Monday, September 19, 2016

నీతో ఉండే ఒంటరితనం..
ఎంత గొప్పదో తెలుసా..??!!
నిన్ను నీకే పరిచయం చేసేంత..!!
ఆ ఒంటరితనాన్ని చీల్చడానికి నువ్వు చేసే ప్రయత్నమంత..!!
తట్టుకోలేక నీవు బిగ్గరగా పెట్టే కేకలంత..!!
అంతే కాదు....
దురాత్ములను నీ చెంతకు రానివ్వనంత..!!
ప్రకృతికి నిన్ను దగ్గర చేసేంత..!!
నీలో నిండి ఉన్న భావాలన్ని బయటకి తీసేంత..!!
నీ గుండెల్లో ఉన్న దేవుడిని నీకు గురుతుకు తెచ్చేంత..!!
కళ్ళు మూసుకుని మౌనంగా నీవుంటే.. వచ్చే ప్రశాంతతంత..!!
- మీ లక్ష్మి

నీ అవసరం..
ఇంకొకరికి అనవసరం..!!
దానిని తీర్చడానికి..
తీరిక ఎవ్వరి సొంతం..!!
నీకు కావలసిందేదో..
ఉండాల్సినదేదో..
తెలుసుకోవడం..
ఆపై సమకూర్చుకోవడం..
నీ ధర్మం..!!
ఇతరులపై నమ్మకముంచి..
నీకేదో చెస్తారని తలచి..
బ్రతుకు సాగించడం..
నీకే నష్టం..!!
ఆపై నిన్నే వెక్కిరిస్తుంది..
నీ అవసరం..!!
భ్రష్టమవుతుంది నీ జీవితం..!!

- మీ లక్ష్మి

ప్రభాతం వచ్చినట్లు..
చీకట‌్లను చీల్చిన్నట్లు..
తొలగించును నీ అజ్ఞానం..
ఒక పుస్తకం..!!
నువ్వు నవ్వినా..ఏడ్చినా..
ఓడినా.. గెలిచినా..
నీతోనే ఉండేదీ..
ఒక పుస్తకం..!!
లాభమే కానీ..
నష్టమే చేయనిదీ..
ఒక పుస్తకం..!!
మోసాన్ని..ద్వేషాన్ని..
కల్లనీ కపటాన్ని..
దానికంటనీయదే..
ఒక పుస్తకం..!!
ఏ దేశమైనా..ఏ కాలమైనా..
నీతో నిలిచేది.. నిన్ను ఉద్ధరించేది..
ఒక పుస్తకం..!!
దారి చూపే దీపమయ్యేది..
ఔన్నత్యాన్ని నీకు అందించేది..
నీలో మంచిని అవలంబించేది..
ఒక పుస్తకం..!!
ఓ మంచి పుస్తకం..!!

- మీ లక్ష్మి

పంకంలో కొలువున్న పంకజం యొక్క తేనె..
పిలిచింది త్రేనెటీగని..!!
ఆ బురదను లెక్కసేయక..
పరుగులు తీసింది దాని చిరు రెక్కలతో..!!
దానికి ఇంపైన ఆ మధువు కోసం..!!
అటులే...
చెడు అనే ఒక లోకముంటే..
ఆ లోకంలో చిరు దివ్వెలా మంచి ఉంటే..
ఆ దివ్వె ఇచ్చు వెలుగు కొరకై..
ఆ చెడును లెక్కసేయక..
దానిని నీకు అంటనీయక..
నీవునూ బయలుదేరు..!!
మంచి మనీషివై నిలిచి చూపు..!!

- మీ లక్ష్మి

ఏదీ శాశ్వతం కాదని..
అంతమనేది అన్నటికీ తథ్యమని..
తెలియనిదెవ్వరికి??
అయినా కోరికలు చావవు..!!
ఆశల పల్లకీలో ఊరేగుతూ..
అన్నిటిపై ప్రేమలు పెంచుకొంటూ..
తిరిగే జీవుల వాంఛలకి హద్దులుండవు..!!
జీవితంలోకి ఒకరు రాగానే..
వారితోనే అంతం చూడాలనుకుంటారు..!!
ఆ ప్రయాణం ఎంత వరకో..
ఆ మజిలీ ఎక్కడి వరకో..
తేల్చే శక్తి వేరే ఉన్నదని..
ఎరుకలేనిది ఎందరికి..??
అయినా మంకుపట్టు వీడరు..!!
నా రాత నేనే రాస్తానంటారు..!!
అవివేకం పొరలు కప్పితే..
మనిషికి విచక్షణ తప్పెనేమో..!!
అన్నీ నాతోనే.. "కడ" అనేది ఎరుగకనే ఉంటాయన్న భ్రమ ఎప్పటికీ వీడదేమో..!!

