Monday, March 20, 2017

జీవితం..
ఊసరవెల్లి..!!
మార్పనేది లేక..
ఉండలేదు..!!
ఒక్కో స్థితిలో..
ఒక్కోలా మారిపోతుంది..!!
అది చూస్తూ ఉండిపోవడం తప్ప..
ఈ శరీరం ఏమి చేయగలుగుతుంది..!!
బాల్యంలో ఒకలా..
యవ్వనంలో ఒకలా..
జీవిత భాగస్వామి వచ్చే ముందు ఒకలా..
వచ్చాక మరోలా..
పిల్లలు పుట్టాక ఒకలా..
వారు ఎదుగుతుంటే..
వార్థక్యంలో ఒకలా..!!
కాల క్రమేణా..
మనుషులు మారిపోతున్నారని..
ఇదివరకులా లేరని..
మనకి బాధ కలుగుతుంది..!!
కానీ మారింది మనిషి కాదే..
ఈ జీవితం..!!
భూమి సూర్యుని చుట్టూ తిరిగి..
ఒక పూట పగలుని.. ఒక పూట రాత్రిని..
పరిచయం చేసినట్లూ..
అలా తిరుగుతూ..
వేరు వేరు పరిస్థితులను పరిచయం చేస్తుంది..!!
ఒకేలా ఉండలేదు పాపం..!!

- మీ లక్ష్మి

స్వచ్ఛమైన ఆరాధనకి..
కన్నీరు బహుమతి అంట..!!
అంత కంటే ఏమీ మిగలదు..!!
ఆ కన్నీరైనా తోడుందని..
సంతోషపడాలేమో..!!
కాస్త చెక్కిట జారి..
మనసు  భారాన్ని కూడా..
గుండె నుండి జార్చేస్తుందని..
తేలికతనం ఇస్తుందని..
సంతోషపడాలేమో..!!

- మీ లక్ష్మి

Saturday, March 11, 2017

నా బాధకి..
నీ మాట ఒక మందు..!!
ఏదో శక్తి..
ఏదో మాయ..
ఉందిలే దానియందు..!!
మనసులోని భారానికి..
తేలికతనాన్ని పరిచయం చేసేలా...!!
ఆగని కన్నీటికి..
ఆనకట్ట కట్టేలా...!!
ప్రతి రోజూ..
నీ పెదవుల ఆకాశం నుండి..
చిరుజల్లులై..
పదాలు జాలువారుతాయని..
చాతక పక్షిలా..
మనసు ఎదురుచూస్తుంది..!!
దోసిళ్ళు పట్టి నీ వైపుకి చూస్తూ ఉంటుంది..!!
..
..
కాస్త కరుణించవూ..!!

- మీ లక్ష్మి

రెక్కలు తొడిగి...
ఎగురుదామని..
కలల సౌధాలు నిర్మించుకుంటూ..
ఉన్నది పాపం అమాయకురాలు..!!
అంతా బాగున్నది...
అత్యాచారపు కోరల్లో చిక్కుకునే వరకు...!!
దుర్మార్గపు బలం తనను అబలగ మార్చేవరకు..!!
నడి రాతిరి చీకట్లు 
జీవితాన్ని కమ్మేయగా...
పగలు కూడ రేయిలాగ తోచగా...
న్యాయమనే వెలుగు కొరకు 
వెతలను మరపు దారి పట్టించి...
వెతుకులాట సలిపింది...!!
అయినా నిశీధి అంధకారం
వీడలేదు పాపం..!!
బ్రతుకు ఆయెను తనకొక శాపం..!!
వెక్కిరింత మిగిల్చింది న్యాయం..!!
వెలివేసింది దయ లేని సమాజం..!!
....
ప్రకాశము లేక..
వెలుగు కిరణాలు సోకక...
తిమిరాల జాడలోనే పయనం సాగాలిక...!!
ఉదయం తలుపు తట్టని నిశీధిలా తన జీవనం మిగిలిందిక...!!
....
మరలా కాంతి ప్రసరణ ఎప్పుడో...??!!
ప్రభాతమై తనను పలకరించేదెవరో...??!!

- మీ లక్ష్మి

Friday, March 10, 2017

అభిప్రాయాలు చెప్పడానికి..
జీవితం ఒక నాటికో..
చలనచిత్రమో కాదు గురూ..!!
అలా అభిప్రాయాల కోసం..
ప్రపంచంలో చాలా ఉన్నాయి..!!
ఒక్క మనిషి జీవితం తప్ప..!!

- మీ లక్ష్మి

వర్షం దాచేసిన మన కన్నీటిని..
మనసు తలుపుల వెనుక నుండి
వచ్చే గుండె చప్పుడులోని గతిని..
లోలోపల తొలిచేసే అంతులేని బాధని..
ఆ బాధని కనపడనీక పెదవులపై వచ్చే అబద్ధపు నవ్వుని..
ప్రతి కన్నూ చూడలేదు..!!
అలా చూడగలిగిన కళ్ళు ఎన్నో లేవు..!!
అలా లోతులు చూడగలిగితే వాటిని.. దివ్య చక్షువులనాలేమో..!!

- మీ లక్ష్మి