నిన్ను ప్రేమించాక..
ప్రపంచంలో ఉన్నవన్నీ..
ప్రేమ ప్రతిరూపాలుగా కనిపించి..
ప్రేమ తప్ప విశ్వంలో ఏదీ లేదని అనిపించింది..!!
నాకు నేను కొత్తగా ఆవిష్కృతం అవగా..
మరలా జన్మే ఎత్తిన్నట్టుగా అనిపించింది..!!
కాలాన్ని కూడా వెనక్కి నెట్టే శక్తి ఏదో నాకు వచ్చిన్నట్టు..
ఎంత భారమైనా మోయగలనని అగుపించింది..!!
"నీ కలలు నిజమవుతాయి" అంటూ పరంధాముడే..
ఇలకు వచ్చి .. వరాలే ఇచ్చినట్టు...
ఆశీర్వచనం పలికి.. తలనే నిమిరి...
నీ ప్రేమకి నేను అండ దండ అని ఈశ్వరుడే భరోసా ఇచ్చినట్టు అనిపించింది..!!
కష్టాలు కడలిలా మారి..
అలలుగా ముంచెత్తినా...
నీవు నా చేయి అందుకుంటే..
ఎలాగైనా ఎదురీదగలనని అనిపించింది..!!
వెలుగు లేకపోతే..
తిమిరాలను చీల్చే ఖడ్గం మన ప్రేమ అవుతుందని..
సుడిగాలి చుట్టేస్తే..
దాని వేగాన్ని సైతం ఎదురొడ్డే ధైర్యం నీ అనురాగం అని అనిపించింది..!!
ఇలా పలు రకాల భావాలు నా మనసు తలుపు తెరచుకొని..
వాటిని అవి అల్లుకుని..
అల్లిబిల్లి కధలై కదలాడాయి!!
...
ఇలా అంతా అద్భుతంగా కనిపిస్తోంది...!!
అంతా నీ మహిమేనేమో అని అనిపిస్తోంది..!!
- మీ లక్ష్మి
No comments:
Post a Comment