- మీ లక్ష్మి

చిన్ని పెదవులు..
మాటల మల్లియలు చల్లగానే..
చిట్టి పాదాలు..
బుడి బుడి అడుగులేయగానే..
పాఠశాలకంపుతారు..!!
చదువులక్కడ చక్కబెట్టగానే..
హమ్మయ్య అనుకొనేలోపే..
కళాశాల అదిగో అంటారు..!!
కల ఒకటున్నా.. చంపుకొని..
ఇష్టపడకున్నా కష్టపడి గట్టెక్కగానే..
ఇంకో అడుగుందర్రా అని చెబుతారు..!!
ఆ అడుగు భారంగా వేసి..
మరో మెట్టెక్కగానే..
పెళ్ళి ముచ్చట్లాడుతారు..!!
ఆ కార్యం కాస్తా అవగానే..
ఇంకో జీవితానికి శ్రీకారమెప్పుడని ప్రశ్నిస్తారు..!!
ఇవన్నీ చేస్తాం..ఎన్ని అడుగులైనా వేస్తాం
కానీ "నిన్ను నువ్వే కోల్పోవాలి" అని అంటే..
కలలు కనే హక్కులకి మరణ శాసనాలు రాయాలని అంటే..
ఎలాగ చేయడం..??
గొడ్డులా అలా ఎలా బ్రతకడం..??
చెప్పండి..!! మా ప్రశ్నలకు సమాధానాలనివ్వండి..!!
మీ హృదయాల లోతులకు వెళ్ళండి...
మనుషులుగా ఆలోచించి..
కొన ఊపిరులతో ఉన్న మా వ్యక్తిత్వాలను కాపాడండి..!!

- మీ లక్ష్మి

నిత్యం దుఃఖాలతో యుద్ధం చేస్తుంది మనసు..
సుఖాలను హత్తుకుంటుంది ఆ మనసు..
దుఃఖమంటే భయం.. కన్నీరు వొలికించాలని..!!
సుఖమంటే వల్లమానిన అభిమానం.. నవ్వులు పూయిస్తుందని..!!
కానీ ఆ మనసుకు తెలియదు.. సుఖం నటించే మనుషులను తోడుగా ఇస్తుందని..!!
దుఃఖమే నిజంగా నీ వారెవరో తెలుపుతుందని..!!
ఎప్పుడు తెలుసుకుంటుందో...??!!

- మీ లక్ష్మి

సులువుగా వచ్చింది..
అందిపుచ్చుకున్నావు..!!
అది ఒక ఉచ్చు అని..
ఎరుగలేకపోయేవు..!!
భవిష్యత్తులో ఎదుర్కొనే సవాళ్ళని..
తెలుసుకోలేకపోయేవు..!!
పూల దారిలా ముస్తాబైనది నీ బాట..
ముళ్ళు ముందరున్నవని..
తేలుసుకోలేకపోయేవు..!!
కళ్ళకు కనపడే భోగాలను చూసేవు..
రాబోయే కఠిన పరీక్షల వంక..
కన్నెత్తైనా చూసి ఎరుగవు..!!
ఊరకనే వచ్చిందేదీ నిలువదని..
అదొక గాజు బొమ్మని..
నీవు తెలుసుకోలేవు..!!
అన్నీ నీ సొంతమని..
అబ్బో ఎగిరెగిరిపడేవు..!!
ఏదో ఒక రోజు నీవు చతికిలబడేవు..!!
నా మాట నీ మనసుకి చేరవేశావా..
పతనం దరిచేరవు..!!
ఆ మాట నమ్మి అడుగిడినావా..
విజయం దరి చేరేవు..!!

