నీవు నేను..
ఇతరుల కంటికి..
వేరు వేరై కనిపిస్తాం..
మన మనసులు ఏనాడో ఏకమై..
నన్ను నీలో.. నిన్ను నాలో చేర్చాయి..
ఊపిరి ఆగేదాకా..
మన కట్టెలు కాలేదాకా..
నీలో నేను.. నాలో నీవు జీవిస్తాం...
ఒక్కరమై...
ఒకరికి ఒకరమై!!
- మీ లక్ష్మి
THESE ARE MY THOUGHTS AND I HOPE U PPL WILL LIKE THIS BLOG :) I WELCOME COMMENTS AND FEEDBACK. BUT PLEASE DO NOT POST ANYTHING OBSCENE BY WAY OF COMMENTS
నమ్మకం చేటు చేస్తుందా??!!
నమ్మకం..
అదో ఆయుధం..
మనకి శక్తినిస్తుంది!!
మరి అదే ఆయుధం... ప్రాణమూ తీయవచ్చునే!!
..
"ఏ ఆయుధం పట్టుకున్నవాడు ఆ ఆయుధంతో పోతాడంట"..!!
..
అది ఇదేనేమో!!
అతి నమ్మకమే మనని ముంచునేమో!!
..
కానీ ఏనాడు దాన్ని మనం వదలం..
వదిలుండలేం..
గుండెలు ఉన్న వాళ్ళం కదా....!!
ఏదో ఒక మూల "నమ్మకం" ఊపిరి పోసుకుంటుంది!!
మళ్ళీ "నమ్ముదాంలే" అని మన చేత అనిపిస్తుంది!!
- మీ లక్ష్మి
వీర జవాన్ ..!
ఓ శూర జవాన్..!!
నీ త్యాగాల తల్పంపై..
స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ..
హాయిగా నిదురిస్తున్నాం..!!
నీ తుపాకీల శబ్దాలు..
వేద ఘోషలై..
మా భద్రత కోసం ఆ దేవుని వేడుతున్నట్టు ఉండగా..
భరోసాతో జీవీస్తున్నాం..!!
నీ ధైర్య సాహసాలు..
కవచాలుగా చేసుకుని..
ప్రమాదాలు దరి చేరకుండా..
రక్షణ పొందుతున్నాం..!!
పగలు రాత్రి తేడాలు లేక..
నీవు చేస్తోన్న యుద్ధ యజ్ఞం ఫలితాలను..
మేమే స్వీకరిస్తున్నాం..!!
శాంతి కోసం నీ తపన వల్ల..
మేమిక్కడ సుఖపడుతున్నాం..!!
తీర్చలేని ఈ రుణాన్ని మూట కట్టుకుంటున్నాం!!
..
..
అట్టి నీకు..
మా వందనాలు!!
బోలెడన్ని సెల్యూట్లు!!
- మీ లక్ష్మి
జవానుల దినోత్సవం సందర్భంగా!!
నీవి మాత్రం ఆశలు...ఆమెవి పగటి కలలు..
నీకు ఆశయాలు... ఆమెకి అశృవులు..
నీ మనసుకి కోరికలు... ఆమె వాంఛలకు సమాధులు..
నీ కన్నుల నిండా గూడు కట్టుకుని కాపురుముంటాయి కలలు... నీ పక్కన స్థానం తనదైన ఆమెకు కలలనేవి కల్లలు..
నీ నీలాకాశం వంటి హృదయంలో ఆలోచనలు విహంగాలు... ఆమెకి ఆలోచనలేమిటి?? అవి పంజరంలోన చిలకలు..
నీవు చేసేవి అద్భుతాలు... ఆమె యొక్క పనులు సాధారణాలు..
నీవి ఆదర్శాలు .. ఆమెకు మాత్రమే ఆచారాలు...
నీవు అసమానం.. ఆమె అతి సామాన్యం..
నీకూ ఆమెకు ఇలా ఎంతో దూరం... ఎంతో బేధం..!!
"అర్థ భాగం ఇచ్చినాను" అని నీవు చెప్పేది ఎంత అబద్ధం..!!
ప్రేమ ఇంతటితో దగ్ధం... మిగిలినది నీ స్వార్థం..!!
...
...
సర్దుకుపోదాం!! అని ఆమె... "నేను చెప్పిందే వేదం" !! అని నీవు...
"కలిసి నడుద్దాం" !! అని ఎప్పుడు అనుకుంటారో!!
- మీ లక్ష్మి
నిన్ను ప్రేమించాక..
ప్రపంచంలో ఉన్నవన్నీ..
ప్రేమ ప్రతిరూపాలుగా కనిపించి..
ప్రేమ తప్ప విశ్వంలో ఏదీ లేదని అనిపించింది..!!
నాకు నేను కొత్తగా ఆవిష్కృతం అవగా..
మరలా జన్మే ఎత్తిన్నట్టుగా అనిపించింది..!!
కాలాన్ని కూడా వెనక్కి నెట్టే శక్తి ఏదో నాకు వచ్చిన్నట్టు..
ఎంత భారమైనా మోయగలనని అగుపించింది..!!
"నీ కలలు నిజమవుతాయి" అంటూ పరంధాముడే..
ఇలకు వచ్చి .. వరాలే ఇచ్చినట్టు...
ఆశీర్వచనం పలికి.. తలనే నిమిరి...
నీ ప్రేమకి నేను అండ దండ అని ఈశ్వరుడే భరోసా ఇచ్చినట్టు అనిపించింది..!!
కష్టాలు కడలిలా మారి..
అలలుగా ముంచెత్తినా...
నీవు నా చేయి అందుకుంటే..
ఎలాగైనా ఎదురీదగలనని అనిపించింది..!!
వెలుగు లేకపోతే..
తిమిరాలను చీల్చే ఖడ్గం మన ప్రేమ అవుతుందని..
సుడిగాలి చుట్టేస్తే..
దాని వేగాన్ని సైతం ఎదురొడ్డే ధైర్యం నీ అనురాగం అని అనిపించింది..!!
ఇలా పలు రకాల భావాలు నా మనసు తలుపు తెరచుకొని..
వాటిని అవి అల్లుకుని..
అల్లిబిల్లి కధలై కదలాడాయి!!
...
ఇలా అంతా అద్భుతంగా కనిపిస్తోంది...!!
అంతా నీ మహిమేనేమో అని అనిపిస్తోంది..!!
- మీ లక్ష్మి
నోరు గుర్రంలా ఉరుకుతోంది..
జీను గట్టిగా పట్టుకుని ..
పట్టు వదలక..
అదుపు తప్పకుండా చూడాలిగా!!!
...
అలా వదిలేసి..
మీ నోరు మీరే జారేలా చేసి..
మాటలు సభ్యత,సంస్కారాల కోటను దాటేలా చేసి..
మీకున్న..
అదే మీకున్న..
కొద్దిపాటి గౌరవాన్ని...
మట్టి రేణువంత ఉండే మీ విలువని..
కంటికి కనపడనంత పరమాణువు స్థాయికి పడేలా చేసింది..!!
...
..
వెక్కిలి కామెడీ షోలకి..
బూతు పురాణాలకి..
ఇది టీవి సెట్టు కాదు!!
మీ ఇంటి గది అసలే కాదు!!
- మీ లక్ష్మి
కాలం వేసే గాలానికి...
పడి కొట్టుకొనే చేపలం మనం...
మిడిసిపాటు పనికిరాదు..!!
మనం వేసే ఎత్తులు పై ఎత్తులు చెల్లవు..!!
- మీ లక్ష్మి