Sunday, November 20, 2016

చెడు పిలుస్తోంది

చెడు తలుపులు తెరిచే పెట్టింది...
రారమ్మని...!!
అయస్కాంతంలా లాగుతూ ఉంది...
నీవు మంచి వైపుకి పోరాదని...!!
వెళ్ళిపోతావా తలుపు తెరిచుందని..??
ఆకర్షణకు లోనవుతావా అది అయస్కాంతమని..??
ఆగమని నీ పాదాలకి చెప్పు...!!
అటు పోవద్దని నీ మనసుకి చెప్పు...!!
లొంగావా... నీ పయనం సాగేను పతనం వైపు...!!
దానికి వశమయ్యవా...నీ నడక సాగేను నరకం వైపు...!!
- మీ లక్ష్మి

జ్ఞాన దీపం

దీపం వెలుగును దాచేయదు...
తన ప్రకాశాన్ని అంతటా ప్రసరిస్తుంది..!!
వృక్షం తన ఫలాదులను ఇవ్వక మానదు...
నీడనిచ్చి సేద తీర్చి ఆకలి కూడా తీరుస్తుంది..!!
నది తన ప్రవాహాన్ని ఆపబోదు...
గలగలా నిరంతర స్రవంతి అయి దాహార్తి తీరుస్తుంది..!!
గాలి ఏ మూలనో నక్కి ఉండదు...
నిరంతరం నలు దిశలా వీస్తూ ఊపిరై నిలుస్తుంది..!!
...
...
మరి నీ వద్ద ఉన్న జ్ఞానం దాస్తావేమి...??
ఆ జ్ఞాన ప్రకాశాన్ని పిడికిట బంధిస్తావేమి...??
అప్పుడు..
నీవు జ్ఞానమున్న అజ్ఞానివి...!!
వివేకుణ్ణి అని నీవు అనుకున్నా.. మూర్ఖత్వానికి ప్రతిబింబానివే..!!
...
...
నీవొక జ్ఞాన దీపమై వెలుగొందు...!!
నీవొక విద్యా వృక్షమై ఫలములివ్వు...!!
నీవొక నదిలా ప్రవహించి జ్ఞానం కోసం పరితపించు వారి ఆర్తిని తీర్చు...!!
నీవు చల్లని పవనమై నీ విద్దెలను నలు చెరగులూ చేరేలా చూడు...!!

- మీ లక్ష్మి

ఇంటి పేరు

ఇంటిపేరు నీ నుండి వేరైతే...
నీ గుర్తింపు ఏమిటి...??
నీకున్న ప్రతిష్ఠ ఏమిటి...??
ఈ పై ప్రశ్నలు పడగలు విప్పి...
నీ ఎదుట నిలువక మానవు...!!
ఆ ప్రశ్నలకు సమాధానం..
నీ వద్ద ఉన్నదో లేదో...!!
లేకుంటే సమాధానం కోసం...
వెతుకులాట సాగించు..!!
నీ అస్థిత్వాన్ని శోధించు..!!
నీకంటూ ఓ పేరుందని నిరూపించు..!!
ఎ‌వరో వేసిన బాటలో నడవడం కాదు...
నీవు నడిచే దారి నలుగురి గమ్యాలకు..
దారి చూపేలా చేసి చూపించు...!!
నీలా మారాలని ఎందరో అనుకునేలా నిలిచి చూపించు...!!

- మీ లక్ష్మి

మనసులు కలవని బంధం

మనసులు కలవని బంధం..
అది ఒక బంధమేనా...??
బలవంతపు సంబంధం..
కలకాలం నిలిచేనా...??
సర్దుకుపోదాం అనుకుంటూ..
సాగే పయానాలెన్నో...!!
ఒకరికి ఒకరై నిలువలేక..
సతమతమయ్యే హృదయాలెన్నో...!!
అలా బ్రతికే అందరకీ నా ఈ మనవి ఏమనగా...
అతనేంటో ఆమెరిగి...
ఆమేంటో అతనెరిగి...
అమే అతనై...అతనే ఆమై...
కలసి మెలసి మెలగాలి....!!
ఒకరి హృదయం మరొకరుగా...
ఇరువరూ ఒక్కరుగా...
సఖ్యత తోడ ఉండాలి...!!
మొదట కష్టమే...
దానిని ఇష్టముగ మలచి...
సంసారమను సాగరమును..
కలసి మధించి...
ప్రేమ అనే అమృతమును పొందాలి...!!
లేదా ...
ఆ కష్టాన్నే మోస్తూ...
అనురాగం లేక.. అనుక్షణం చస్తూ...
కేవలం సమాజం కొరకే జీవించాలి...!!
కాదు కాదు నటించాలి...!!
జీవితంలో విషమే నింపుకోవాలి...!!
మీకు ఏది కావాలి...??
విషమా...?? అమృతమా...??
మీరే నిర్ణయించుకోవాలి...!!