- మీ లక్ష్మి

ఎన్నో వస్తువులు నచ్చుతాయి..!!
సరదాలు తీరుస్తాయి..!!
సంతోషాన్నిస్తాయి..!!
మనిషికి "ఎన్నో" అన్న పదం..
భలేగా నచ్చినట్టున్నది..!!
ఆతని మెదడులోన దూరి అట్టే కూర్చున్నది..!!
మనసిచ్చే విషయంలో..
ప్రేమానురాగాల విషయంలో కూడా..
ఆ "ఎన్నో" అన్న పదం వచ్చి చేరింది..!!
ఎన్నో మనసులకి ప్రేమను ఇస్తారు..!!
ఎన్నో తనువులతో పొందును కోరేరు..!!
వస్తువుకీ.. మనుషులకీ..
బేధం ఎరుగరు..!!
ఎన్నో హృదయాలకు అలా ఖేదం మిగులుస్తారు..!!

- మీ లక్ష్మి

Saturday, September 17, 2016

కరువయ్యాయి..!!

కన్నీటీ ముత్యానికి..
దోసిలి ఆల్చిప్పలు కరువయ్యాయి..!!
పెదవుల పూరేకులకి..
వికసాన్నిచ్చే నవ్వులు కరువయ్యాయి..!!
ఏమైనా విందామన్న చెవులకి..
వినసొంపైన ఊసులు కరువయ్యాయి..!!
నడిచే పాదాలకి..
తోడొచ్చే అడుగులు కరువయ్యాయి..!!
నిరంతరం కొట్టుకునే గుండెకి..
మరో గుండె చప్పుళ్ళు కరువయ్యాయి..!!
వెతికే చూపులకి..
మానవత్వపు జాడలు కరువయ్యాయి..!!
పెల్లుబికే బాధకి..
ఓదార్పు నీడలు కరువయ్యాయి..!!
ఒంటరి బ్రతుకుకి..
సుఖసంతోషాలు కరువయ్యాయి..!!
తన వ్యతను చెప్పడానికి..
మాటలే కరువయ్యాయి..!!

- మీ లక్ష్మి

Thursday, September 15, 2016

My rendition.. taanu nenu song

Listen to Taanu nenu by Lakshmi Priyanka Daita #np on #SoundCloud https://soundcloud.com/lakshmi-priyanka-daita/taanu-nenu

Tuesday, September 13, 2016

అవసరాన్ని పెనవేసుకుంటున్నాయి..
నిన్ను కాదు...!!
అవకాశాన్ని వెతుక్కుంటున్నాయి..
నీ తోడుని కాదు...!!
అందలాన్ని ఏర్పరచుకుంటున్నాయి..
మమతానురాగాలను కాదు...!!
ఏంటవి అని అడుగుతారేమో....!!
రకరకాలైన బంధాలు..!!
నీతో సాగుతోన్న అనుబంధాలు..!!
అవి ఆపేక్షలు కావు..
వట్టి ఆకర్షణలు...!!
అవి ఆప్యాయతలు కావు..
చీకటికి ఆలవాలములు..!!
ఉచ్చుల అవలోకనాలు..!!

- మీ లక్ష్మి

నాలుగు కైపెక్కే మాటలు..
ఓర చూపుల ఎరలు..
నీకై ఎదురు చూస్తున్నాయి..!!
అటు వైపు పోమాకు..!!
..
..
నమ్మి ..అటువైపు వెళ్ళిపోయావో..
ఆ ఎరల్లో చిక్కుకొని మోసపోయావో...
తప్పు ఎలా చేశావన్న ప్రశ్నలు..
మన వారి దెప్పిపొడువులు
సమాజం వేసేటి చురకలు..
తప్పవు..!!
కన్నీటి అలలు నిన్ను ముంచకుండా ఉండవు..!!

- మీ లక్ష్మి

Saturday, September 10, 2016

చిన్న దెబ్బ తగిలి..
స్నేహమనే వృక్షం కూలునా..??
అలా కూలితే..
దాని వేర్లు బలంగా లేనట్లే..!!
బలహీనమైన ఆ స్నేహాల మధ్య మనమున్నా...
మనకి ఏ తోడూ లేనట్లే..!!

- మీ లక్ష్మి