Saturday, July 18, 2020


SAURYAM

వీరత్వాన్ని..
శౌర్యాన్ని..
ఎక్కడినుండో అప్పు తెచ్చుకోనక్కరలేదు..!!
..
..
యుద్ధకళను..
విప్లవాన్ని..
ఎక్కడినుండో అరువు తెచ్చుకోనక్కరలేదు..!!
..
..
వీటన్నింటినీ..
ప్రపంచానికి పరిచయం చేసినదే..
భరత జాతి ..!!
విదేశీ గడ్డపై
పుట్టినది కాదు ఈ రీతి..!!
భారతదేశ సొత్తు..
ధర్మం కోసం పోరాడగలిగే..
అమితమైన శక్తి..!!
..
..
ఇక అబద్ధపు గొప్పదనాలు
చొప్పించుకొనే..
పాశ్చాత్యుల నీతులు సూక్తులు
మాకు అక్కర్లేదు..!!
చివరిగా..
అద్దె సరుకులు మాకు అవసరం లేదు..!!
- మీ లక్ష్మి

VIRAAMAM

విరామం ఎరుగని రెక్కలు..!!
అవి ఆడుతూ..
ఇంకో నాలుగు రెక్కలెగిరేలా ..
పోరాడుతూనే ఉంటాయి..!!
గడియారంలో..
ఇరవైనాలుగు గంటలు కూడా
పరుగుపందెంలో వాటితో
ఓడిపోతాయి..!!
సేదతీరడానికి కొన్ని క్షణాలు సైతం..
దొరకము పొమ్మంటాయి..!!
ఏ బహుమతి లేని
జీవితం అనే పోటీలో..
తన వారిని అద్దరికి చేర్చి..
అదే గెలుపనుకుంటాయి..!!
అలసటకి బదులుగా
ఊరట అనేది లేక..
వాటికవే సర్దిచెప్పుకుంటాయి..!!
కన్నీటిని తుడిచే
ఆసరా లేక..
తిరిగి కన్నీరవుతాయి..!!
కడపటి కాలం వరకూ..
క‌ష్టపడుతూనే ఉంటాయి
ఉసూరనకుండా..
కిక్కురుమనకుండా..
శ్రమతో స్నేహం చేస్తూనే ఉంటాయి..!!
ఫలితం..
తన వారి ఆనందం..
తన వారి అభివృద్ధి..!!
కానీ..
తనకి మిగిలేవి..
జీవన పర్యంతం
పోరాటం..
త్యాగం..
ఒంటరితనం..
చివరికి కరిగిపోవడం..!!
అందరినీ ఓ గూటికి చేర్చినా..
వాటికి చిక్కదు ఏ తీరం..!!
నిరంతర పయనమే..
వాటి నైజం..!!
- మీ లక్ష్మి

NATANA

కొన్ని కలలు తీరలేదన్న బాధ..
ఎవ్వరికీ మనం చెప్పుకోలేని గాధ..!!
పైకి నవ్వి కన్నీళ్ళు దాచుకోవడం..
ఆ కన్నీళ్ళతోనే మనసు నింపుకోవడం..!!
మనిషికి మామూలే..!!
మామూలుగా ఉన్నట్లు నటించే నటనలే..!!
- మీ లక్ష్మి

Wednesday, January 15, 2020

మనిషి రూపం ఒకటే..
పరిస్థితులే..
మార్పు అనే రంగు అద్ది..
అతనికి కొత్తదనాన్ని ఇస్తాయి..!!

- మీ లక్ష్మి

"naadi"

"నాది" అన్న భావనకి..
అంతం లేదనుకోవడం మూర్ఖత్వం..!!
ఇవాళ "నీది" రేపటికి "వేరొకరిది" కావచ్చు
ఇవాళ "వేరొకరిది" రేపు "నీది" కావచ్చు..!!
మారనిది.. నీ పిచ్చితనం మాత్రమే..!!
నీతోనే ఉండిపోవడానికే ఏదీ రాదు..
నువ్వు పొమ్మంటే.. ఏదీ పోదు..!!

- మీ లక్ష్మి

Sunday, April 8, 2018

నిన్ను తలిచా..
నిన్నే పిలిచా..
దశరథ రామ..!!
ఎల్లవేళలా..
నిను ధ్యానించా..
సీతా రామ..!!
నా చేతల యందు..
మాటలయందు..
నిన్నే కంటిని..
సత్య తత్పర రామ..!!
ఏ మనస్సు కోవెలలోన..
నిన్నర్చించా..
కల్యాణ రామ..!!
నాలోని దుర్గుణములను..
సంహరించే..
కోదండరామ..
నిన్నే అనమరతం తలిచా..!!
నా కంఠమునకు
నీవిచ్చిన స్వరములచే..
నిన్నే పాడితిని..
జనకజ మనోహర రామ..!!
నా కలమంచున జన్మించు
పదములను..
నీకై అర్పించితి..
సర్వేశ రామ..!!
నిన్నే స్మరించితి..
కరుణాలవాల రామ..!!
నీ దర్శమునకై..
తపించితి..!!
పురుషోత్తమ రామ..!!
నీ కరుణకై..
ఎదురుచూచితి..
పరమేశ రామ..!!
ఇకనైన దయజూడు..
దయాసముద్ర రామ..!!