- మీ లక్ష్మి

Thursday, November 3, 2016

భగవంతుడు ఏం ఇచ్చాడు??
..
..
ఈ ప్రశ్న వేస్తే..
నేను చెబుతాగా...
ఎన్నో చేయటానికి నీకు ఈ శరీరాన్ని...
నీకు తోడుండడానికి ఇంకా ఎందరో మనుషులని..
అందాలు నిండిన ప్రపంచాన్ని...
ఎన్నో వింతల్ని విశేషాలని...
మంచి చెడుల్ని...
సుఖ దుఃఖాల్ని...
చెడుని దుఃఖాలని దూరం చేసుకొనే శక్తి యుక్తుల్ని...
ప్రేమని ఆప్యాయతలని...
ద్వేషాన్ని .. దాన్ని సైతం గెలవగల ఓరిమిని...
ఇంకా ఎన్నో...!!
చెబితే...సాగరమంత ఉంది...!!
ఊరకుంటే తప్పవుతుంది...!!
ఆయన క్షమిస్తాడని ఆశిస్తూ...
ఆ పరంధామునికి దండాలు...!!
ఆ ఈశ్వరునికి జేజేలు...!!

- మీ లక్ష్మి

చీకట్లు నిండిన ప్రపంచాన్ని ఉషస్సు పలుకరించునట్లు...
మోడుబారిన వృక్షం చిగురు తొడుగునట్లు...
క్షామం నెలకొన్న భూమిని వాన చినుకు తడుపునట్లు...
జీవితంలో వచ్చిన దుఃఖాన్ని కూడా ఒకనాడు సంతోషం చెరిపేస్తుంది...!!
కష్టమనేది ఉంటే .. సుఖం దాన్ని ఓ రోజు తరమేస్తుంది...!!
వేచి చూడాలంతే...!!

- మీ లక్ష్మి

మనిషివా...??
లేక మృగానివయ్యావా...??
మంచి చూడలేవు..చేయలేవు...!!
ఒకరికి హాని చేయుట అలవరచుకున్నావు...!!
నమ్మకానికి విలువనివ్వవు...!!
కన్నీటికి విలువ కట్టాలని చూస్తావు...!!
అంగడిలో దొరికే వస్తువుల్లాగా...
ఇతరుల మనోభావాలను లెక్క కడతావు...!!
బంధాలను అవసరాలతో ముడిపెడతావు...!!
న్యాయమెటూ చేయలేవు...
అన్యాయానికి ప్రతినిధివవుతున్నావు...!!
వేరే శత్రువులెందుకు నీకు...
అరిషడ్వర్గాలను నీవే పెంచి పోషిస్తున్నావు...!!
హింసని పెంపొందిస్తూ...రాక్షసుడివవుతున్నావు...!!
ఇక నీవు మనిషివి ఎలా అవుతావు..??
అసుర ప్రవృత్తికి ఆలవాలమవుతున్నావు...ఇక మానవుడివెలా అవుతావు...??
కావు కానే కావు...!! మానవత్వానికి తిలోదకాలు వదిలావు...!!
నీవు మనిషివి కానేరవు...!!

- మీ లక్ష్మి

Monday, September 19, 2016

నీతో ఉండే ఒంటరితనం..
ఎంత గొప్పదో తెలుసా..??!!
నిన్ను నీకే పరిచయం చేసేంత..!!
ఆ ఒంటరితనాన్ని చీల్చడానికి నువ్వు చేసే ప్రయత్నమంత..!!
తట్టుకోలేక నీవు బిగ్గరగా పెట్టే కేకలంత..!!
అంతే కాదు....
దురాత్ములను నీ చెంతకు రానివ్వనంత..!!
ప్రకృతికి నిన్ను దగ్గర చేసేంత..!!
నీలో నిండి ఉన్న భావాలన్ని బయటకి తీసేంత..!!
నీ గుండెల్లో ఉన్న దేవుడిని నీకు గురుతుకు తెచ్చేంత..!!
కళ్ళు మూసుకుని మౌనంగా నీవుంటే.. వచ్చే ప్రశాంతతంత..!!
- మీ లక్ష్మి

నీ అవసరం..
ఇంకొకరికి అనవసరం..!!
దానిని తీర్చడానికి..
తీరిక ఎవ్వరి సొంతం..!!
నీకు కావలసిందేదో..
ఉండాల్సినదేదో..
తెలుసుకోవడం..
ఆపై సమకూర్చుకోవడం..
నీ ధర్మం..!!
ఇతరులపై నమ్మకముంచి..
నీకేదో చెస్తారని తలచి..
బ్రతుకు సాగించడం..
నీకే నష్టం..!!
ఆపై నిన్నే వెక్కిరిస్తుంది..
నీ అవసరం..!!
భ్రష్టమవుతుంది నీ జీవితం..!!

- మీ లక్ష్మి

ప్రభాతం వచ్చినట్లు..
చీకట‌్లను చీల్చిన్నట్లు..
తొలగించును నీ అజ్ఞానం..
ఒక పుస్తకం..!!
నువ్వు నవ్వినా..ఏడ్చినా..
ఓడినా.. గెలిచినా..
నీతోనే ఉండేదీ..
ఒక పుస్తకం..!!
లాభమే కానీ..
నష్టమే చేయనిదీ..
ఒక పుస్తకం..!!
మోసాన్ని..ద్వేషాన్ని..
కల్లనీ కపటాన్ని..
దానికంటనీయదే..
ఒక పుస్తకం..!!
ఏ దేశమైనా..ఏ కాలమైనా..
నీతో నిలిచేది.. నిన్ను ఉద్ధరించేది..
ఒక పుస్తకం..!!
దారి చూపే దీపమయ్యేది..
ఔన్నత్యాన్ని నీకు అందించేది..
నీలో మంచిని అవలంబించేది..
ఒక పుస్తకం..!!
ఓ మంచి పుస్తకం..!!

