మి

పెదవి విప్పి మాటలాడుకోకున్నా..
ఎన్నెన్ని మాటలున్నాయో మన మధ్యన..
దాగున్న ఊసులు ఎన్నో మౌనం మాటున..
అంతలా ముడిపడిపోయాయ్ మన హృదయాలు!!

- మీ లక్ష్మి

Saturday, April 23, 2016

నా గుండె గూటిలో నీవు కాపురముంటే..!!

మేరు పర్వతం అంత  దృఢంగా ఉంటా..
నువ్వు నా చెంతనుంటే..!!
తప్పటడుగులకు దూరమౌతా..
ఆ అడుగులు నీతో కలిసి వేస్తే..!!
కన్నీళ్ళకు అపరిచితం అవుతా..
నువ్వంటూ నాకుంటే..!!
సమస్యలకు గట్టి సమాధానాలు చెబుతా..
నీ ప్రేమ నా అండ అయితే..!!
నా గుండె గూటిలో నీవు కాపురముంటే..!!

- మీ లక్ష్మి

Thursday, April 21, 2016

వారి కోసం నీవు!!

వారి కోసం జీవిస్తున్నావు..
వారి ఆశలకి ఊపిరినిస్తున్నావు..
వారి తప్పులని కాస్తున్నావు.. ఒప్పుల్ని మోస్తున్నావు..
వారి భారాలకి తేలికతన్నాన్ని ఇస్తున్నావు..
వారి కన్నీళ్ళకి కష్టాలకి అంతం నీవే అవుతున్నావు..
వారి నవ్వుల పువ్వులను నీరోసి పెంచుతున్నావు..
వారి కలలకి నిజాన్ని పరిచయం చేస్తున్నావు..
వారి భవిష్యత్తుకు వారధి నీవవుతున్నావు..
వారి లక్ష్యానికి వారికి ఉన్న దూరం కూడా తరిగిస్తున్నావు..
వారికై అన్ని నీవే చేస్తున్నావు.. అన్నీ నీవవుతున్నావు..
..
..
మరి నీకెవరున్నారో..!!
నీకు తోడెవరున్నారో..!!
నీ మంచి చెడ్డల్ని చూసేందుకు ఎవరున్నారో..!!
నిన్ను నిన్నుగా చూసేందుకు ఎవరున్నారో..!!
ఇతరుల కోసం నీవు కోల్పోయిన నిన్ను నీకు తిరిగివ్వడానికి ఎవరున్నారో..!!

- మీ లక్ష్మి

Saturday, April 16, 2016

చప్పట్లు కొట్టే వంద చేతులను ఓ గెలుపు తన వెంట తీసుకొస్తుంది..
భుజం తట్టే ఆ ఒక్క చేతిని వచ్చే ఒక ఓటమి తీసుకొస్తుందా??
అనుమానమే...
రోజులు మనవి కాదుగా ఇప్పుడు!!

- మీ లక్ష్మి

నిదురోగానే ఒక కల పలకరించింది..
అంతటితో వదిలిందా??
గిలిగింతలు ఇచ్చింది..
తనను నిజం చేయమని అడిగింది..
ఆ నిజాన్ని వెతుక్కుంటూ నా అడుగు బయలుదేరింది..
మనసు కూడా ఎంతో ఆరాటాపడింది..
కాలాన్ని సైతం ఓడించాలని..
నా ఆశలు చావకుండా సంజీవనినైనా తేవాలని..
నా గుండె గట్టిగా కొట్టుకుని చాటిచెప్పింది..
మొత్తానికి కలిశాను ఆ నిజాన్ని..
నా ప్రేమని..
అదే నిన్ను..
అవధుల్లేని సంతోషం నా సొంతమైంది..!!
నీతో జీవితపు అంచుల దాకా నా పయనం మొదలైంది..!!

- మీ లక్ష్మి

Monday, April 4, 2016

జ్ఞాపకాలే ఊపిరి..!!
వాటిని నెమరేసుకుంటుంటే..
ఆదో అనుభూతి కలిగి..
పెదవుల పైన చిరునవ్వు వస్తోంటే..
ఆ విషయం తెలుస్తోంది!!
అప్పుడప్పుడు కంటి చమ్మలా కూడా మారుతాయి
కాని మనసులో భారం తగ్గి..
నిశ్వాస లాగా బాధ బయటకు పోతుంది..!!
కావున ఎలా చూసినా జ్ఞాపకాలు మంచివే!!
ఎల్లప్పుడూ తోడుగా ఉండేవే!!

- మీ లక్ష్మి

Friday, April 1, 2016

Nammakam

నమ్మకమే ప్రాణం..
ఓసారి పోతే మళ్ళీ రాదు..
నమ్మకాన్ని వమ్ము చేసి శవంలా మారుస్తావు..
మరలా ఊపిరులూదుతానంటావు..
మృత సంజీవని నీ సొత్తా??
లేక ఆ మృత్యుంజయుడవు నీవా??
..
నమ్మక ద్రోహం ఒకనాడు..
దాసోహం అంటావీనాడు..
నీ ఆ వెన్నుపోటు చూసినవాడిలో సత్తువ లేదు!!
మృతి చెందిన అతని నమ్మకాలు, ఆశలు తిరిగొచ్చే దారి లేదు..!!

- మీ లక్ష్మి