ప్రపంచమంత భారాన్ని దించేసే శక్తి ఉంది..!!
ఆ నవ్వులు మలయమారుతంలా..
జారే చమట చుక్కలకి చల్లదనాన్నిసతుంటే..
అన్నీ మరచినట్టుంటుంది..!!
ఊరట.. బాసట..
అన్నీ ఆ చిరునవ్వే..!!
- మీ లక్ష్మి
THESE ARE MY THOUGHTS AND I HOPE U PPL WILL LIKE THIS BLOG :) I WELCOME COMMENTS AND FEEDBACK. BUT PLEASE DO NOT POST ANYTHING OBSCENE BY WAY OF COMMENTS
ఒక్కోరోజు..
ఒక్కో రంగు జీవితానికి అంటుతుంది..!!
ఒక రోజు నమ్మకం రంగు..
ఒక రోజు ద్రోహం రంగు..
ఒక రోజు స్నేహం రంగు..
ఒక రోజు మోసం రంగు..
ఒక రోజు ప్రేమ రంగు..
ఒక రోజు ద్వేషం రంగు..
ఒక రోజు సంతోషం రంగు..
ఒక రోజు బాధ రంగు..
ఒక రోజు నవ్వు రంగు..
ఇంకో రోజు కన్నీటి రంగు..!!
ఇలా ఎన్ని రంగులో..!!
ఆ అన్ని రంగులూ దాచుకొన్న..
జీవితానికి ఎన్ని హంగులో..!!
- మీ లక్ష్మి
జీవితం..
ఊసరవెల్లి..!!
మార్పనేది లేక..
ఉండలేదు..!!
ఒక్కో స్థితిలో..
ఒక్కోలా మారిపోతుంది..!!
అది చూస్తూ ఉండిపోవడం తప్ప..
ఈ శరీరం ఏమి చేయగలుగుతుంది..!!
బాల్యంలో ఒకలా..
యవ్వనంలో ఒకలా..
జీవిత భాగస్వామి వచ్చే ముందు ఒకలా..
వచ్చాక మరోలా..
పిల్లలు పుట్టాక ఒకలా..
వారు ఎదుగుతుంటే..
వార్థక్యంలో ఒకలా..!!
కాల క్రమేణా..
మనుషులు మారిపోతున్నారని..
ఇదివరకులా లేరని..
మనకి బాధ కలుగుతుంది..!!
కానీ మారింది మనిషి కాదే..
ఈ జీవితం..!!
భూమి సూర్యుని చుట్టూ తిరిగి..
ఒక పూట పగలుని.. ఒక పూట రాత్రిని..
పరిచయం చేసినట్లూ..
అలా తిరుగుతూ..
వేరు వేరు పరిస్థితులను పరిచయం చేస్తుంది..!!
ఒకేలా ఉండలేదు పాపం..!!
- మీ లక్ష్మి
నా బాధకి..
నీ మాట ఒక మందు..!!
ఏదో శక్తి..
ఏదో మాయ..
ఉందిలే దానియందు..!!
మనసులోని భారానికి..
తేలికతనాన్ని పరిచయం చేసేలా...!!
ఆగని కన్నీటికి..
ఆనకట్ట కట్టేలా...!!
ప్రతి రోజూ..
నీ పెదవుల ఆకాశం నుండి..
చిరుజల్లులై..
పదాలు జాలువారుతాయని..
చాతక పక్షిలా..
మనసు ఎదురుచూస్తుంది..!!
దోసిళ్ళు పట్టి నీ వైపుకి చూస్తూ ఉంటుంది..!!
..
..
కాస్త కరుణించవూ..!!
- మీ లక్ష్మి
రెక్కలు తొడిగి...
ఎగురుదామని..
కలల సౌధాలు నిర్మించుకుంటూ..
ఉన్నది పాపం అమాయకురాలు..!!
అంతా బాగున్నది...
అత్యాచారపు కోరల్లో చిక్కుకునే వరకు...!!
దుర్మార్గపు బలం తనను అబలగ మార్చేవరకు..!!
నడి రాతిరి చీకట్లు
జీవితాన్ని కమ్మేయగా...
పగలు కూడ రేయిలాగ తోచగా...
న్యాయమనే వెలుగు కొరకు
వెతలను మరపు దారి పట్టించి...
వెతుకులాట సలిపింది...!!
అయినా నిశీధి అంధకారం
వీడలేదు పాపం..!!
బ్రతుకు ఆయెను తనకొక శాపం..!!
వెక్కిరింత మిగిల్చింది న్యాయం..!!
వెలివేసింది దయ లేని సమాజం..!!
....
ప్రకాశము లేక..
వెలుగు కిరణాలు సోకక...
తిమిరాల జాడలోనే పయనం సాగాలిక...!!
ఉదయం తలుపు తట్టని నిశీధిలా తన జీవనం మిగిలిందిక...!!
....
మరలా కాంతి ప్రసరణ ఎప్పుడో...??!!
ప్రభాతమై తనను పలకరించేదెవరో...??!!
- మీ లక్ష్మి
నిదురలో..
ఏనాడూ అమ్మ ఒడి తోడు లేదు..!!
ఆకలిలో ఓ ముద్ద ఏ చేయీ తినిపించలేదు..!!
అలసటలో ఊరటను ఎవ్వరు ఇవ్వలేదు..!!
ఓడిపోయినప్పుడు ఏ చేయి భుజం తట్టి ఎరుగదు..!!
పడినప్పుడు ఎవ్వరూ తిరిగి లేపినది లేదు..!!
ఇవన్నీ ప్రకృతే చేసింది..!!
అదే ఎప్పుడూ తోడుంది..!!
కన్నీరు బాధను కరిగించింది..!!
కలతలు మరచి ముందడుగేయాలని అడుగు కోరింది..!!
అందుకే.. ఎన్ని వేదనలున్నా..
నేను తడబడంది..!!
ఎంత బాధ ఉన్నా..
వెనకడుగు వేయంది..!!
- మీ లక్ష్మి