- మీ లక్ష్మి

పంకంలో కొలువున్న పంకజం యొక్క తేనె..
పిలిచింది త్రేనెటీగని..!!
ఆ బురదను లెక్కసేయక..
పరుగులు తీసింది దాని చిరు రెక్కలతో..!!
దానికి ఇంపైన ఆ మధువు కోసం..!!
అటులే...
చెడు అనే ఒక లోకముంటే..
ఆ లోకంలో చిరు దివ్వెలా మంచి ఉంటే..
ఆ దివ్వె ఇచ్చు వెలుగు కొరకై..
ఆ చెడును లెక్కసేయక..
దానిని నీకు అంటనీయక..
నీవునూ బయలుదేరు..!!
మంచి మనీషివై నిలిచి చూపు..!!

- మీ లక్ష్మి

ఏదీ శాశ్వతం కాదని..
అంతమనేది అన్నటికీ తథ్యమని..
తెలియనిదెవ్వరికి??
అయినా కోరికలు చావవు..!!
ఆశల పల్లకీలో ఊరేగుతూ..
అన్నిటిపై ప్రేమలు పెంచుకొంటూ..
తిరిగే జీవుల వాంఛలకి హద్దులుండవు..!!
జీవితంలోకి ఒకరు రాగానే..
వారితోనే అంతం చూడాలనుకుంటారు..!!
ఆ ప్రయాణం ఎంత వరకో..
ఆ మజిలీ ఎక్కడి వరకో..
తేల్చే శక్తి వేరే ఉన్నదని..
ఎరుకలేనిది ఎందరికి..??
అయినా మంకుపట్టు వీడరు..!!
నా రాత నేనే రాస్తానంటారు..!!
అవివేకం పొరలు కప్పితే..
మనిషికి విచక్షణ తప్పెనేమో..!!
అన్నీ నాతోనే.. "కడ" అనేది ఎరుగకనే ఉంటాయన్న భ్రమ ఎప్పటికీ వీడదేమో..!!

- మీ లక్ష్మి

చిన్ని పెదవులు..
మాటల మల్లియలు చల్లగానే..
చిట్టి పాదాలు..
బుడి బుడి అడుగులేయగానే..
పాఠశాలకంపుతారు..!!
చదువులక్కడ చక్కబెట్టగానే..
హమ్మయ్య అనుకొనేలోపే..
కళాశాల అదిగో అంటారు..!!
కల ఒకటున్నా.. చంపుకొని..
ఇష్టపడకున్నా కష్టపడి గట్టెక్కగానే..
ఇంకో అడుగుందర్రా అని చెబుతారు..!!
ఆ అడుగు భారంగా వేసి..
మరో మెట్టెక్కగానే..
పెళ్ళి ముచ్చట్లాడుతారు..!!
ఆ కార్యం కాస్తా అవగానే..
ఇంకో జీవితానికి శ్రీకారమెప్పుడని ప్రశ్నిస్తారు..!!
ఇవన్నీ చేస్తాం..ఎన్ని అడుగులైనా వేస్తాం
కానీ "నిన్ను నువ్వే కోల్పోవాలి" అని అంటే..
కలలు కనే హక్కులకి మరణ శాసనాలు రాయాలని అంటే..
ఎలాగ చేయడం..??
గొడ్డులా అలా ఎలా బ్రతకడం..??
చెప్పండి..!! మా ప్రశ్నలకు సమాధానాలనివ్వండి..!!
మీ హృదయాల లోతులకు వెళ్ళండి...
మనుషులుగా ఆలోచించి..
కొన ఊపిరులతో ఉన్న మా వ్యక్తిత్వాలను కాపాడండి..!!

- మీ లక్ష్మి

నిత్యం దుఃఖాలతో యుద్ధం చేస్తుంది మనసు..
సుఖాలను హత్తుకుంటుంది ఆ మనసు..
దుఃఖమంటే భయం.. కన్నీరు వొలికించాలని..!!
సుఖమంటే వల్లమానిన అభిమానం.. నవ్వులు పూయిస్తుందని..!!
కానీ ఆ మనసుకు తెలియదు.. సుఖం నటించే మనుషులను తోడుగా ఇస్తుందని..!!
దుఃఖమే నిజంగా నీ వారెవరో తెలుపుతుందని..!!
ఎప్పుడు తెలుసుకుంటుందో...??!!

