Saturday, December 20, 2014

on "mother" by abhi khandavilli

అమ్మంటే అమ్రుతానికి ప్రతిరూపం, కానీ పిల్లలంటే అమ్మకు అపురూపం అమ్మ అన్న పిలుపుతో మొదలౌతుంది మానవ జీవితం, అమ్మ పిలుపులో ఉన్న తీయదనం మకరందానికి కూడా లేదు, అమ్మ నీడలో ఉన్న చల్లదనం పండు వెన్నెలకు కూడా లేదు, అమ్మను సృష్టించిన దేవుడు కూడా ఒక అమ్మ కొడుకే కదా..! అమ్మ వడి తలిపిస్తుంది కోటి మల్లె పందిరిలు, మమకారం, ప్రేమ,ఆప్యాయత, అనురాగం కలిపి అమ్మను సృష్టించాడు బ్రహ్మ, కాని అమ్మలోని మాధుర్యాన్ని అందరి కంటే ముందు అశ్వాదించడు అందుకే అందరికీ అమ్మను సృష్టించాడు అమ్మ పాడిన జోల పాటతో ఓనమాలు నేర్చుకున్న త్యాగయ్య అమ్మ పాటను అందరికి పంచి అమ్మలోని కమ్మదనాన్ని కదనంగా వినిపించాడు జగత్ సృష్టికర్త అమ్మ కోసం పదే పదే జన్మించాడు, జన్మిస్తూనే ఉన్నాడు అమ్మ చేతి కమ్మనైన గోరుముద్ద విలువ కట్టలేని నోట్లు, అమ్మా అన్న పిలుపు నోచుకోని వారు ఉన్నారు కోట్లు, అమ్మంటే అందరికీ అమ్మ కదా .. తన చనుబాలతో వంద సంవత్సరాలు ఆయుషును పొసేది అమ్మ, ఇటువంటి అమ్మ ఇప్పుడు అంగడి లో బొమ్మ అయ్యింది, కన్న పేగు తనకు ఉరి తాడు అవుతుంటే, పేగు బంధానికి విలువ ఇచ్చి తన ప్రాణం విడుస్తున్నది దేవుడా ... అందుకే అమ్మకు సాటి మరెవ్వరు లేరు అందుకే అందుకే పుట్టించు నన్ను ఒక అమ్మకు వేలసార్లు.....

No comments:

Post a Comment