- మీ లక్ష్మి

సులువుగా వచ్చింది..
అందిపుచ్చుకున్నావు..!!
అది ఒక ఉచ్చు అని..
ఎరుగలేకపోయేవు..!!
భవిష్యత్తులో ఎదుర్కొనే సవాళ్ళని..
తెలుసుకోలేకపోయేవు..!!
పూల దారిలా ముస్తాబైనది నీ బాట..
ముళ్ళు ముందరున్నవని..
తేలుసుకోలేకపోయేవు..!!
కళ్ళకు కనపడే భోగాలను చూసేవు..
రాబోయే కఠిన పరీక్షల వంక..
కన్నెత్తైనా చూసి ఎరుగవు..!!
ఊరకనే వచ్చిందేదీ నిలువదని..
అదొక గాజు బొమ్మని..
నీవు తెలుసుకోలేవు..!!
అన్నీ నీ సొంతమని..
అబ్బో ఎగిరెగిరిపడేవు..!!
ఏదో ఒక రోజు నీవు చతికిలబడేవు..!!
నా మాట నీ మనసుకి చేరవేశావా..
పతనం దరిచేరవు..!!
ఆ మాట నమ్మి అడుగిడినావా..
విజయం దరి చేరేవు..!!

- మీ లక్ష్మి

ఎన్నో వస్తువులు నచ్చుతాయి..!!
సరదాలు తీరుస్తాయి..!!
సంతోషాన్నిస్తాయి..!!
మనిషికి "ఎన్నో" అన్న పదం..
భలేగా నచ్చినట్టున్నది..!!
ఆతని మెదడులోన దూరి అట్టే కూర్చున్నది..!!
మనసిచ్చే విషయంలో..
ప్రేమానురాగాల విషయంలో కూడా..
ఆ "ఎన్నో" అన్న పదం వచ్చి చేరింది..!!
ఎన్నో మనసులకి ప్రేమను ఇస్తారు..!!
ఎన్నో తనువులతో పొందును కోరేరు..!!
వస్తువుకీ.. మనుషులకీ..
బేధం ఎరుగరు..!!
ఎన్నో హృదయాలకు అలా ఖేదం మిగులుస్తారు..!!

- మీ లక్ష్మి

Saturday, September 17, 2016

కరువయ్యాయి..!!

కన్నీటీ ముత్యానికి..
దోసిలి ఆల్చిప్పలు కరువయ్యాయి..!!
పెదవుల పూరేకులకి..
వికసాన్నిచ్చే నవ్వులు కరువయ్యాయి..!!
ఏమైనా విందామన్న చెవులకి..
వినసొంపైన ఊసులు కరువయ్యాయి..!!
నడిచే పాదాలకి..
తోడొచ్చే అడుగులు కరువయ్యాయి..!!
నిరంతరం కొట్టుకునే గుండెకి..
మరో గుండె చప్పుళ్ళు కరువయ్యాయి..!!
వెతికే చూపులకి..
మానవత్వపు జాడలు కరువయ్యాయి..!!
పెల్లుబికే బాధకి..
ఓదార్పు నీడలు కరువయ్యాయి..!!
ఒంటరి బ్రతుకుకి..
సుఖసంతోషాలు కరువయ్యాయి..!!
తన వ్యతను చెప్పడానికి..
మాటలే కరువయ్యాయి..!!

- మీ లక్ష్మి

Thursday, September 15, 2016

My rendition.. taanu nenu song

Listen to Taanu nenu by Lakshmi Priyanka Daita #np on #SoundCloud https://soundcloud.com/lakshmi-priyanka-daita/taanu-nenu

Tuesday, September 13, 2016

అవసరాన్ని పెనవేసుకుంటున్నాయి..
నిన్ను కాదు...!!
అవకాశాన్ని వెతుక్కుంటున్నాయి..
నీ తోడుని కాదు...!!
అందలాన్ని ఏర్పరచుకుంటున్నాయి..
మమతానురాగాలను కాదు...!!
ఏంటవి అని అడుగుతారేమో....!!
రకరకాలైన బంధాలు..!!
నీతో సాగుతోన్న అనుబంధాలు..!!
అవి ఆపేక్షలు కావు..
వట్టి ఆకర్షణలు...!!
అవి ఆప్యాయతలు కావు..
చీకటికి ఆలవాలములు..!!
ఉచ్చుల అవలోకనాలు..!!

- మీ లక్ష్మి

నాలుగు కైపెక్కే మాటలు..
ఓర చూపుల ఎరలు..
నీకై ఎదురు చూస్తున్నాయి..!!
అటు వైపు పోమాకు..!!
..
..
నమ్మి ..అటువైపు వెళ్ళిపోయావో..
ఆ ఎరల్లో చిక్కుకొని మోసపోయావో...
తప్పు ఎలా చేశావన్న ప్రశ్నలు..
మన వారి దెప్పిపొడువులు
సమాజం వేసేటి చురకలు..
తప్పవు..!!
కన్నీటి అలలు నిన్ను ముంచకుండా ఉండవు..!!

- మీ లక్ష్మి

Saturday, September 10, 2016

చిన్న దెబ్బ తగిలి..
స్నేహమనే వృక్షం కూలునా..??
అలా కూలితే..
దాని వేర్లు బలంగా లేనట్లే..!!
బలహీనమైన ఆ స్నేహాల మధ్య మనమున్నా...
మనకి ఏ తోడూ లేనట్లే..!!

- మీ లక్ష్మి

Tuesday, August 30, 2016

కష్టం గుర్తించని వాళ్ళకి..
మనసు లేదని..
ఒకరి వెతలను ఎరిగే..
దృష్టి లేదని..
జీవితాలను తలక్రిందులు చేయగలిగే వాళ్ళకి..
ఒక జీవితం విలువ తెలియదని..
కాలమంతా ఒక దానికి ధారపోసి.. శరీరం వంచి..
నిదుర మాని.. చమట చిందించి.. ఒకరు చేసిన పరిశ్రమను అర్థం చేసుకోక.. దానిని నిరర్థకం చేసిన కఠినాత్ములకి..
విలువలు లేవని..
ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది..!!
ఇలాంటి వారి మధ్య ఉంటోంటే.. మనసు బాధ పడుతోంది..!!

- మీ లక్ష్మి

మన కన్నులకు వెలుగు తెలుగు..
తీపి తేనల పలుకు తెలుగు..
హొయలొలుకు అందమే తెలుగు..
సెలయేటి పొంగు మన తెలుగు..
అటువంటి తెలుగునెలుగున నిలుపు..!!
మా తెలుగు మిన్న అంటు మిన్నంట చాటు..!!

- మీ లక్ష్మి

కుటుంబమో...
స్నేహితులో...
తెలిసినవారో...
గుర్తుంచుకొనేలా అందరూ బతుకుతారు..!!
కానీ అందరి మనస్సుల్లో.. చెరగని గుర్తై కొందరే మిగులులుతారు..!!
నీవై అందర్లో ఉంటావో..
లేక ఆ కొందర్లో ఒకడైపోతావో.. చూసుకో..!!

- మీ లక్ష్మి

సరస్వతిని అమ్ముకుంటే...
లక్ష్మి నీ చెంతకు రాదు..!!
ఆ సరస్వతిని నమ్ముకుంటే..
ఆ నమ్మకానికి మెచ్చి ..
సిరి నీ ఇంట ఉంటుంది..!!

- మీ లక్ష్మి

Monday, August 22, 2016

నీ నుంచి..
ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆశిస్తారు..!!
నీతో పనుండే నీతో ఉంటారు..!!
నీ ఈ శరీరం చేయగల ఒక్కో పనితో..
ఒక్కొక్కరికి పని ఉంటుంది..!!
నీతో ఆత్మ సాక్షిగా బంధం ఏర్పరుచుకొనేవారు కొందరే..
ఆ కొందరు ఎవరో..
ఎందర్లో ఉన్నారో..
తెలిసి.. ఎరిగి..
వారితో అడుగులేద్దూ..!!
జన్మకి సార్థకతనిద్దూ..!!

- మీ లక్ష్మి

Friday, August 19, 2016

ఒక్కరే..
ఒంటరిగా ఉంటూ..
అలా ఏకాకి బతుకు అలవాటైపోతే..
మాటలాడని గోడలు కూడా..
పలుకులేవో పలికినట్టు అనిపిస్తుంది గమనించారా..??
..
..
మీరు మాట్లాడే ప్రతీ మాట..
చెవులు రిక్కించి అవి వింటున్నట్లు అనిపిస్తుంది..
అలా ఎపుడైనా గమనించారా..??
..
..
మనుషులెవ్వరూ చుట్టూలేనప్పుడు..
మీతో ఉన్న వస్తువులే తోడైపోతాయన్న విషయం గమనించారా..??
..
..
కిటికీల గుండా వచ్చి..
మెత్తగ తాకే ఆ గాలి..
చల్లదనాన్ని పంచి.. కనపడకుండానే "నీ తోడు నేన్నునానుగా నేస్తం" అని స్పృశించి చెబుతుందని గమనించారా..??
..
..
ఆకాశం వైపు చూడండి..
అంతటా ఉండి..
నీ తోనూ ఉంటుంది...!!
వర్షించి తన ప్రేమను చాటుతుంది..!! అది గమనించారా..??
..
..
తీక్షణమైన కిరణాల ప్రసరించే భానుడిని చూస్తే నీపై కోపించినట్టుంటుంది..
సంధ్యా సమయాన ఆయన్ని చూసి ప్రశాంతత చేకూరుతుంది..
అలా కఠినంగా తండ్రిలా విరుచుకుపడి.. తల్లిలా లాలిత్యంతో ఉండి.. మీతో ఉంటాడని గమనించారా..??
..
..
తనపై సేదతీరమని చెప్పి..
మీ బాధలన్నీ తనలో ఇముడ్చుకుంటుందని..
మీరెంత తొక్కినా..మొత్తినా..
సహించేదిగా ఉంటూ...
మిమ్మల్ని సదా అక్కున చేర్చుకుంటుందని గమనించారా..??
..
..
రాళ్ళతో కొట్టిన..
త్రుంచినా..
తన అంగాలైన పళ్ళు పూలను తీసుకు కోసుకొన్నా..
గొడ్డలి వేటుకు తన కొమ్మలను బలి చేసినా..
నేస్తంగానే ఉంటుందని గమనించారా..??
..
..
ఇలా మీతో ఎవరూ లేకున్నా..
చుట్టూ ఉన్నవి మీ నేస్తాలని..
అవి మీతో ఎల్లప్పుడూ ఉంటాయని..
చిరునవ్వునే కానుకిస్తాయని గమనించారా...??

- మీ లక్ష్మి

మనసుకు దగ్గర దానివని...
నా మనసు విప్పి చెబితే...
నా గురించి చెడు ప్రచారాన్ని..
నాకు బహుమతిగా ఇచ్చావు..స్నేహం మీద నమ్మకాన్ని చెరిపేస్తూ..!!
నా ప్రాణం నీదై బ్రతికాను..
నా స్నేహం నువ్వని నమ్మాను..!!
నా తప్పు అదేనేమో...!!
ఆ తప్పుకు శాస్తి ఇదేనేమో..!!
మంచి నాలో బ్రతికుంది...నిన్నేమీ అనవద్దంటోంది..!!
కేవలం నీ నుండి దూరంగా ఉంటూ...
నా మనసుకు "ఇంకెవరిని నమ్మకే" అని చెప్పుకుంటూ...
బ్రతికేస్తా..!!

- మీ లక్ష్మి

నీలో ఏమీ కనపడవు..
నీవల్ల వచ్చే లాభం తప్ప..!!
నీతో ఉండే అవసరం తప్ప..!!
అలాంటి సంకుచితత్వం..
అంతటి స్వార్థం.. నిండున్న కళ్ళవి..!!
ఆ కళ్ళలో ప్రేమ; స్నేహం వంటివి
వెతకడం అజ్ఞానం సుమా..!!

- మీ లక్ష్మి

బాధ ఎదురుపడచ్చని తెలిసి..
ప్రేమించా...!!
ఆ ప్రేమకి "శుభమస్తు" దీవెనలు రావేమోనని తెలిసి..
ఆ ప్రేమను ఆస్వాదించా...!!
ఆ ప్రేమ "సుఖం" అనే తీరం చేరదేమోనని తెలిసి..
ఆ ప్రేమలోనే మునిగి తేలా...!!
ఇప్పుడు కన్నీరవుతున్నా...!!
ఆ అనుబంధాన్ని అక్కున చేర్చుకోలేక...
దూరమూ చేయలేక...
నిలువునా నివురవుతున్నా...!!
ఏం చేయాలో... ఎటు పోవాలో...??!!
కావలని ఒకసారి.. వదులుకోక తప్పదని ఒకసారి
అనుకొనే హృదయానికి ఎలా సర్దిచెప్పుకోవాలో..??!!

- మీ లక్ష్మి

ఆకాశం బద్దలైనపుడు ఎలా ఉంటుందో...
అలా ఉంటుంది నువ్వు దూరమైనప్పుడు నా గుండె పగిలే శబ్దం..!!
నది కట్టు దాటితే ఆ ప్రవాహాన్ని ఆపలేము...
అలా ఉంటుంది నీ ఎడబాటులో నా కన్నీటి ప్రవాహం..!!
భూమి కంపించినప్పుడు ఎలా ఉంటుందో...
నీవు నన్ను వీడిపోయినప్పుడు అలాగే కంపించిపోతుంది నా జీవితం..!!
..
..
గ్రహణం పడితే వెలుగెలా లేకుండా పోతుందో...
అలా నీ నిష్క్రమణతో నాకు కేవలం చీకటే మిగులుతుంది..!!
నీ దూరం నన్ను ఛిన్నాభిన్నం చేస్తుంది..!!
నీ విరహం నాకు తీరని గాయం చేస్తుంది..!!

- మీ లక్ష్మి

Sunday, August 14, 2016

నువ్వు నవ్వితే చూడాలని..
కొన్ని కళ్ళు ఎదురుచూస్తున్నాయి..!!
నీ పెదవులు విచ్చుకొన్న సమయాన..
ఆ కళ్ళలో ఏదో వెలుగు.. ఇంటి లోగిలిలో దీపం పెట్టినట్టు..!!
ఆ నేత్రాలున్న ముఖాలలో ఏదో ఓ కాంతి..
సాయంసంధ్యా సూర్యుబింబమున్నట్టు..!!
ఆ వెలుగు కోసం..
ఆ కాంతి కోసం..
ఒక్క నవ్వు రువ్వవూ నేస్తం..!!

- మీ లక్ష్మి

ఒక కలలా..
కనురెప్పల్లో దాగున్న నీవు..
కన్నుల ముందుకొస్తే ఆనందం..!!
కన్నుల ఎదుటున్న నీవు వద్దకొస్తే ఇంకాస్త ఆనందం..!!
వద్దకొచ్చిన నీవు నన్ను కూడి ఉంటే..
అది మరింత ఆనందం..!!
నన్ను కూడి.. జీవితాంతం నన్నంటి ఉంటే..
చెప్పలేనంత ఆనందం..!!
నేను కన్ను మూసేప్పుడు సైతం నా పక్కన నువ్వుంటే..నిన్ను చూస్తూ నేను నేల ఒడిలో ఒరిగిపోతే..
నీ నవ్వు చివరి సారిగా చూసి వెళ్ళిపోతే..
అది నాకు పరమానందం..!!
....
....
మొత్తంగా నీతోనే నా ఆనందం..!!

- మీ లక్ష్మి

Thursday, August 11, 2016

గోవింద!!

నల్లనయ్యవు గోవిందా..
చల్లనయ్యవయ్య గోవిందా..!!
వడ్డీకాసులవాడా గోవిందా..
మా సంపదలొసగేవు గోవిందా..!!
అభయహస్తము గోవిందా..
మాపై ఉంచుమయ్య గోవిందా..!!
నీ పాద పద్మములు గోవిందా..
మాకు శరణము కదా గోవిందా..!!
ఏడుకొండలు ఎక్కి గోవిందా..
నీకు మొక్కినాము సామి గోవిందా..!!
ఏడు లోకాలనేలు గోవిందా..
మమ్ము కాపు కావుమయా గోవిందా..!!
మా సమస్తమ్ము గోవిందా..
నీ చెంతనుంచేము గోవిందా..!!
కలియుగ దైవమువంట గోవిందా..
మా పాపాల హరించు గోవిందా..!!
ఆపదమొక్కులవాడా గోవింద..
మా ఆపదల తొలగించు గోవిందా..!!
బ్రహ్మాండ నాయకుడవు గోవిందా..
నీకు కోటి దండాలు గోవిందా..!!
నీకు శతకోటి దండాలు గోవిందా..!!

- మీ లక్ష్మి

Sunday, August 7, 2016

ఆడది..!!

భూమ్మీద పడగానే..
"అయ్యో" అనొక నిరాశావాదం..!!
వినపడుతుంది మనకి..!!
అయితే అపుడే ఊపిరోసుకున్న పసికందు కదా..!!
అది తెలియదు పాపం..!!
అందుకే ఆశగా చూస్తుంది కన్నోళ్ళ వంక..!!
..
..
ఎదుగుతుంటే
దగ్గరకు తీసుకోని తండ్రి..
అయినా ఇంకా మాట రాదుగా..
ఏడుపొక్కటే తోడుంది..!!
అదే తన సమాధానమైంది..!!
..
..
మాటొస్తే..
చిరు పెదవులు "నాన్న" అంటే..
కన్నులతో చూడనైన చూడడు..
ఆ రాతిగుండె తండ్రి..!!
అయినా పిలువడం మానదే ఆ చిట్టి తల్లి..!!
నాన్నంటే అంత ప్రేమ మా నాన్నలుకి..!!
..
..
పెరుగుతోంది నిలువెత్తు అనురాగం లాగా..
చిన్ని తముడొచ్చే ఆ ఇంటి వాకిట..!!
కన్నులారా చూసుకొంది..
ముద్దులాడే సమయాన తండ్రి చీదరింపు మనసును విరిచేసింది..!!
జాలిగా ఓ చూపు అలా విసిరేసింది..!!
..
..
కలలెన్నో కన్నది..
లోకంలో ఎత్తులను తన మునివేళ్ళతో కొలవాలనుకున్నది..!!
ఆ ఆశలకు చరమగీతం రూపంలో
పెళ్ళి వార్త ఎదురైనది..!!
మూడు ముళ్ళ బంధంలో అల్లుకన్నది..!!
ఆ కలలన్ని చిత్తు కాగితాల్లో రాసుకున్న పిచ్చి రాతలైనవి..!!
..
..
వివాహ బంధాన్ని..
వైఢూర్యం వలె..
అపురూపంగా.. అమూల్యంగా..
చూసుకుంటున్నది..!!
ఆ బంధానికి ఫలితం ప్రేమనుకున్నది..!!
భర్తను గుండెలో నింపుకున్నది..!!
ఇంతలో..భరించువాడు అతడు కాదని..
భక్షించువాడు అతడని తెలినది..!!
భరించడం ఆమె వంతు అయినది..!!
..
..
కలిగిన సంతానాన్ని..
కంటికి రెప్పలా కాపాడి..
తన అమృతతుల్యమైన మమతతో..
లాలించి పెంచినది..!!
పెంచిన ఆ సంతానమే...
తనను బరంవంటారని...
వంగిపోయిన తన తనువుకు
చేతికర్రలా ఉండవలసినది..
చేతులెత్తేస్తారని తెలియలేదు..!!
ఆమెకు ఎరుక లేదు..!!

..
..
జీవితంలో ప్రతి అడుగు..
ఒక పరీక్షలా ఉంటే..
చలించక..
పాసు మార్కుల కోసం..
కుదిరితే డిష్టింన్షన్ కోసం..
అదే ప్రేమ అనే ఫలితం కోసం..
కష్టపడే ప్రతి ఒక్క ఆడదానికీ సలాం..!!

- మీ లక్ష్మి

పెళ్ళికి అర్థం తెలియని..
ఇద్దరు మనుషులు కలసి..
కాపురం మొదలెట్టారు..
కలవని మనసుల గోడును వినక..!!
కలిసిన శరీరాలు మరో శరీరానికి
జన్మనిచ్చాయి..!!
ప్రేమంటే తెలిసిందో లేదో కానీ..
సుఖానికి అర్థం తెలిసుంటుంది..!!
ఆపై అలవాటైపోయుంటుంది..!!
ప్రాణం పోసిన ఆ బుల్లి శిశువుని
పెంచడంలో...పోషించడంలో...
ఓ చిన్న మాట సైతం కనుమరుగైంది..!!
అనురాగం రాకూడని అతిథయ్యింది..!!
"సంసారం" అనే కర్మాగారపు ఉక్కు గోడల నడుమ..
ఉక్కు యంత్రాలే ఉంటున్నాయి..!!
కాలం గడుపుతున్నాయి..!!
లాభాలుగా సంపదలొచ్చాయి..అవి కంటికి కనబడుతున్నాయి..!!
పూడ్చలేని నష్టాలై ప్రేమానురాగాలు మిగిలాయి.. అవి అగుపించకున్నాయి..!!
..
..
ఇది ...
పెళ్ళి అనే కాంట్రాక్టుతో ముడిపడి...
సంసారమనే కర్మాగారంలో కష్టపడుతోన్న రెండు యంత్రాల జీవితం..!!

- మీ లక్ష్మి

Friday, August 5, 2016

శివ!!

శివుడవు...
మమ్ము కాచేవాడవు..!!
గురుడవు...
అజ్ఞానాంధకారము తొలగించువాడవు..!!
శంకరుడవు...
అశుభము దరిజేరకుండ చూసేవు..!!
భవుడవు...
భక్తి భావము మాకు కలిగించేవు..!!
భూతనాధుడవు...
మమ్ముల దయతో కరుణించేవు..!!
రుద్రుడవు...
పాపముల నాశము కావించేవు..!!
...
...
ఇక మాకు తల్లివీవు..తండ్రివీవు..!!
గురువీవు...ప్రభువీవు.. దైవం నీవు..!!
సకలము నీవు.. సర్వము నీవు..!!

ఓం నమః శివాయ..!!

- మీ లక్ష్మి

నేనెంత దానను

దొంగ అందురు నిన్ను...
పాపముల హరిస్తావని ఎరుగరయ్య..!!
మాయ సేతువు అందురు నిన్ను...
దుఃఖములను మాయము సేతువని తెలియరయ్య ..!!
మోసాగాడు అందురు నిన్ను...
మోసములు కావవి లీలలని కాంచరయ్య..!!
స్త్రీలోలుడందురు నిన్ను...
కామము నిన్నంటదని ఎరుగరయ్య..!!
గోవులను కాసెదవందురు...
ఈ లోకములనే కాతువని తెలియరయ్య..!!
పాండవ పక్షపాతి అందురు...
ధర్మ పక్షపాతిగ నిన్ను చూడలేరయ్య..!!
ఎంతవారలైన నీ అసలు రూపము ఎరుగరయ్య ..!!
ఇక నిను తెలియ నేనెంత దాననయ్య...!!

- మీ లక్ష్మి

Wednesday, August 3, 2016

మా సీతారామ స్వామీ!!

ఏ తీరు వర్ణించను స్వామీ ..??
నిన్నేతీరున వర్ణించను..??
నర జన్మ ఎత్తి సత్యాన్నే మోసితివి..!!
ధర్మానికి రూపువై సంచరించితివి..!!
కష్టాలను ఆలింగనము చేసి..
చిరునవ్వులు రువ్వితివి..!!
...
...
రామా..!!
రాక్షసుల జంపితివి..
సుజనుల రక్షించితివి..
వనవాసమును కూడా ఆనందముగ గడిపితివి..!!
నీ ఇంతి సీతమ్మ దూరము కాగా...
కన్నీరైతివి..!! ఆమె జాడ కొరకు వెతికితివి..!!
అంజనీ పుత్రుడే ఆమె ఆచూకీ చెప్పంగ..
కృతజ్ఞత తెలియ ఆతని హత్తుకొంటివి..!!
వానర సైన్యము, లక్ష్మణ స్వామి తోడ లంకను గూల్చితివి..!!
రావణుని కడతేర్చి శుభముల కలిగించితివి..!!
అయోధ్యకు రాజైతివి.. చక్రవర్తివైతివి..!! అయినా జనులకు నే సేవకుడినంటివి..!!
...
స్వామీ...
రాజ్యధర్మము కొరకు..
ప్రాణమైన జానకిని విడిచితివి...!!
లోలోన ఎంతో కుమిలి కుమిలిపోతివి...!!
యాగము సేతివి స్వర్ణ సీత తోడ..!!
అయోనిజ సీతమ్మ అమ్మ వడికి చేరిపోగా..
లవ కుశులకు రాజ్యమిచ్చి నీవునూ..
వైకుంఠము చేరితివి..!!
...
మర్యాదా పురుషోత్తముడివై...
అందరి హృదయములలో నీవు నిలిచితివి..!!
అన్నైనా..కొడుకైనా..శిష్యుడైనా..భర్తైనా.. ప్రభువైనా..
నీలా ఉండాలని అనుకునేట్లు చేసితివి..!!
రాముడే సకల గుణాభిరాముడని మేము కీర్తించగా..
గుండె గుడిలో కొలువైతివి స్వామి..!!
నీకు పూజలు సేయ ఎంత భాగ్యమో స్వామి..!!
మా సీతారామ స్వామి..!!

-మీ లక్ష్మి